స్వయంభు నుండి నిఖిల్ ట్రాన్స్‌ఫర్మేషన్  వీడియో రిలీజ్

Nikhil’s Transformation Video from Swayambhu Released

నిఖిల్ సిద్ధార్థ తన అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ‘స్వయంభూ’తో రాబోతున్నారు. భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో, పిక్సెల్ స్టూడియోస్‌  భువన్, శ్రీకర్‌ల నిర్మాణంలో, టాగోర్ మధు సమర్పణలో భారీ పీరియడ్ యాక్షన్ చిత్రంగా రూపొందుతోంది. ‘స్వయంభూ’ భారతీయ సినిమా రంగంలోనే బిగ్గెస్ట్ ప్రాజెక్టులలో ఒకటిగా రూపుదిద్దుకుంటోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నిఖిల్ సిద్ధార్థ్ పుట్టినరోజు సందర్భంగా ‘స్వయంభూ’ మేకర్స్ విడుదల చేసిన ప్రత్యేక మేకింగ్ వీడియో సినిమాపై అంచనాలను మరింత పెంచింది. ఈ వీడియోలో ఈ ప్రతిష్టాత్మక పీరియడ్ యాక్షన్ డ్రామా కోసం నిఖిల్ చేసిన కఠోర శ్రమను చూపించారు.

వీడియో వియత్నాంలో ప్రారంభమవుతుంది. అక్కడ నిఖిల్ ప్రొఫెషనల్ ట్రైనర్ల పర్యవేక్షణలో కత్తియుద్ధం, స్టాఫ్ కాంబాట్, మార్షల్ ఆర్ట్స్ వంటి యుద్ధ విద్యల్లో కఠినమైన శిక్షణ పొందారు. ఈ క్రమంలో హ్యామ్‌స్ట్రింగ్ గాయం అయినప్పటికీ, ఆయన వెనక్కి తగ్గకుండా తన ప్రిపరేషన్‌ను కొనసాగించడం విశేషం.

వైర్ యాక్షన్ సీక్వెన్స్‌లు, గాల్లో చేసే విన్యాసాలు, ఫ్లిప్స్, క్లిష్టమైన ఫైట్ మూమెంట్స్‌ను నిఖిల్ సాధన చేస్తున్న దృశ్యాలు వీడియోలో కట్టిపడేశాయి. నెలల తరబడి చేసిన కఠోర సాధన ఫలితంగా సెట్స్‌పై ఆయన అనేక యాక్షన్ సన్నివేశాలను ఎంతో ఆత్మవిశ్వాసంతో పూర్తి చేశారు.

వీడియో చివరి భాగంలో సినిమా నుంచి కొన్ని అద్భుతమైన విజువల్స్‌ను చూపించారు. యుద్ధ కవచం ధరించిన నిఖిల్ శత్రువులపై విరుచుకుపడటం, అగ్నిజ్వాలల మధ్య పోరాడటం, గ్రాండ్ ల్యాండ్‌స్కేప్‌లలో యాక్షన్ సన్నివేశాల్లో పాల్గొనడం సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది.

ఈ మేకింగ్ వీడియో ద్వారా పాత్ర కోసం నిఖిల్ చూపించిన అంకితభావం, క్రమశిక్షణ, పట్టుదల స్పష్టంగా కనిపిస్తాయి. ఈ ఎపిక్ యాక్షన్ డ్రామాను అత్యంత సహజత్వంతో, భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలన్న మేకర్స్ విజన్‌ను కూడా ప్రజెంట్ చేస్తోంది.

ఈ చిత్రంలో నిఖిల్ సరసన సంయుక్త, నభా నటేష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌కు అద్భుతమైన స్పందన రాగా, ఇటీవల విడుదలైన ‘రా రా ధీవరా’ పాట సినిమాపై అంచనాలను మరింత పెంచింది.

ఈ చిత్రానికి ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కే.కే. సెంథిల్ కుమార్ అద్భుతమైన విజువల్స్ అందిస్తుండగా, రవి బస్రూర్  సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ఎం. ప్రభాహరన్, రవీంద్ర ప్రొడక్షన్ డిజైన్‌తో చిత్ర ప్రపంచాన్ని మరింత గ్రాండ్ గా తీర్చిదిద్దుతున్నారు.

ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్న ‘స్వయంభూ’ త్వరలోనే భారీ పాన్-ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.