మాస్ మహరాజ్ రవితేజ… ఓ సైంటిఫిక్ ఫిక్షన్‌తో థ్రిల్ చేయనున్నాడు. ఆ చిత్రమే `డిస్కో రాజా`. పిరియాడిక్ టచ్‌తో సాగే ఈ చిత్రంలో డిస్కో డ్యాన్సర్ రోల్‌లో దర్శనమివ్వనున్నాడు ఈ టాలెంటెడ్ హీరో. `ఎక్కడికి పోతావు చిన్నవాడా` వంటి జనరంజక చిత్రాన్ని అందించిన విఐ. ఆనంద్ ఈ సినిమాకి దర్శకుడు కాగా… `నేల టిక్కెట్టు` ఫేమ్ రామ్ తాళ్ళూరి నిర్మిస్తున్నాడు. `ఆర్ ఎక్స్ 100` ఫేమ్ పాయల్ రాజ్‌పుత్ మెయిన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో నభా నటేశ్‌తో పాటు మరో కథానాయిక కూడా నటించనుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉంటే… రవితేజ పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసిన టైటిల్ లోగో, మోషన్ పోస్టర్‌కు మంచి స్పందన వచ్చింది. కాగా… ఈ సినిమా షూటింగ్ కార్యక్రమాలు మార్చి 4 నుంచి ప్రారంభం కానున్నాయని తెలిసింది. శరవేగంగా చిత్రీకరణను పూర్తిచేసి… ఈ ఏడాది ద్వితీయార్ధంలో సినిమాని విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ చిత్రానికి యువ సంగీత సంచలనం తమన్ స్వరాలందిస్తున్నాడు.
[youtube_video videoid=otdGhg81P4M]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: