అర్జున్ రెడ్డి సినిమాను హిందీ కబీర్ సింగ్ పేరుతో రీమేక్ చేసి అక్కడ కూడా మంచి సూపర్ హిట్ కొట్టాడు సందీప్ రెడ్డి వంగా. కలెక్షన్ల పరంగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు కలెక్షన్లు రాబడుతూ దూసుకుపోతుంది. ఇదిలా ఉంటే బాలీవుడ్ ఎంట్రీ బాగానే ఉంది.. సందీప్ కు ఆఫర్లు కూడా బాగానే వస్తున్నాయి అనుకుంటుండగా.. ఈమధ్య కబీర్ సింగ్ సినిమాలోని ఓ సన్నివేశంపై పెద్ద వివాదమే రేగడంతో సందీప్ స్లో అయ్యాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ సినిమాలో కియారా అద్వానీని షాహిద్ కపూర్ కొట్టే సన్నివేశంపై సందీప్ మాట్లాడుతూ.. ‘ఒక అమ్మాయి, అబ్బాయి ఒకర్నొకరు గాఢంగా ప్రేమించుకుంటున్నప్పుడు.. ఒకర్నొకరు కొట్టుకోవడం, ముట్టుకోవడం వంటివి చేయకపోతే ఆ బంధంలో ఎమోషన్ కనిపించదని నా అభిప్రాయం’ అన్నారు. దాంతో ఈ వ్యాఖ్యలు కాస్తా వివాదాస్పదమయ్యాయి. సందీప్ చేసిన వ్యాఖ్యలపై సమంత, చిన్మయి శ్రీపాద, అనసూయ, జ్వాలా గుత్తా తదితరులు సోషల్‌మీడియా వేదికగా మండిపడ్డారు. ఆ తరువాత సందీప్ కూడా వారి విమర్శలపై స్పందించి నేను అలా అనలేదు.. నా మాటలను వక్రీకరించారని క్లారిటీ ఇచ్చాడు.
ఇక ప్రస్తుతం ఈ టాపిక్ ఎండ్ అయిందిలే అనుకుంటుండగా.. మళ్లీ తాప్సీ సందీప్ కు ఇన్ డైరెక్ట్ కౌంటర్ ఇచ్చింది. మహారాష్ట్రలోని నాగ్‌పూర్ జిల్లాలో ఓ వ్యక్తి తన ప్రియురాలిపై అనుమానంతో ఆమె తల పగలగొట్టి దారుణంగా చంపేశాడు. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. అయితే ఈ వార్తకు సంబంధించిన ఓ ఆంగ్ల మీడియా ఆర్టికల్‌ను తాప్సి ట్యాగ్ చేస్తూ.. ‘అనుమానంతో తల పగలగొట్టాడా? బహుశా వారిద్దరూ పిచ్చి ప్రేమలో ఉన్నారేమో. తన నిజమైన ప్రేమను నిరూపించుకోవడానికి ఆమెను చంపేశాడేమో’ అంటూ సందీప్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు తాప్సి. మరి దీనిపై సందీప్ ఎలా స్పందిస్తాడో చూద్దాం..
[youtube_video videoid=lG_Zw5fT5Jo]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: