సుజిత్ దర్శకత్వంలో ప్రభాస్ ప్రధాన పాత్రలో భారీ బడ్జెట్ తో ‘సాహో’ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇంకా నెలరోజుల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలు అప్పుడే మొదలుపెట్టేశారు. దీనిలో భాగంగానే ఈ సినిమా నుండి టీజర్ ను.. సయ్యా సైకో అనే పాటను రిలీజ్ చేయగా.. ఇప్పుడు మరో పాటను విడుదల చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
తాజాగా ‘ఏ చోట నువ్వున్నా’ సాంగ్ టీజర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం నాలుగు భాషల్లో ఒకేసారి రిలీజ్ చేశారు. ఈ నాలుగు వర్షెన్స్ కు గురు రంధవా మ్యూజిక్ అందించాడు. “నిన్నను మరిచేలా నిను ప్రేమిస్తాలే .. నీ కన్నులు అలిసేలా నే కనిపిస్తాలే’ అంటు వచ్చే ఈ పాటను ప్రభాస్ – శ్రద్ధా కపూర్ కాంబినేషన్లో విదేశాల్లోని అందమైన లొకేషన్స్ లో ఈ సాంగ్ ను చిత్రీకరించారు. ఈ సాంగులో ప్రభాస్ మరింత హ్యాండ్సమ్ గా కనిపిస్తుండగా .. శ్రద్ధా కపూర్ కూడా మరింత గ్లామరస్ గా కనువిందు చేస్తోంది.
కాగా ఈ సినిమాలో ప్రభాస్ సరసన శ్రద్దా కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా.. నీల్ నితిన్, జాకీ ష్రాఫ్, మురళీ శర్మ, వెన్నెల కిషోర్, అరుణ్ విజయ్, మందిరా బేడీ ఇలా పులువురు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. యువీ క్రియేషన్స్ అధినేతలు వంశీ-ప్రమోద్ అత్యంత భారీ బడ్జెట్ తో ఏక కాలంలో తెలుగు, తమిళ, హిందీ, మలయాళ భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
[youtube_video videoid=8KwZW-wH0PI]
[youtube_video videoid=mBn_G981wcc]
[youtube_video videoid=hvKOFcmRbUA]
[youtube_video videoid=0LR_jNbmW4w]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























