తెలుగు సినీ పరిశ్రమకు మరో దెబ్బ తగిలింది. ఇప్పటికే ప్రముఖ దర్శక, నిర్మాత విజయ బాపినీడు మృతితో షాక్ లో ఉండగా ఇప్పుడు మరో షాక్ తగిలింది. తెలుగు, కన్నడ ప్రముఖ దర్శకురాలు, నిర్మాత నారా జయశ్రీ దేవి గురువారం హైదరాబాద్‌లో కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె ఈ రోజు కన్నుమూశారు. కాగా జయశ్రీ దేవి మృతదేహాన్ని కుటుంబ సభ్యులు బెంగుళూరు తరలించారు. జయశ్రీ మృతిపై పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. జయశ్రీ మృతిపట్ల కన్నడ, తెలుగు సినీ రంగాల ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కన్నడ సూపర్‌స్టార్ విష్ణువర్ధన్, హీరో కుమార్ గోవింద్ కలిసి నటించిన కోన ఇదైతే చిత్రంతో నిర్మాతగా, దర్శకురాలిగా కన్నడ సినిమా ప్రపంచానికి పరిచయం అయ్యారు జయశ్రీ ప్రసాద్. భవానీ అనే చిత్రానికి ఆమె దర్శకత్వం కూడా వహించారు. ఆ తర్వాత దర్శకత్వ బాధ్యతలు పక్కన పెట్టి పూర్తి స్థాయి నిర్మాతగా మారిపోయారు.
కన్నడ, తెలుగు రంగాల్లో కలిపి మొత్తం 20 చిత్రాలను నిర్మించారు. జయశ్రీ నిర్మించిన చివరి చిత్రం ముకుందా మురారీ. ఈ చిత్రంలో కిచ్చ సుదీప్, ఉపేంద్ర కలిసి నటించారు. హిట్ చిత్రాలు శ్రీ మంజునాథ, చంద్రవాసం, వందేమాతరం, జగద్గురు ఆదిశంకర వంటి చిత్రాలని నిర్మించి తెలుగు ప్రేక్షకులకి మంచి వినోదాన్ని అందించారు.
[youtube_video videoid=PZeqgoH1OzQ]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: