‘తొలిప్రేమ’ ఫేం వెంకీ అట్లూరి దర్శకత్వంలో అఖిల్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా Mr.మజ్ను. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమాను జనవరి 25న రిలీజ్ చేయనున్నారు. ఇక ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ టీజర్, ‘ఏమైనదో.. ఏమైనదో.. పలుకు మరచినట్టు పెదవికేమైనదో..’, టైటిల్ సాంగ్ లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు తాజాగా ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా యూత్‌పుల్ ఎంటర్‌టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాలో అఖిల్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇంకా నాగబాబు, ప్రియదర్శి, జయప్రకాష్, హైపర్ ఆది ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మిస్తున్న… ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నాడు. కెమెరా: జార్జి సి. విలియమ్స్, ఎడిటింగ్: నవీన్ నూలి, ఆర్ట్: అవినాష్ కొల్లా, పాటలు: శ్రీమణి.
[youtube_video videoid=9CY19BnsPoM]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: