“అల్లసాని వారి పద్యమా… విశ్వనాథ వారి ముత్యమా”… పాటలోని పంక్తులకు చిరునామాగా నిలచే కథానాయిక రాశి ఖన్నా. తెలుగునాట నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ టాలెంటెడ్ బ్యూటీ… గత ఏడాది ‘ఇమైక నోడిగళ్’ చిత్రంతో కోలీవుడ్‌లోనూ ఎంట్రీ ఇచ్చింది. అందులో అభినయానికి అవకాశమున్న పాత్రలో నటించి విమర్శకుల మెప్పు పొందిన రాశి… ఇప్పుడు తమిళనాట వరుస అవకాశాలను చేజిక్కించుకుంటోంది. ఇప్పటికే `అడంగమరు`, ‘అయోగ్య’ (తెలుగులో ‘టెంపర్’) వంటి తమిళ చిత్రాల్లో సందడి చేసిన ఈ భామ… ప్రస్తుతం ‘షైతాన్ కా బచ్చా’, ‘సంగ తమిళన్’ సినిమాలతో బిజీగా ఉంది. అంతేకాదు… ఓ క్రేజీ ప్రాజెక్ట్‌లోనూ నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని సమాచారం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆ వివరాల్లోకి వెళితే… లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ గా ‘పొన్నియిన్ సెల్వన్’ రూపొందనున్న సంగతి తెలిసిందే. భారీ తారాగణంతో తెరకెక్కనున్న ఈ సినిమాలో… ఓ కీలక పాత్ర కోసం రాశి ఖన్నా ఎంపికైనట్టు కోలీవుడ్ టాక్. అంతేకాదు… రాశి కూడా డేట్స్ అడ్జెస్ట్ చేసే పనిలో ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే రాశి ఎంట్రీపై క్లారిటీ వస్తుందేమో చూడాలి.
కాగా… చోళుల చరిత్ర నేపథ్యంలో కల్కి కృష్ణమూర్తి రాసిన నవలాధారంగా రూపొందుతున్న ‘పొన్నియిన్ సెల్వన్’లో… విలక్షణ నటుడు విక్రమ్, మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యా రాయ్ బచ్చన్ ప్రధాన పాత్రలు పోషిస్తుండగా… ‘జయం’ రవి, కార్తీ, అధర్వ మురళి, అనుష్క, కీర్తి సురేష్, అమలాపాల్ ముఖ్య భూమికల్లో నటిస్తున్నట్లు సమాచారం.
[youtube_video videoid=uBOUURSm-S]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: