బాపు రూపొందించిన తెలుగు చిత్రం ‘వంశ వృక్షం’తో కథానాయకుడిగా తొలి అడుగులు వేశాడు ప్రముఖ బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్. తదనంతరం బాలీవుడ్‌లో ‘మిస్టర్ ఇండియా’, ‘తేజాబ్’ తదితర పలు విజయవంతమైన చిత్రాల్లో నటించి అక్కడ అగ్ర కథానాయకుడిగా రాణించాడు. అంతేకాదు… మల్టీస్టారర్ మూవీస్‌కి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే అనిల్ కపూర్… ఇప్పటికీ యంగ్ హీరోస్ సినిమాల్లో కీ రోల్స్ ప్లే చేస్తూనే ఉంటాడు. ప్రస్తుతం కామెడీ, యాక్షన్ ఎంటర్‌టైనర్స్‌తో అలరిస్తున్న అనిల్‌కి ఈ ఏడాది ఎంతో ప్రత్యేకమనే చెప్పాలి. ఎందుకంటే… అటు కూతురు సోనమ్ కపూర్‌కి, ఇటు కొడుకు హర్షవర్షన్ కపూర్‌కి వేర్వేరు సినిమాల కోసం తండ్రిగా నటించే అవకాశం దక్కింది అనిల్‌కి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆ వివరాల్లోకి వెళితే… ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదలైన ‘ఏక్ లడ్‌కీ కో దేఖాతో ఐసా లగా” సినిమాలో తన కూతురు సోనమ్ కపూర్‌తో కలిసి నటించిన అనిల్ కపూర్… వెండితెరపై కూడా సోనమ్‌కు తండ్రి పాత్రలోనే కనిపించాడు. కట్ చేస్తే… 2008లో ఒలంపిక్స్‌లో షూటింగ్ విభాగంలో భారత్‌కు స్వర్ణ పతకాన్ని అందించిన అభినవ్ బింద్రా జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న బయోపిక్‌లో బింద్రా పాత్రలో అనిల్ తనయుడు హర్షవర్షన్ నటిస్తుంటే… తండ్రి పాత్రలో నటిస్తున్నాడు మిస్టర్ కపూర్. మొత్తమ్మీద… ఇలా ఒకే ఏడాదిలో రియల్ లైఫ్ పాత్రలలోనే రీల్ లైఫ్‌లో కూడా కనిపించడం అనిల్ కపూర్ అండ్ ఫ్యామిలీకి ఎప్పటికీ గుర్తుండిపోతుంది.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: