
ట్యాగ్ · 107 కథనాలు · పేజీ 2


మరో రికార్డు బ్రేక్ చేసిన జవాన్

జవాన్ గురించి స్పందించిన అల్లు అర్జున్

జవాన్ 4రోజుల్లో 500కోట్లు

జవాన్ తొలి రోజే 100కోట్లు

జవాన్ లో క్యామియో పై అట్లీ క్లారిటీ

జవాన్ కు సెన్సేషనల్ బుకింగ్స్

జవాన్ ట్రైలర్ రిలీజ్

సర్దార్ 2 లో విలక్షణ నటుడు?

ఇంట్రెస్టింగ్ గా జవాన్ ప్రివ్యూ

1000కోట్ల దిశగా జవాన్
బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ నటించిన జవాన్ బాక్సాఫీస్ వద్ద అన్ స్టాపబుల్ గా దూసుకుపోతుంది.వర్కింగ్ డేస్ లోకూడా ఈసినిమా బాగానే హోల్డ్ చేస్తూ కలెక్షన్లను కొల్లగొడుతుంది.నిన్నటి వరకు ఈసినిమా ప్రపంచ వ్యాప్తంగా 907.54 కోట్ల గ్రాస్ ను రాబట్టిందని మేకర్స్ పోస్టర్ ను విడుదలచేశారు.దాంతో ఈవారాంతంలో జవాన్ 1000కోట్ల గ్రాస్ క్లబ్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది.

మరో రికార్డు బ్రేక్ చేసిన జవాన్
షారుఖ్ ఖాన్ జవాన్ బాక్సాఫీస్ వద్ద హావ కొనసాగిస్తుంది.ఈవారం కూడా పెద్ద సినిమాలు ఏమి లేకపోవడంతో అటు నార్త్ తోపాటు సౌత్ లోనూ కలెక్షన్స్ లో జోరు కొనసాగించనుంది.ఇక ఈసినిమా తాజాగా మరో రికార్డు ను క్రీయేట్ చేసింది.నిన్నటి తో ప్రపంచ వ్యాప్తంగా 690 కోట్ల గ్రాస్ వసూళ్లను ఖాతాలో వేసుకుంది.దాంతో గద్దర్ 2 రికార్డు ను బ్రేక్ చేసి ఈఏడాది అత్యధిక వసూళ్లను సాధించిన రెండో హిందీ సినిమాగా జవాన్ రికార్డు సృష్టించింది.పఠాన్ మొదటి స్థానంలో వుంది.ఫుల్ రన్ లో ఈసినిమాను కూడా వెనక్కి నెట్టి జవాన్ మొదటి స్థానం లోకి వచ్చిన రావొచ్చు.

జవాన్ షాకింగ్ ఫస్ట్ వీక్ కలెక్షన్స్
బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ మరోసారి తాను బాలీవుడ్ బాద్ షా అని నిరూపించాడు. లాక్ డౌన్ తరువాత పూర్తిగా ఢీలా పడిపోయిన బాలీవుడ్ ఇండస్ట్రీకి పఠాన్ అంటూ వచ్చి ప్రాణం పోశాడు. ఆ తరువాత పరిస్థితి కొంత మెరుగుపడింది. ఇక ఇప్పుడు మరోసారి జవాన్ అంటూ వచ్చి బాక్సాఫీస్ వద్ద తన సత్తా చూపించాడు. అట్లీ దర్శకత్వంలో పూర్తి యాక్షన్ ఎంటర్ టైనర్ గా వచ్చిన సినిమా జవాన్. వీరిద్దరి కాంబినేషన్ పై మొదటి నుండీ భారీ అంచనాలు ఉన్నాయి. ఇక అంచనాలకు ఎక్కడా తగ్గకుండా సినిమా ఉండటంతో ఫస్ట్ షో నుండే హిట్ టాక్ ను సొంతం చేసుకొని బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది.

జవాన్ గురించి స్పందించిన అల్లు అర్జున్
షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తుంది.విడుదలైన 6 రోజుల్లోనే 620 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి రికార్డు సృష్టించింది.ఫుల్ రన్ లో ఈసినిమా 1000కోట్ల మైలురాయిని చేరుకోనుంది.దాంతో షారుఖ్,పఠాన్ తరువాత ఈ ఫీట్ సాదించడం రెండో సారి కానుంది.ఇక ఇదిలావుంటే ఈసినిమా చూసి ట్వీట్ చేశాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.

5వరోజు జవాన్ కు షాకింగ్ కలెక్షన్స్
వరుసగా నాలుగు రోజులు బాక్సాఫీస్ వద్ద 100కోట్లకు పైగా రాబట్టి రికార్డు సృష్టించిన జవాన్ సోమవారం కాస్త నెమ్మదించింది.నిన్న ఈసినిమా ప్రపంచ వ్యాప్తంగా 54కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది.అయితే నిన్న ఆసియా కప్ లో భాగంగా ఇండియా -పాకిస్థాన్ మ్యాచ్ జరిగింది.ఆప్రభావం జవాన్ కలెక్షన్స్ ఫై కొద్దిగా పడింది.అయినా వర్కింగ్ డే లో బాగానే హోల్డ్ చేయగలిగింది.ఓవరాల్ గా జవాన్ 5రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 574.89కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.ఇందులో నెట్ 280కోట్లు. ఈరోజుతో జవాన్ 300కోట్ల క్లబ్ లో చేరనుంది.

జవాన్ 4రోజుల్లో 500కోట్లు
షారుఖ్ ఖాన్ జవాన్ బాక్సాఫీస్ ను షేక్ చేస్తుంది.వరుసగా నాలుగో రోజు కూడా 100కోట్లకు పైగా రాబట్టి బాలీవుడ్ లో కొత్త రికార్డు ను క్రీయేట్ చేసింది.మూడు రోజు హిందీ సినిమా చరిత్రలోనే అత్యధికంగా 144.22కోట్లు రాబట్టిన ఈసినిమా ఆదివారం మరో 136.17 కోట్ల గ్రాస్ ను ఖాతాలో వేసుకుంది. దాంతో నాలుగు రోజుల్లో ఈసినిమా ప్రపంచ వ్యాప్తంగా 520.79కోట్ల గ్రాస్ వసూళ్లతో సెన్సేషన్ సృష్టించింది.అంతేకాదు అతి తక్కువ రోజుల్లో 500కోట్ల క్లబ్ లో చేరిన మొదటి హిందీ సినిమాగా జవాన్ రికార్డు సృష్టించింది.ఇందులో షేర్ 252కోట్లు.

జవాన్ తొలి రోజే 100కోట్లు
బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ నటించిన జవాన్ నిన్న విడుదలై పాజిటివ్ రివ్యూస్ తోపాటు సూపర్ మౌత్ టాక్ ను తెచ్చుకుంది.దాంతో ఊహించినట్లుగానే బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్స్ తో సెన్సేషన్ సృష్టించింది.మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా జవాన్ 129.6 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.హిందీ సినిమా చరిత్రలోనే మొదటి రోజు అత్యధిక వసూళ్లను రాబట్టిన సినిమాగా జవాన్ రికార్డు సృష్టించింది.ఇక తొలిరోజే 100కోట్ల వసూళ్లను రాబట్టడం షారుఖ్ కు ఇది రెండో సారి.ఇంతకుముందు షారుక్ నటించిన పఠాన్ కూడా తొలిరోజే 100కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది.

ఆ రెండు సినిమాలపై రాజమౌళి రివ్యూ.. ఏం చెప్పారంటే?
టాలీవుడ్ దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తన సినిమాల ద్వారా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. హాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ సైతం రాజమౌళి పేరుని చెప్పగానే గుర్తుపడతారంటేనే.. అర్ధమవుతోంది ఆయన ఎంత ఫేమస్ అయ్యారో. 'ఆర్ఆర్ఆర్' చిత్రం తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న రాజమౌళి తన తదుపరి సినిమాను సూపర్ స్టార్ మహేష్ బాబుతో తెరకెక్కించే ప్రయత్నాల్లో ఉన్నారు. అత్యంత భారీ బడ్జెట్ తో ట్రెజర్ హంట్, ఫారెస్ట్ అడ్వెంచరస్ మూవీగా దీనిని రూపొందించనున్నారు. ప్రస్తుతం ఆ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు ఆయన. అయితే తాజాగా రాజమౌళి ఇటీవలే విడుదలైన రెండు సినిమాలను వీక్షించారు. అంతేకాకుండా.. ఆ రెండు…

జవాన్ మూవీపై మహేష్ మళ్ళీ ట్వీట్.. ఈసారి ఓ రేంజ్లో
బాలీవుడ్ బాద్ షా.. షారుఖ్ ఖాన్ తాజాగా నటించిన ‘జవాన్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద దుమ్ము రేపుతోంది. లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్గా నటించగా.. దీపికా పదుకొణే, విజయ్ సేతుపతి, యోగిబాబు తదితరులు కీలక పాత్రలు పోషించారు. ప్రముఖ తమిళ దర్శకుడు అట్లీ రూపొందించిన ఈ హై వోల్టేజ్ యాక్షన్ సినిమా దేశవ్యాప్తంగా రికార్డ్ కలెక్షన్లతో దూసుకెళ్తోంది. ఈ క్రమంలో ఈ సినిమాకి తొలిరోజే పాజిటివ్ టాక్ రావడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీ వసూళ్లు సాధిస్తోంది. జవాన్ మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ తోనే సినిమాపై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో అందరికీ అర్ధమయింది. ఇక సినిమా రిలీజ్ అయిన మొదటి షో నుంచే బొమ్మ బ్లాక్ బస్టర్ అని…

జవాన్ కు సూపర్ హిట్ టాక్.. అనిరుధ్ ఎమోషనల్ ట్వీట్
కింగ్ ఖాన్ షారుఖ్ హీరోగా తమిళ దర్శకుడు అట్లీ తెరకెక్కించిన తాజా చిత్రం ‘జవాన్’. ఈ యేడాది షారుఖ్ ఖాన్ నుంచి 'పఠాన్' వంటి భారీ బ్లాక్ బస్టర్ తరువాత వస్తోన్న మూవీ కారావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అలాగే ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లుక్తో పాటు, టీజర్, ట్రైలర్లకు ప్రేక్షకుల నుంచి వీర లెవల్లో రెస్పాన్స్ వచ్చింది. ఈ అంచనాల నేపథ్యంలోనే జవాన్ సినిమా గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక సినిమా చూసిన షారుఖ్ ఫ్యాన్స్ సహా మూవీ లవర్స్ సోషల్ మీడియాలో పాజిటీవ్ రెస్పాన్స్ ఇస్తున్నారు. పఠాన్ బాటలోనే కింగ్ ఖాన్ మరో వెయ్యి కోట్ల మూవీ చేశాడంటూ కితాబిస్తున్నారు. దేశవ్యాప్తంగా…

జవాన్ లో క్యామియో పై అట్లీ క్లారిటీ
పఠాన్ సినిమాతో మంచి కమ్ బ్యాక్ ఇచ్చిన బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ ఇప్పుడు మరో సెన్సేషన్ జవాన్ తో వచ్చేస్తున్నాడు. తమిళ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో షారుఖ్ ఖాన్ హీరోగా జవాన్ సినిమా వస్తుంది. ఈకాంబినేషన్ వల్ల సినిమాపై మొదటి నుండీ భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం అయితే చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఇక ఈసినిమా నుండి వస్తున్న అప్ డేట్లు అన్నీ సినిమాపై అంచనాలను ఇంకా పెంచేేసింది.

'జవాన్' పై మహేష్ ట్వీట్.. షారుఖ్ రియాక్షన్ ఇదే..!
బాలీవుడ్ బాద్ షా, కింగ్ ఖాన్ షారుఖ్ ఈ యేడాది ఆరంభంలో 'పఠాన్' మూవీతో బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన సంగతి సినీ ప్రియులకు గుర్తుండే ఉంటుంది. తాజాగా ఆయన 'జవాన్' చిత్రంతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్గా నటించగా.. దీపికా పదుకొణే, విజయ్ సేతుపతి, యోగిబాబు తదితరులు కీలక పాత్రలు పోషించారు. అట్లీ దర్శకత్వం వహించిన ఈ హై వోల్టేజ్ యాక్షన్ సినిమా రేపు హిందీ సహా అన్ని దక్షిణాది భాషల్లో దేశవ్యాప్తంగా విడుదలవుతోంది. అలాగే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ సినిమా భారీ రిలీజ్ అవుతోంది. ఈ క్రమంలో జవాన్ మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ చూసి సినీ పండితులు సైతం…

జవాన్ కు సెన్సేషనల్ బుకింగ్స్
బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ ఖాన్,కోలీవుడ్ యంగ్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్ లో వస్తున్న సినిమా జవాన్.మరో మూడు రోజుల్లో థియేటర్లలోకి రానుంది.ఈసినిమా పై భారీ అంచనాలు వున్నాయి అందుకు తగ్గట్లే అడ్వాన్స్ బుకింగ్స్ విషయంలో జవాన్ అదరగొడుతుంది.హిందీ తోపాటు తెలుగు ,తమిళ భాషల్లో విడుదలవుతున్నా బుకింగ్స్ విషయంలో మాత్రం హిందీ వెర్షన్ సెన్సేషన్ క్రీయేట్ చేస్తుంది.

జవాన్ ట్రైలర్ రిలీజ్
బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ నటించిన జవాన్ మరో వారం రోజుల్లో థియేటర్లలోకి రానుంది.ప్రమోషన్స్ లో భాగంగా ఈరోజు ఈసినిమా ట్రైలర్ ను విడుదలచేశారు.ఇక ఈ ట్రైలర్ చూస్తే జవాన్,షారుఖ్ కు మరో హిట్ ఇచ్చేలానే ఉంది.ముఖ్యంగా విజువల్స్,బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ట్రైలర్ లో హైలైట్ అయ్యాయి.ఈసినిమాలో షారుఖ్ డిఫ్రెంట్ షేడ్స్ లో కనిపించనున్నాడు.

దుమ్ము రేపుతున్న షారూఖ్ ఖాన్ 'జవాన్' కొత్త సాంగ్
కింగ్ ఖాన్ షారూఖ్ హీరోగా నటించిన కొత్త చిత్రం 'జవాన్'. ప్రముఖ తమిళ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ భారీ బడ్జెట్ యాక్షన్ థ్రిల్లర్ పై ఎక్స్ పెక్టేషన్స్ ఓ రేంజ్ లో ఉన్నాయి. నయనతార హీరోయిన్గా నటిస్తుండగా.. దీపికా పదుకొణె, విజయ్ సేతుపతి తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నుంచి మంగళవారం కొత్త సాంగ్ ను మేకర్స్ విడుదల చేశారు. 'నాట్ రామయ్యా వస్తావయ్యా' అనే ఈ పాట ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది. కాగా రీసెంట్ గా #AskSRK సెషన్ లో షారూఖ్ ఖాన్ తన అభిమానులతో సినిమాకు సంబంధించి పలు విషయాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా.. షారుఖ్, 'నాట్ రామయ్యా వస్తావయ్యా'…

షారుఖ్ ఖాన్ జవాన్ సినిమాకి సెన్సార్ పూర్తి, యూ/ఏ సర్టిఫికెట్ జారీ
బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ హీరోగా నటిస్తోన్న తాజా సినిమా ‘జవాన్’. తమిళ దర్శకుడు అట్లీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో షారుఖ్ సరసన సౌత్ ఫిమేల్ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్ గా చేస్తోంది. ప్రియమణి, దీపికా పదుకొణె కీలక పాత్రలు పోషిస్తున్నారు. తమిళ ప్రముఖ నటుడు విజయ్ సేతుపతి ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాకి షారుఖ్ ఖాన్ భార్య గౌరీ ఖాన్ నిర్మాత కాగా.. గౌరవ్ వర్మ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇక సెప్టెంబర్ 7న ఈ చిత్రం వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్ కానుంది. అలాగే దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన భాషల్లో విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో చిత్ర బృందం సినిమాకు సంబంధించిన ప్రచార…

జవాన్ నుండి షారుఖ్ ఇంట్రెస్టింగ్ పోస్టర్ రిలీజ్
పఠాన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ ను అందుకున్నాడు బాలీవుడ్ బాద్ షా షారుఖ్. ఇక ఇప్పుడు అదే జోష్ తో జవాన్ అనే సినిమాతో వచ్చేస్తున్నాడు. తమిళ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో ఈసినిమా రూపొందుతుంది. ఈకాంబినేషన్ వల్ల సినిమాపై మొదటి నుండీ భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దానికితోడు పఠాన్ లాంటి హిట్ తరువాత షారుఖ్ నుండి వస్తున్న సినిమా కావడంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈసినిమా నుండి వచ్చిన అప్ డేట్లు అన్నీ సినిమాపై మంచి బజ్ ను క్రియేట్ చేస్తున్నాయి. ఇప్పటికే జవాన్ ప్రివ్యూ అంటూ వీడియోను రిలీజ్ చేయగా దానికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. అంతేకాదు రీసెంట్ గాన్ దుమ్ము…

సర్దార్ 2 లో విలక్షణ నటుడు?
తెలుగు ప్రేక్షకులకు తమిళ్ స్టార్ హీరో కార్తీ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. యుగానికి ఒక్కడు సినిమాతోనే తనలో మంచి నటుడిని పరిచయం చేశాడు. ఇక ఆతరువాత ప్రతి సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాడు. ఈమధ్య పొన్నియన్ సెల్వన్ సిరీస్ తో హిట్లను అందుకున్నాడు. ప్రస్తుతం అయితే జపాన్ సినిమాతో బిజీగా ఉన్నాడు కార్తీ. రాజు మురుగన్ దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కుతుంది. ఇక ఈసినిమా కూడా డిఫరెంట్ గా ఉండబోతుందని రీసెంట్ గా రిలీజ్ చేసిన గ్లింప్స్ తో అర్థమైపోయింది. డిఫరెంట్ మేకోవర్ తో కార్తీ గెటప్ ఆకట్టుకుంటూ సినిమాపై అంచనాలు పెంచేసింది. ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది.

దుమ్ము దులిపేలా జవాన్ ఫస్ట్ సింగిల్
బాలీవుడ్ బాద్ షా షారుష్ ఖాన్ హీరోగా తమిళ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో ఒక ఇసినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. జవాన్ అనే టైటిల్ తో ఈసినిమా తెరకెక్కుతుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేసుకునే పనిలో ఉంది. షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకుంది. ఇక రీసెంట్ గానే ఈసినిమా నుండి ప్రివ్యూ పేరుతో టీజర్ ను రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రివ్యూలో విజువల్స్, యాక్షన్ సీక్వెన్స్, షారుఖ్ మేకోవర్ అన్నీ సినిమాపై అంచనాలను పెంచేసింది. అంతేకాదు జవాన్ తో మరో హిట్ ను అందుకునే అవకాశం ఉందన్న అభిప్రాయాలు కూడా వెలువడ్డాయి.

ఇంట్రెస్టింగ్ గా జవాన్ ప్రివ్యూ
ఇక ఈసినిమా కొత్త రిలీజ్ డేట్ ను రీసెంట్ గానే ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. సెప్టెంబర్ 7వ తేదీన ఈసినిమాను రిలీజ్ చేయనున్నారు. ఇక ఈసినిమా షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకుంది. మరోవైపు ఈసినిమా ప్రమోషన్స్ ను కూడా చిన్నగా స్టార్ట్ చేశారు మేకర్స్. ఈనేపథ్యంలోనే ఈసినిమా నుండి ప్రివ్యూ ను రిలీజ్ చేస్తామని ఇప్పటికే చిత్రయూనిట్ తెలిపిన సంగతి గుర్తుండే ఉంటుంది కదా. ఇక చెప్పినట్టే ఈసినిమా నుండి ప్రివ్యూ పేరుతో ఒక ఇంట్రెస్టింగ్ వీడియోను రిలీజ్ చేశారు మేకర్స్.