రజినీ జైలర్ లో కన్నడ స్టార్ హీరో

Kannada Star Hero In Rajinikanth Jailer Movie, Kannada Star Hero In Jailer Movie, Rajinikanth Jailer Movie, Kannada Star Hero, Rajinikanth, Shiva Rajkumar, Vasanth Ravi, Ramya Krishnan, Nelson Dilipkumar, Rajinikanth Latest Movie, Rajinikanth's Upcoming Movie, Jailer, Jailer 2023, Jailer Movie, Jailer Update, Jailer New Update, Jailer Latest Update, Jailer Movie Updates, Jailer Telugu Movie, Jailer Telugu Movie Latest News, Jailer Telugu Movie Live Updates, Jailer Telugu Movie New Update, Jailer Movie Latest News And Updates, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

తమిళ్ సూపర్ స్టార్ రజినీకాంత్ మాత్రం ఏ మాత్రం తగ్గేదేలే అంటూ ఒక సినిమా తరువాత మరొక సినిమా చేసుకుంటూ వెళుతున్నాడు. సినిమా జయాపజయాలను పక్కనపెట్టి యంగ్ హీరోలకు సైతం పోటీ ఇస్తూ సినిమాలను లైన్ లో పెడుతున్నాడు. అంతేకాదు యంగ్ డైరెక్టర్లనుసైతం ఎంకరేజ్ చేస్తూ వారికి అవకాశాలను ఇస్తూనే తను కూడా కొత్త కొత్త ప్రయోగాలు చేస్తున్నారు. ఇక గత ఏడాది అన్నాత్తే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు రజనీకాంత్. ఈ ఏడాది మరో సినిమాతో వచ్చేస్తున్నాడు. నెల్స‌న్ దిలీప్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో ఈసినిమా తెరకెక్కుతుంది. రజనీకాంత్ కెరీర్ లో వస్తున్న 169 సినిమా ఇది. జైలర్ అనే టైటిల్ తో ఈసినిమా తెరకెక్కుతుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇదిలా ఉండగా తాజా సమాచారం ఈసినిమాలో కన్నడ స్టార్ హీరో శివ రాజ్ కుమార్ కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. చాలా రోజుల నుండే దీనిపై వార్తలు రాగా ఇప్పుడు మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమాలో శివ రాజ్ కుమార్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నట్టు చిత్రయూనిట్ తెలిపింది.

కాగా ఈసినిమాలో రమ్యకృష్ణ ఒక కీలక పాత్రలో నటిస్తుంది. ఇంకా యోగిబాబు, వసంత్ రవి, వినాయకన్ కూడా ఈసినిమాలో నటిస్తున్నట్టు అధికారికంగా తెలియచేశారు. ఈ మూవీ కి సన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచంద్రన్ సంగీతాన్ని అందించబోతున్నాడు. ఈ సినిమాను సన్ పిక్చర్స్ బ్యానర్ పై భారీ స్థాయిలో నిర్మించనున్నారు. ఇక ఈసినిమాను వచ్చే ఏడాది రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఏప్రిల్ లో వచ్చే తమిళ్ న్యూ ఇయర్ రోజున అంటే ఏప్రిల్ 23వ తేదీన ఈసినిమాను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టు ఇప్పటికే వార్తలు వచ్చాయి. దీనిపై క్లారిటీ రావాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × 3 =