వయసుతో సంబంధం లేకుండా యంగ్ హీరోలకు సమానంగా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు బాలకృష్ణ. కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా ‘రూలర్’ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.రీసెంట్ గా షూటింగ్ ను పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు చేసుకుంటుంది. ఈ సినిమాను క్రిస్మస్ పండుగ కానుకగా ఈ సినిమాను డిసెంబర్ 20వ తేదీన రిలీజ్ చేయనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈ సినిమా తర్వాత వెంటనే బోయపాటి సినిమాను లైన్ పెట్టాడు. ఇటీవలే పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకునే పనిలో వుంది. ఇదిలా ఉండగా ఇప్పుడు తాజాగా మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి వినిపిస్తుంది. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా వచ్చిన సోషియో ఫాంటసీ మూవీ ‘ఆదిత్య 369’ కు సీక్వెల్ ప్లాన్ చేస్తున్నట్టు గతకొద్ది కాలంగా వింటూనే విన్నాం.
నిజానికి బాలయ్య 100వ చిత్రంగా ‘ఆదిత్య 999’ రావాల్సింది. దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కూడా అప్పట్లో బాలకృష్ణ తో మంతనాలు జరిపినట్టు తెలుసు. అయితే అనుకోని కారణాల వల్ల ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ సినిమా సెట్స్ పైకి వెళ్లింది. ఆ తరువాత బాలయ్య ఎన్టీఆర్ బయోపిక్ తో బిజీ అవ్వడం ఆ తర్వాత వరుస సినిమాలు చేయడంతో బిజీ అయిపోయారు. ఇప్పుడు మరోసారి ఈవార్త తెరపైకి వచ్చింది. ఈ సీక్వెల్ ను బాలకృష్ణ స్వయంగా ఈ సినిమాని డైరెక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. బోయపాటి సినిమా అయిపోయిన తర్వాత ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లే ప్లాన్ చేస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇవి కేవలం వార్తలేనా.. ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే మాత్రం అధికారిక ప్రకటన రావాల్సిందే.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























