చాలా కాలం తరువాత విలక్షణ నటుడు కమల్ హాసన్ విక్రమ్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకున్నాడు. ఇక ప్రస్తుతం అయితే కమల్ ఇండియన్2 సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా శంకర్ దర్శకత్వంలో వస్తున్న భారతీయుడు సినిమాకు సీక్వెల్ అన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను ముగించుకుంటుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పుడు మరో కొత్త సినిమాను లైన్ లో పెట్టినట్టు తెలుస్తుంది. హెచ్ వినోద్ తో సినిమా చేస్తున్నట్టు తెలుస్తుంది. కమల్ హాసన్ 233 సినిమాగా ఈసినిమా తెరకెక్కుతున్నట్టు సమాచారం. వినోద్ తో సినిమాకు కమల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు ఈసినిమాలో మరో టాలెంటెడ్ నటుడు కీలక పాత్రలో నటిస్తున్నాడట. ఆ నటుడు ఎవరో కాదు విజయ్ సేతుపతి. గతంలో కమల్, విజయ్ కలసి ‘విక్రమ్’ లో నటించారు. తాజాగా మరోసారి వీరిద్దరు స్క్రీన్‌ను షేర్ చేసుకొబోతుండటంతో ఈ ప్రాజెక్టుపై భారీ అంచనాలున్నాయి. ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వస్తుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
మరోవైపు అజిత్ తో ఇటీవలే ‘వలీమై’ సినిమా చేశాడు వినోద్. భారీ యాక్షన్ ఎంటర్ టైన్ మెంట్ తో వస్తున్న ఈసినిమా మిశ్రమ ఫలితం అందించింది. ఇక ఇప్పుడు వలిమై తరువాత అజిత్ తోనే వినోద్ మరో సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం అజిత్‌తో ‘తునివు’ ను తెరకెక్కిస్తున్నాడు. ఈ మూవీ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: