గతంలో స్మగ్లింగ్ ప్రధానాంశంగా అటవీ నేపథ్యంలో పలు సినిమాలు తెరకెక్కాయి. ఇప్పుడు ఈ నేపథ్యానికి ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీని జోడిస్తూ ఓ తెలుగు సినిమా రాబోతోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆ వివరాల్లోకి వెళితే… ఆర్య
, ఆర్య 2
తరువాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో మరో సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. ఎర్ర చందనం స్మగ్లింగ్ ప్రధానాంశంగా సాగే ఈ చిత్రంలో బన్నీ స్మగ్లర్‌గా కనిపించనున్నట్టు సమాచారం. అంతేకాదు… ఇందులో కొత్త తరహా ప్రేమ కథను కూడా సుకుమార్ ప్రేక్షకులకు పరిచయం చేయనున్నట్టు టాక్. కాగా… ప్రస్తుతం దర్శకుడు సుకుమార్ లొకేషన్ల వేటలో ఉన్నాడని టాక్. సినిమాలో కీలక సన్నివేశాలన్నీ అటవీ నేపథ్యంలో సాగేవి కావడంతో… శేషాచలం అటవీ ప్రాంతంతో పాటు చిత్తూరు, నెల్లూరు ప్రాంతాల్లోని లొకేషన్స్‌ను ఎంపిక చేసే దిశగా సుక్కు ప్లాన్ చేస్తున్నాడట.
బన్నీ సరసన రష్మిక మందన్న కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని హ్యాట్రిక్ విజయాల నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. మే 11న లాంఛనంగా ప్రారంభం కానున్న ఈ సినిమా… ఆగస్టు నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుందని సమాచారం.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: