మైత్రీ మూవీ మేకర్స్ , ముత్తంశెట్టి మీడియా బ్యానర్స్ పై సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక జంటగా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ పుష్ప మూవీ ఫస్ట్ పార్ట్ పుష్ప: ది రైజ్ డిసెంబర్ 17న ,తెలుగు, కన్నడ , తమిళ , మలయాళ , హిందీ భాషలలో రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి ప్రపంచవ్యాప్తంగా సుమారు 360 కోట్లు కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. పుష్ప: ది రైజ్ మూవీ లో రఫ్ అండ్ మాస్ క్యారెక్టర్ లో అల్లు అర్జున్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షక , అభిమానులతో పాటు సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకున్నారు. పుష్ప :ది రైజ్ మూవీ హిందీ వెర్షన్ 100కోట్ల క్లబ్ లో చేరింది.ఈ మూవీ తో అల్లు అర్జున్ దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు.పుష్ప మూవీ సెకండ్ పార్ట్ పుష్ప :ది రూల్ మూవీ షూటింగ్ ప్రారంభం అయ్యింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కేరళ రాష్ట్రం లో అల్లు అర్జున్‌కు భారీగా ఫ్యాన్ పాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే. పుష్ప: ది రైజ్ మూవీ లో మలయాళ హీరో ఫహాద్ ఫాజిల్ నటించడం అడ్వాంటేజ్ అయ్యింది. ఈ మూవీ 18 కోట్లకుపైగా కలెక్షన్స్ రాబట్టి, గత ఏడాది మలయాళంలో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన డబ్బింగ్ సినిమాగా నిలిచింది. మలయాళంలో అల్లు అర్జున్ స్టార్‌డమ్‌ను పుష్ప రెట్టింపు చేసింది. తాజాగా పుష్ప సినిమా మరోసారి కేరళలో రీ రిలీజ్ కాబోతున్నది. డిసెంబర్ 17కు పుష్ప విడుదలై ఏడాది పూర్తి అవుతున్న సందర్భంగా మరోసారి ఈ సినిమాను డిసెంబర్ 17 వ తేదీ థియేటర్లలో రీ రిలీజ్ చేసేందుకు అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఏర్పాట్లు చేస్తోన్నట్లు,అధిక సంఖ్యలో స్క్రీన్స్ కూడా అందుబాటులో ఉండేలా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: