మరోసారి నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర‌లో రెజీనా?

Regina Cassandra To Play A Negative Role Again?,Telugu Film News 2019, Telugu Filmnagar,Tollywood Cinema Updates,Regina Cassandra Negative Role,Actress Regina Cassandra New Movie,Regina Cassandra Next Movie Role Revealed,Regina Cassandra Latest News

‘ ఎస్. ఎం. ఎస్’తో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైన రెజీనా… ‘కొత్త జంట’, ‘పిల్లా.. నువ్వులేని జీవితం’, ‘సుబ్రమణ్యం For సేల్’, ‘అ!’ వంటి చిత్రాలతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఇటీవల విడుదలైన ‘ఎవరు’లో నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్‌లో మెస్మరైజ్ చేసి… భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఇదిలా ఉంటే… మరోసారి నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించేందుకు రెజీనా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు కోలీవుడ్ టాక్.

ఆ వివరాల్లోకి వెళితే… కోలీవుడ్ స్టార్ విశాల్, టాలెంటెడ్ బ్యూటీ శ్రద్ధా శ్రీనాథ్ జంటగా నూతన దర్శకుడు ఆనంద్ ‘ఇరుంబు తిరై 2’ అనే యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను తెరకెక్కిస్తున్నాడు. గత ఏడాది విడుదలై ఘన విజయం సాధించిన ‘ఇరుంబు తిరై’ (తెలుగులో ‘అభిమన్యుడు’)కి సీక్వెల్‌గా ఈ సినిమా రూపొందుతోంది. విశాల్ మిలిటరీ ఆఫీసర్‌గా, శ్రద్ధ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్న ఈ సినిమాలో… రెజీనా ప్రతినాయకిగా కనిపించనున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ క్రేజీ ప్రాజెక్ట్… తెలుగులోనూ విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి.

మరి… ‘ఎవరు’తో ఆడియన్స్‌ను మెస్మ‌రైజ్ చేసిన రెజీనా… ‘ఇరుంబు తిరై 2’తో ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here