రామ్ పోతినేని, పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో తెరకెక్కనున్న సినిమా ఇస్మార్ట్ శంకర్. ఈ సినిమా ఈ రోజే లాంఛనంగా ప్రారంభమైంది. ఇక రేపటి నుండి రెగ్యూలర్ గా షూటింగ్ జరుపుకోనుంది. ఇదిలా ఉండగా ఈ సినిమాలో రామ్ తన లుక్ ను టోటల్ గా మార్చేశాడు. డిఫరెంట్ టైటిల్, రామ్ లుక్ ఇప్పటికే ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. దీంతో రామ్ తన కెరియర్ లో ఒక డిఫరెంట్ రోల్ చేస్తున్నాడనే విషయం అర్థమైపోయింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
అయితే ఈసినిమాలో హీరోయిన్ గా ఎవరు ఎంపికయ్యారన్న విషయం మాత్రం ఇప్పటివరకూ తెలియలేదు. ఓ కొత్త కథనాయిక కోసం పూరీ చూస్తున్నట్టు టాక్స్ వినిపించాయి. కానీ తాజా కథనాల ప్రకారం ఓ పేరు తెరపైకి వచ్చింది. అది ఎవరో కాదు… మజ్ను సినిమాతో తెలుగు పరిశ్రమలోకి అడుగుపెట్టిన అను ఇమ్మాన్యుయేల్. దాదాపు అనునే హీరోయిన్ గా ఖరారు చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మరి దీనిపై క్లారిటీ రావాలంటే మాత్రం అధికారిక ప్రకటన వచ్చేంతవరకూ ఆగాల్సిందే.
మరి గత ఏడాది వచ్చిన అజ్ఞాతవాసి’, ‘నా పేరు సూర్య’, ‘శైలజా రెడ్డి అల్లుడు’ సినిమాలు ఆమెకు సరైన విజయం సాధించి పెట్టలేదనే చెప్పొచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో ఆమెకి ఈ ఛాన్స్ రావడం విశేషం. ఇక ఈ సినిమాతోనైనా అను ఇమ్మాన్యుయేల్ కు హిట్ తగులుతుందేమో చూడాలి. కాగా యాక్షన్ ఎంటర్టైనెర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాను పూరీ టూరింగ్ టాకీస్ పతాకం ఫై పూరి జగన్నాథ్ , ఛార్మి కలిసి నిర్మించనున్నారు.ఐదు నెలల్లో సినిమాను పూర్తి చేసి మే నెలలో సినిమాను రిలీజ్ చేసే యోచనలో ఉన్నారు.
[youtube_video videoid=sv-YLoucBM8]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: