
ట్యాగ్ · 804 కథనాలు · పేజీ 3


లవ్ టుడే రిలీజ్ డేట్ ఫిక్స్

ప్రాజెక్ట్ K మూవీ పై ఇంట్రెస్టింగ్ న్యూస్

విశ్వక్ ధమ్కీ ట్రైలర్ 1.0 రిలీజ్

18 పేజెస్ ఫస్ట్ సింగిల్ అప్ డేట్

పర్ ఫెక్ట్ గర్ల్స్ నైట్ లో సినీ తారల సందడి

గోవా వెకేషన్ లో సతీమణి తో నిఖిల్

ఈ రోజే లవ్ టుడే మూవీ ఆడియో లాంచ్

విశ్వక్ ధమ్కీ కోసం బాలయ్య

బాధలోనూ మహేష్ సహృదయం

7 రోజుల్లో బ్రేక్ ఈవెన్ సాధించిన యశోద

తరుణ్ భాస్కర్ 'కీడా కోలా' షూట్ బిగిన్స్

హరిహర వీరమల్లు మూవీ లేటెస్ట్ అప్ డేట్

కేరళ లో పుష్ప :ది రైజ్ మూవీ రీ రిలీజ్

రజినీ జైలర్ లో కన్నడ స్టార్ హీరో

అజిత్ డైరెక్టర్ తో కమల్?

మసూదకు సూపర్ పబ్లిక్ రేటింగ్
ఇప్పుడు మేకర్స్ సినిమాలు తీసే విధానం మారిపోయింది. అలానే ప్రేక్షకులు సినిమాలు చూసే విధానం కూడా మారిపోయింది. అది దృష్టిలో పెట్టుకునే ప్రేక్షకులకు నచ్చే విధంగా సినిమాలు తీయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అందుకే చిన్న సినిమా అని కాదు పెద్ద సినిమా కాదు కథలో కంటెంట్ ఉంటే ప్రేక్షకులు ఆదరణ చూపిస్తున్నారు. అది మరోసారి మసూద సినిమాతో నిరూపించారు ఆడియన్స్. సాయికిరణ్ దర్శకత్వంలో తిరువీర్ , కావ్య కల్యాణ్‌రామ్ జంటగా.. సంగీత కీలక పాత్రలో నటించిన సినిమా మసూద. హార్రర్ నేపథ్యంలో వచ్చిన ఈసినిమా నిన్న రిలీజ్ అయి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చిన్న సినిమాగా వచ్చిన ఈసినిమా మాత్రం ఆద్యంతం సస్పెన్స్ తో…

లవ్ టుడే రిలీజ్ డేట్ ఫిక్స్
ఒక భాషలో రిలీజ్ అయిన సినిమాను మరో భాషలో రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే కదా. రీసెంట్ గానే కన్నడలో సూపర్ హిట్ అయిన కాంతార సినిమాను తెలుగులో టాప్ ప్రొడ్యూసర్ అయిన అరవింద్ రిలీజ్ చేశారు. ఇక ఈసినిమా తెలుగులో కూడా సూపర్ హిట్ అయి మంచి కలెక్షన్స్ ను అందించింది. ఇప్పుడు మరో తమిళ్ సినిమాను తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. ప్రదీప్ రంగనాథన్, ఇవాన జంటగా తెరకెక్కిన సినిమా లవ్ టుడే. తమిళ్ లో రూపొందించిన ఈసినిమా నవంబర్ 4 వ తేదీన రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ గా హిట్ గా నిలిచింది.

ప్రాజెక్ట్ K మూవీ పై ఇంట్రెస్టింగ్ న్యూస్
వైజయంతీ మూవీస్ సమర్పణ లో స్వప్న సినిమా బ్యానర్ పై బ్లాక్ బస్టర్ మహానటి మూవీ ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా టైమ్ ట్రావెల్ నేపథ్యం లో భారీ బడ్జెట్ తో ప్రాజెక్ట్ K మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. దీపిక పడుకొనే , దిశా పటానీ కథానాయికలు. ఈ మూవీ లో బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. ప్రాజెక్ట్ Kమూవీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా అనౌన్స్ అయినా కూడా దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ ప్రాజెక్ట్‌ని పాన్ వరల్డ్ సినిమాగా హాలీవుడ్ స్థాయి లో సీనియర్ టెక్నీషియన్స్ తో తెరకెక్కిస్తున్నారు.టాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు ఈ సినిమాకి మెంటర్‌గా…

సెన్సార్ పూర్తి చేసుకున్న ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం
అల్లరి నరేష్ ఇప్పుడు తన రూట్ ను మార్చిన సంగతి తెలిసిందే కదా. ఒకప్పుడు కామెడీ సినిమాలతో ప్రేక్షకులను అలరించిన అల్లరి నరేష్ నాంది సినిమాతో తన సెకండ్ ఇన్నింగ్స్ కు నాంది పలికాడు. ఇక ఇప్పుడు తన సినిమాల్లో విభిన్నత మాత్రమే ఉండాలని చూస్తున్నారు. ఇక ప్రస్తుతం ఏఆర్ మోహన్ దర్శకత్వంలో అల్లరి నరేష్ హీరోగా రూపొందుతున్న సినిమా 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం'. ఈసినిమాపై కూడా మంచి అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ లు సినిమాపై ఆ అంచనాలను పెంచేశారు. ఇక ముందుగా ఈసినిమాను నవంబర్ 11వ తేదీన రిలీజ్ చేద్దామనుకున్నారు కానీ నవంబర్ 25వ తేదీన రిలీజ్ చేయనున్నట్టు రీసెంట్ గానే మార్చారు. ఇక రిలీజ్…

విశ్వక్ ధమ్కీ ట్రైలర్ 1.0 రిలీజ్
కేవలం నటుడిగా మాత్రమే కాదు దర్శకుడిగా కూడా ఇప్పటికే తన సత్తా చాటుకున్నాడు టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్. ఇక ఇప్పుడు మరోసారి దర్శకుడిగా తన టాలెంట్ ను చూపించడానికి వచ్చేస్తున్నాడు. విశ్వక్ సేన్ స్వీయ దర్శకత్వంలో వస్తున్న సినిమా ధమ్కీ. ఈసినిమా ప్రస్తుతం రిలీజ్ కు రెడీ అవుతుంది. దీనిలో భాగంగానే మరోవైపు ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టారు. ఈనేపథ్యంలో ఈసినిమా ఫస్ట్ లుక్ ను నిన్న రిలీజ్ చేశారు.

నందమూరి నటసింహం బాలకృష్ణ దర్శకత్వంలో ఆదిత్య 369 సీక్వెల్
శ్రీ దేవి మూవీస్ బ్యానర్ పై సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో బాలకృష్ణ ద్విపాత్రాభినయం తో తెరకెక్కిన సైన్స్ ఫిక్షన్ ఆదిత్య 369 మూవీ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ట్రైమ్ ట్రావెలింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీ లో కృష్ణ కుమార్ , శ్రీ కృష్ణ దేవరాయలు పాత్రలలో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి బాలకృష్ణ ప్రేక్షకులను అలరించారు. ఈ మూవీ సీక్వెల్ కై నందమూరి అభిమానులు చాలా రోజులుగా ఆసక్తి తో ఎదురు చూస్తున్నారు.

18 పేజెస్ ఫస్ట్ సింగిల్ అప్ డేట్
టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఇక ఇటీవలే కార్తికేయ 2 సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో కూడా తన సత్తాను చాటాడు. ఇక ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. అందులో 18 పేజెస్ సినిమా కూడా ఒకటి. ఈ సినిమా షూటింగ్ ను ముందే ప్రారంభించారు. కానీ కార్తికేయ2 సినిమా ముందు రిలీజ్ అయింది. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ కూడా పూర్తిచేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఇక మరోవైపు ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టారు. ఈనేపథ్యంలో తాజాగా ఈసినిమా ఫస్ట్ సింగిల్ కు సంబంధించిన అప్ డేట్ ను ఇచ్చారు. నన్నయ రాసిన అనే లిరికల్ పాటను రిలీజ్ చేయనున్నారు…

ఒకే రోజు రిలీజ్ కానున్న భోళా శంకర్ , జైలర్ మూవీస్
ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్, క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్స్ పై మెహెర్ రమేశ్ దర్శకత్వంలో మెగా స్టార్ చిరంజీవి , తమన్నా జంటగా అన్నా చెల్లెళ్ళ నేపథ్యంలో తెరకెక్కుతున్న భోళా శంకర్ మూవీ 2023 ఏప్రిల్ 14 వ తేదీ రిలీజ్ కానుంది. సూపర్ హిట్ వేదాళంతమిళ మూవీ తెలుగు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో చిరంజీవి చెల్లెలుగా కీర్తి సురేశ్ నటిస్తున్నారు. మురళీశర్మ , రావు రమేష్ , రఘుబాబు, వెన్నెల కిషోర్, రష్మీ , శ్రీముఖి ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. సాగర్ మహతి సంగీతం అందిస్తున్నారు.చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

పర్ ఫెక్ట్ గర్ల్స్ నైట్ లో సినీ తారల సందడి
ఎప్పుడూ సినిమా షూటింగ్స్ తో బిజీగా ఉండే సినీ తారలు పర్ ఫెక్ట్ గర్ల్స్ నైట్ పార్టీ లో సందడి చేశారు. సీనియర్ హీరోయిన్ లిజీ హోస్ట్ గా జరిగిన పార్టీ లో మహానటి కీర్తి సురేష్ , కళ్యాణి ప్రియదర్శన్ , రాధికా శరత్ కుమార్ , పార్వతి తిరువోతు , అన్నా బెన్, రీమా కళింగళ్ , అదితి బాలన్ , ప్రయాగ మార్టిన్ పాల్గొని సందడి చేశారు.

గోవా వెకేషన్ లో సతీమణి తో నిఖిల్
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ , అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్ పై చందు మొండేటి దర్శకత్వంలో నిఖిల్ , అనుపమ పరమేశ్వరన్ జంటగా సూపర్ హిట్ థ్రిల్లింగ్ మిస్టరీ కార్తికేయ మూవీ కి సీక్వెల్ గా తెరకెక్కిన కార్తికేయ 2 మూవీ ఆగస్ట్ 13 వ తేదీ తెలుగు , హిందీ భాషలలో భారీ అంచనాలతో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తో , భారీ కలెక్షన్స్ సాధించిన విషయం తెలిసిందే. ఈ మూవీలో అనుపమ పరమేశ్వరన్ కథానాయిక. ఓవర్ సీస్ తో పాటు , నార్త్ లో కూడా ఈ మూవీ అద్భుత రెస్పాన్స్ అందుకున్న .కార్తికేయ 2 మూవీ ప్రపంచవ్యాప్తం గా 130కోట్లకు పైగా కలెక్షన్స్ రా బట్టింది. బాలీవుడ్ లో 30 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టడం విశేషం.

ఈ రోజే లవ్ టుడే మూవీ ఆడియో లాంచ్
AGS ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై ప్రదీప్ రంగనాథన్ దర్శకత్వంలో ప్రదీప్ రంగనాథన్ , ఇవానా జంటగా తెరకెక్కిన లవ్ టుడే తమిళ మూవీ నవంబర్ 4 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ మూవీ లో సత్యరాజ్ , రాధిక , యోగిబాబు ముఖ్యమైన పాత్రలలో నటించారు. ఈ మూవీ కి యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు. ప్రదీప్ రంగనాథన్ దర్శకత్వంలో అద్భుతంగా తెరకెక్కిన లవ్ టుడే మూవీ ప్రేక్షకుల , విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

విశ్వక్ ధమ్కీ కోసం బాలయ్య
ఇటీవలే ఓరి దేవుడా సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నాడు యంగ్ హీరో విశ్వక్ సేన్. ఇక ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు విశ్వక్ సేన్. ఈసినిమాలో హీరో నటించడమే కాదు విశ్వక్ సేన్ స్వీయ దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కుతుంది. ఇక ఇన్ని రోజులు ఈసినిమా షూటింగ్ ను పూర్తిచేసుకునే బిజీగా ఉన్నారు. ఇదిలా ఉండగా ఈసినిమా ఫస్ట్ లుక్ ను నిన్ననే రిలీజ్ చేశారు మేకర్స్. కొంచెం స్టైలిష్‌గా, కొంచెం సీరియస్‌గా చూస్తున్న ఫస్ట్ లుక్ పోస్టర్ కు అయితే మంచి రెస్పాన్స్ వచ్చింది.

బాధలోనూ మహేష్ సహృదయం
సూపర్ స్టార్ మహేష్ బాబు రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లో కూడా హీరో అని నిరూపించుకున్న సందర్భాలు ఎన్ని ఉన్నాయో తెలిసిందే కదా. తను చేసే సేవా కార్యక్రమాల గురించి కూడా ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇవన్నీ ఒకటైతే మహేష్ బాబు ఎంతోమంది చిన్నారులకు గుండె ఆపరేషన్ లు చేయించడం అనేది మరో ఎత్తు. ఒకటి కాదు రెండు కాదు ఇప్పటివరకూ వేయికి పైగా ఎంతోమంది చిన్నారి గుండెలకు మహేష్ ఆయువుపోశాడు. గత మూడేళ్ళ కాలంలో మహేష్ బాబు 1000 మంది చిన్నారులకు గుండెకు సంబంధించిన శస్త్రచికిత్సలని విజయవంతగా చేయించాడు. ఈ సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే వుంది.

7 రోజుల్లో బ్రేక్ ఈవెన్ సాధించిన యశోద
శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై హరి , హరీష్ దర్శకత్వంలో స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో తెలుగు , తమిళ భాషలలో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ యశోద మూవీ తెలుగు , తమిళ భాషలతో పాటు కన్నడ , మలయాళ , హిందీ భాషల లో నవంబర్ 11 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. నిజ జీవిత సంఘటన తో సైకలాజికల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీ లో వరలక్ష్మి శరత్ కుమార్, రావు రమేష్, ఉన్ని ముకుందన్, కల్పిక గణేష్, సంపత్ రాజ్ కీలక పాత్రలలో నటించారు. మణిశర్మ సంగీతం అందించారు.యశోద మూవీ లో యశోద పాత్రలో నటించిన సమంత అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

తరుణ్ భాస్కర్ 'కీడా కోలా' షూట్ బిగిన్స్
పెళ్లి చూపులు సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే టాలీవుడ్ లో సెన్సేషన్ సృష్టించాడు తరుణ్ భాస్కర్. అంతే కాదు మొదటి సినిమాతోనే జాతీయ అవార్డు ను దక్కించుకున్నాడు. ఆతరువాత ఈ నగరానికి ఏమైంది సినిమా తీశాడు. అంతేకాదు అప్పుడప్పుడు గెస్ట్ అప్పీయరెన్స్ ఇవ్వడంతో పాటు హీరోగా కూడా తన టాలెంట్ ను చూపించాడు. ఇక తరుణ్ నుండి సినిమా వచ్చి చాలా కాలమే అవుతుంది. ఆ మధ్య వెంకీతో సినిమా చేస్తున్నట్టు కూడా తెలిపాడు కానీ ఇంతవరకూ క్లారిటీ లేదు.

హరిహర వీరమల్లు మూవీ లేటెస్ట్ అప్ డేట్
మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్‌పై క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా 17వ శతాబ్దం నాటి మొఘలాయిలు, కుతుబ్ షాహీల కాలం నేపథ్యంలో భారీ సెట్స్ , భారీ బడ్జెట్ తో పీరియాడికల్ యాక్షన్ అడ్వెంచర్ హరి హర వీరమల్లు మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ మూవీ లో నిధి అగర్వాల్ , నర్గీస్ ఫక్రి కథానాయికలు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , పవర్ గ్లాన్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

ఆదిపురుష్ మూవీ పై సీత (కృతి సనన్ )ఇంట్రెస్టింగ్ కామెంట్స్
టి – సిరీస్ ,రెట్రో ఫైల్స్ బ్యానర్స్ పై సూపర్ హిట్ తానాజీ మూవీ ఫేమ్ ఓం రౌత్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా భారత చలన చిత్ర చరిత్ర లో అత్యధిక బడ్జెట్ తో, హాలీవుడ్ స్థాయి టెక్నాలజీ తో 3డి ఫార్మాట్ లో రామాయణం ఆధారంగా తెలుగు , హిందీ భాషలలో మైథలాజికల్ మూవీ గా తెరకెక్కిన ఆదిపురుష్ మూవీ 2023 జూన్ 16 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ తెలుగు , హిందీ భాషలతో పాటు కన్నడ , తమిళ , మలయాళ భాష డబ్బింగ్ వెర్షన్స్ రిలీజ్ కానున్నాయి. హీరో ప్రభాస్ రాముడిగా నటించిన ఈ మూవీ లో సీతగా కృతి సనన్ , రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ , లక్ష్మణుడిగా సన్నీసింగ్ నటించారు. హీరో ప్రభాస్ నటించిన ఫస్ట్ మైథలాజికల్ మూవీ ఆదిపురుష్…

కేరళ లో పుష్ప :ది రైజ్ మూవీ రీ రిలీజ్
మైత్రీ మూవీ మేకర్స్ , ముత్తంశెట్టి మీడియా బ్యానర్స్ పై సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక జంటగా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ పుష్ప మూవీ ఫస్ట్ పార్ట్ పుష్ప: ది రైజ్ డిసెంబర్ 17న ,తెలుగు, కన్నడ , తమిళ , మలయాళ , హిందీ భాషలలో రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి ప్రపంచవ్యాప్తంగా సుమారు 360 కోట్లు కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. పుష్ప: ది రైజ్ మూవీ లో రఫ్ అండ్ మాస్ క్యారెక్టర్ లో అల్లు అర్జున్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షక , అభిమానులతో పాటు సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకున్నారు. పుష్ప :ది రైజ్ మూవీ హిందీ వెర్షన్ 100కోట్ల క్లబ్ లో చేరింది.ఈ…

రజినీ జైలర్ లో కన్నడ స్టార్ హీరో
తమిళ్ సూపర్ స్టార్ రజినీకాంత్ మాత్రం ఏ మాత్రం తగ్గేదేలే అంటూ ఒక సినిమా తరువాత మరొక సినిమా చేసుకుంటూ వెళుతున్నాడు. సినిమా జయాపజయాలను పక్కనపెట్టి యంగ్ హీరోలకు సైతం పోటీ ఇస్తూ సినిమాలను లైన్ లో పెడుతున్నాడు. అంతేకాదు యంగ్ డైరెక్టర్లనుసైతం ఎంకరేజ్ చేస్తూ వారికి అవకాశాలను ఇస్తూనే తను కూడా కొత్త కొత్త ప్రయోగాలు చేస్తున్నారు. ఇక గత ఏడాది అన్నాత్తే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు రజనీకాంత్. ఈ ఏడాది మరో సినిమాతో వచ్చేస్తున్నాడు. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కుతుంది. రజనీకాంత్ కెరీర్ లో వస్తున్న 169 సినిమా ఇది. జైలర్ అనే టైటిల్ తో ఈసినిమా తెరకెక్కుతుంది.

అజిత్ డైరెక్టర్ తో కమల్?
చాలా కాలం తరువాత విలక్షణ నటుడు కమల్ హాసన్ విక్రమ్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకున్నాడు. ఇక ప్రస్తుతం అయితే కమల్ ఇండియన్2 సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా శంకర్ దర్శకత్వంలో వస్తున్న భారతీయుడు సినిమాకు సీక్వెల్ అన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను ముగించుకుంటుంది.