సినిమా ఇండస్ట్రీలో సినిమాల రిలీజ్ టైమ్ లో చాలా తరచుగా వినిపించే మాట “టేబుల్ ప్రాఫిట్”. అంటే రిలీజ్ సమయానికి నిర్మాత పెట్టిన పెట్టుబడి మీద అదనంగా కనిపించే లాభాన్ని “టేబుల్ ప్రాఫిట్” అంటారు. సరదాగా తెలుగులోకి తర్జుమా చేస్తే దీనిని “బల్ల లాభం” అనాలేమో.
పెద్ద స్టార్స్, స్టార్ డైరెక్టర్స్ కాంబినేషన్ సినిమాలకు తప్ప రిలీజ్ కు ముందే టేబుల్ ప్రాఫిట్ చూడటం అనేది చాలా అరుదు.ఒక్కోసారి పెద్ద డైరెక్టర్ , పెద్ద హీరో అయినప్పటికీ అంతకు ముందు వాళ్ల సినిమాలు ఫ్లాప్ అయి ఉంటే రిలీజ్ కు అవసరమైన బిజినెస్ చేయడం కూడా కష్టమే. కానీ జులై 18న విడుదల కానున్న “ఇస్మార్ట్ శంకర్” బిజినెస్ విషయంలో ఈ లెక్కలు తారుమారయ్యాయి.
వాస్తవానికి దర్శకుడిగా పూరి జగన్నాథ్ గానీ, హీరోగా రామ్ గానీ ఏమాత్రం ఫామ్ లో లేరు. పూరి జగన్నాథ్ సరైన హిట్ చూసి దాదాపు నాలుగేళ్లు అయ్యింది. “టెంపర్” తరువాత జ్యోతిలక్ష్మి, లోఫర్, ఇజం, రోగ్, పైసా వసూల్, మెహబూబా వంటి వరుస ఫ్లాపులతో
పూర్తిగా ఫామ్ మిస్ అయ్యాడు పూరి జగన్నాథ్.ఇక రామ్ పోతినేని విషయానికొస్తే- “నేను శైలజ” హిట్ తరువాత హైపర్, ఉన్నది ఒకటే జిందగీ, హలో గురూ ప్రేమ కోసమే చిత్రాలు వచ్చినప్పటికీ వీటిలో ‘హలో గురూ ప్రేమ కోసమే’ మాత్రమే ఒక మోస్తరు విజయాన్ని సాధించింది. అంటే కెరీర్ పరంగా తనకు కూడా ఒక మంచి హిట్ పడాల్సిన అత్యవసర సందర్భం ఇది.ఫిలిం ట్రేడ్ లెక్కల ప్రకారం ఇలాంటి తరుణంలో వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న సినిమా డెఫిషీట్ రిలీజ్ కు కూడా రెడీ అయిపోవాలి.
కానీ ఆశ్చర్యకరంగా” ఇస్మార్ట్ శంకర్” కు చాలా స్మార్ట్ బిజినెస్ జరిగిందని ఫిలింనగర్ వర్గాల సమాచారం. నిజానికి రవితేజ, ఎన్టీఆర్ తరువాత పూరి జగన్నాథ్ కైండ్ ఆఫ్ టేకింగ్ అండ్ మేకింగ్ లకు సరిపడే, సరితూగే బాడీ లాంగ్వేజ్ , ఇమేజ్ ఉన్న స్మార్ట్ హీరో రామ్ అన్న వాస్తవం బాగా రిజిస్టర్ అయింది. టైటిల్ లోనే మంచి మాస్ అపీల్ ఉండటంతోపాటు ట్రైలర్స్, టీజర్, ఆడియో, ప్రీ రిలీజ్ ఫంక్షన్ లతో ” ఇస్మార్ట్ శంకర్” కు చాలా స్మార్ట్ క్రేజ్ ఏర్పడింది. ఇప్పుడు జరిగిన బిజినెస్ కూడా ఆ క్రేజ్ కు తగిన స్థాయిలోనే జరిగిందట.
ఫిలింనగర్ వర్గాలలో చక్కర్లు కొడుతున్న సమాచారం మేరకు “ఇస్మార్ట్ శంకర్” ప్రీ రిలీజ్ బిజినెస్ ఏరియా వైజ్ గా ఇలా జరిగిందట:
నైజాం
7.2 కోట్లు
ఆంధ్ర
7 కోట్లు
సీడెడ్
3.3 కోట్లు
కర్ణాటక:
2 కోట్లు
సాటిలైట్:
8 కోట్లు
డిజిటల్
4 కోట్లు
హిందీ డబ్బింగ్
6 కోట్లు
అదర్
1 కోట్లు
మొత్తం
38.50 కోట్లు
కొంచెం అటూ ఇటూగా ఈ ఫిగర్స్ మొత్తం దాదాపు ఒరిజినల్ ఫిగర్స్ అనుకోవచ్చు . 25 నుండి 30 కోట్ల మధ్యలో మేకింగ్ అయి ఉంటుంది అనే అంచనాల నేపథ్యంలో ఇది మంచి బిజినెస్ చేసినట్టుగా ఫిలిం ట్రేడ్ భావిస్తోంది. ప్రీవియస్ ట్రాక్ రికార్డు కు భిన్నంగా ఈమధ్య కాలంలో టేబుల్ ప్రాఫిట్ చూస్తున్న సినిమాగా “ఇస్మార్ట్ శంకర్” అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
రిలీజ్ తరువాత ఈ సినిమా బయ్యర్లకు, ఎగ్జిబిటర్లకు కూడా ఇస్మార్ట్ లాభాలు అందించాలని ఆశిద్దాం.
[subscribe]
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.