పీపుల్ మీడియా ఫ్యాక్టరీ , అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్ పై చందు మొండేటి దర్శకత్వంలో నిఖిల్ , అనుపమ పరమేశ్వరన్ జంటగా సూపర్ హిట్ థ్రిల్లింగ్ మిస్టరీ కార్తికేయ మూవీ కి సీక్వెల్ గా తెరకెక్కిన కార్తికేయ 2 మూవీ ఆగస్ట్ 13 వ తేదీ తెలుగు , హిందీ భాషలలో భారీ అంచనాలతో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తో , భారీ కలెక్షన్స్ సాధించిన విషయం తెలిసిందే. ఈ మూవీలో అనుపమ పరమేశ్వరన్ కథానాయిక. ఓవర్ సీస్ తో పాటు , నార్త్ లో కూడా ఈ మూవీ అద్భుత రెస్పాన్స్ అందుకున్న .కార్తికేయ 2 మూవీ ప్రపంచవ్యాప్తం గా 130కోట్లకు పైగా కలెక్షన్స్ రా బట్టింది. బాలీవుడ్ లో 30 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టడం విశేషం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
యంగ్ హీరో నిఖిల్ కథానాయకుడిగా తెరకెక్కిన 18 పేజెస్ , స్పై మూవీస్ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. కార్తికేయ 2 మూవీ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న నిఖిల్ తన సతీమణి తో గోవా వెకేషన్ లో ఉన్నారు. హీరో నిఖిల్ వ్యక్తిగత విషయం గురించి పెద్ద ఎత్తున పుకార్లు షికార్లు చేయడం మొదలు అయ్యింది.నిఖిల్ తన భార్య పల్లవి వర్మ తో దూరంగా ఉంటున్నాడనీ , ఆమెతో విభేదాల కారణంగా విడాకుల వరకు వెళ్లిందనీ అంటూ పుకార్లు రావడం తో ఆ మధ్య ఒక టాక్ షో లోనే నిఖిల్ క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి ఆ విషయమై క్లారిటీ యిస్తూ గోవా లో తన సతీమణి పల్లవి తో ఉన్న ఫొటో ను నిఖిల్ సోషల్ మీడియా లో షేర్ చేశారు. విడాకుల వార్తలు కేవలం పుకార్లే అని తేలిపోయింది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: