
ట్యాగ్ · 19105 కథనాలు · పేజీ 263


కమల్ కు కల్కి టీం బర్త్ డే విషెస్

మరో 150 రోజుల్లో రానున్న దేవర


ప్రముఖ కంపెనీకి గేమ్ ఛేంజర్ మ్యూజికల్ రైట్స్

కమల్ కు దేవర బర్త్ డే విషెస్

కన్ఫామ్.. హిందీ లో బేబి రీమేక్

కోట బొమ్మాళి పీఎస్ టీజర్ రిలీజ్

క్రైమ్ థ్రిల్లర్ అథర్వ రిలీజ్ డేట్ ఫిక్స్

కమల్-మణిరత్నం మూవీ టైటిల్ గ్లింప్స్ రిలీజ్

జపాన్‌లో నా రోల్ చాలా సర్‌ప్రైజింగ్‌గా ఉంటుంది - అను ఇమ్మాన్యుయేల్
హీరో కార్తి తన 25వ చిత్రం ‘జపాన్’ తో ప్రేక్షకులని అలరించేందుకు సిద్ధంగా వున్నారు. జోకర్ ఫేమ్ రాజు మురుగన్ దర్శకత్వం వహించిన ఈ పాన్ ఇండియా హీస్ట్ థ్రిల్లర్ ని డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై ఎస్ ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ ఆర్ ప్రభు నిర్మించారు. అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర టీజర్, ట్రైలర్, పాటలకు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. అన్నపూర్ణ స్టూడియోస్ ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేస్తోంది. జపాన్ 'దీపావళి' కానుకగా నవంబర్ 10న గ్రాండ్ గా థియేటర్స్ లో విడుదలౌతుంది. ఈ సందర్భంగా హీరోయిన్ అను ఇమ్మాన్యుయేల్ విలేకరుల సమావేశంలో జపాన్ విశేషాలని పంచుకున్నారు.

కమల్ కు కల్కి టీం బర్త్ డే విషెస్
ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు దేశవ్యాప్తంగా ప్రతి ఒక్క సినీ లవర్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా కల్కి 2898ఏడీ. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో ఇప్పటివరకూ రానీ డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఈసినిమా వస్తుండటంతో ఈసినిమా కోసం ఇప్పటినుండే వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను శరవేగంగా పూర్తి చేస్తున్నాడు నాగ్ అశ్విన్.

మరో 150 రోజుల్లో రానున్న దేవర
ఎన్టీఆర్ అభిమానులతో పాటు సినీప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా దేవర. శివ కొరటాల దర్శకత్వంలో ఈసినిమా వస్తుంది. ఈసినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది. ఇప్పటికే అండర్ వాటర్ సీక్వెన్స్, కొన్ని కీలక యాక్షన్ సీక్వెన్స్, నైట్ సీక్వెన్స్ పూర్తి చేసుకుంది. రీసెంట్ గానే గోవా వెళ్లిన చిత్రయూనిట్ అక్కడ కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు.

బిగ్ బాస్7-హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ తో 10వ వారం నామినేషన్స్
బిగ్ బాస్7 హౌస్ లో చూస్తుండగానే 9 వారాలు పూర్తయిపోయి పదో వారంలోకి అడుగుపెట్టారు. ఇక తొమ్మిదో వారంలో టెస్టీ తేజా ఎలిమినేట్ అయి హౌస్ నుండి బయటకు వచ్చేశాడు. ప్రస్తుతం అయితే హౌస్ లో 10మంది ఉన్నారు. ఇక సోమవారం ఎపిసోడ్ మొదలైపోయింది. శివాజీ మీద ఇంకా కోపంతోనే ఉన్నాడు గౌతమ్. శివాజీని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవాలంటూ అర్జున్ చెబుతుంటాడు.

గేమ్ ఛేంజర్ లాంటి శక్తివంతమైన స్క్రిప్ట్‌ను చరణ్ వంటి వారే చేయగలరు - కార్తీక్ సుబ్బరాజ్
గేమ్ ఛేంజర్ లాంటి శక్తివంతమైన స్క్రిప్ట్‌ను గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ వంటి స్టార్ హీరోలే చేయగలరని పేర్కొన్నారు కోలీవుడ్ యంగ్ ట్యాలెంటెడ్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్. ఆర్‌సీ15గా వస్తోన్న ఈ చిత్రానికి ఆయన కథను అందించడం విశేషం. కాగా పాన్ ఇండియా సినిమాగా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్‌లు అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో 'భరత్ అనే నేను' ఫేమ్ కియారా అద్వాణీ హీరోయిన్‌గా నటిస్తుండగా.. శ్రీకాంత్, ఎస్‌జే సూర్య, జయరామ్, సముద్రఖని, సునీల్, అంజలి ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. 'వినయ విధేయ రామ' తర్వాత రామ్ చరణ్…

ప్రముఖ కంపెనీకి గేమ్ ఛేంజర్ మ్యూజికల్ రైట్స్
రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో వస్తున్న సినిమా గేమ్ ఛేంజర్. ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత చరణ్ నుండి వస్తున్న సినిమా అవ్వడం.. అందులోనూ శంకర్ దర్శకత్వంలో వస్తున్న సినిమా అవ్వడంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. రామ్ చరణ్ ఈ చిత్రంలో డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నాడు. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది.

కమల్ కు దేవర బర్త్ డే విషెస్
విలక్షణ నటుడు, లోక నాయకుడు కమల్ హాసన్ నేడు తన పుట్టిన రోజును జరుపుకుంటున్న సంగతి తెలిసిందే కదా. ఈనేపథ్యంలోనే తన కొత్త సినిమాల నుండి ఫ్యాన్స్ కు ఫుల్ ట్రీట్ ను ఇస్తు అప్ డేట్స్ వస్తున్నాయి. ఇప్పటికే మణిరత్నం సినిమాకు సంబంధించిన టైటిల్ గ్లింప్స్ అప్ డేట్ వచ్చేసింది. థగ్ లైఫ్ అనే టైటిల్ ను ఈసినిమాకు ఫిక్స్ చేశారు. ఈసినిమాతో పాటు ఇండియన్ 2 సినిమా కూడా చేస్తున్నాడు. ఇంకా పలు సినిమాలు లైనప్ లో ఉన్నాయి.

గుంటూరు కారం ఫస్ట్ సింగిల్ దమ్ మసాలా ఫుల్ సాంగ్ రిలీజ్
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో వస్తున్న ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గుంటూరు కారం. ముచ్చటగా మూడోసారి వీరిద్దరి కాంబినేషన్ వస్తున్న సినిమా కావడంతో ఈసినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈసినిమాలో మహేష్ ఇప్పటివరకూ కనిపించనంత మాస్ అవతార్ లో కనిపించనున్నట్టు అర్థమవుతుంది ఇప్పటివరకూ రిలీజ్ చేసిన పోస్టర్లు, గ్లింప్స్ ను బట్టి. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది. దాదాపు చివరిదశకు వచ్చేసింది షూటింగ్.

త్రివిక్రమ్ శ్రీనివాస్ బర్త్ డే.. మహేష్ బాబు స్పెషల్ విషెస్
టాలీవుడ్ దర్శకుల్లో త్రివిక్రమ్ శ్రీనివాస్ శైలే వేరు. డైలాగ్ రైటర్‌గాసినీ కెరీర్ ప్రారంభించిన ఆయన ఆ తర్వాత దర్శకుడిగా మెగా ఫోన్ చేతపట్టారు. ఈ క్రమంలో అనేక అద్భుతమైన సినిమాలకు దర్శకత్వం వహించారు. ఇక తనదైన శైలిలో సాగే ప్రాసలతో కూడిన డైలాగ్స్ రాసి కొత్త ఒరవడి సృష్టించారు. మాటల మాంత్రికుడిగా పేరు తెచ్చుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ నేడు జన్మదినం జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు టాలీవుడ్ ప్రముఖులు మరియు అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలో సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా త్రివిక్రమ్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు అందజేశారు. ఈ మేరకు తన అధికారిక ఎక్స్ (ట్విట్టర్)లో.. "మా…

భగవంత్ కేసరి బాక్సాఫీస్ కా షేర్ సెలబ్రేషన్స్ వేదిక ఫిక్స్
అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా వచ్చిన ఈసినిమా భగవంత్ కేసరి. ఈసినిమాలో శ్రీలీల కూడా కీలక పాత్రలో నటించింది. ఇక ఈసినిమా అక్టోబర్ 20వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతంచేసుకుంది. అనిల్ కథ, బాలకృష్ణ-శ్రీలీల మధ్య ఎమోషనల్ సీన్స్, థమన్ బ్యాక్ గ్రౌండ్ స్క్రీన్ అన్నీ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. అందుకే మూడో వారంలో కూడా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. ఇక ఈసినిమా కలెక్షన్స్ పరంగా గా సాలిడ్ కలెక్షన్స్ ను అందుకున్నాయి. మూడు వారల్లో ఈసినిమా దాదాపు 140 కోట్ల కలెక్షన్స్ ను సొంతం చేసుకుంది.

కన్ఫామ్.. హిందీ లో బేబి రీమేక్
చిన్న సినిమా వచ్చి బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది బేబి సినిమా. అసలు ఏమాత్రం అంచనాలు లేకుండా వచ్చి సంచలన విజయం సాధించింది. ట్రయాంగిల్ లవ్ స్టోరీతో యూత్ ఫుల్ లవ్ ఎంటర్ టైనర్ గా ఈసినిమా రావడంతో యూత్ ను బాగా ఆకట్టుకుంది. ఇక హిట్ అయిన సినిమాలను పలు భాషల్లో రీమేక్ చేయడం అనేది ఇప్పుడు కామన్ గా మారిపోయింది. ఈనేప్యథ్యంలోనే ఇప్పటికే మన తెలుగులో హిట్ అయిన సినిమాలను హిందీలో రీమేక్ చేసి హిట్లను అందుకుంటున్నారు. ఇప్పుడు ఈసినిమా కూడా రీమేక్ కాబోతున్నట్టు తెలుస్తుంది.

యాత్ర 2 నుండి సోనియా గాంధీ ఫస్ట్ లుక్ రిలీజ్
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి (వైఎస్సార్) పాదయాత్ర నేపథ్యంలో రూపొందిన చిత్రం 'యాత్ర'. మహీ వి. రాఘవ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా 2019 ఫిబ్రవరి 8న విడుదలై మంచి విజయం అందుకుంది. వైఎస్సార్ పాత్రలో మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి నటించారు. వైఎస్సార్ పాత్రలో ఆయన పరకాయ ప్రవేశం చేశారని చెప్పవచ్చు.. నడకలో, బాడీ లాంగ్వేజ్‌లో, హావభావాల్లో వైఎస్సార్‌ను దించేశారు మమ్ముట్టి. ఇక వైఎస్సార్ తండ్రి రాజారెడ్డి పాత్రలో సీనియర్ నటుడు జగపతి బాబు, వైఎస్సార్‌కు అత్యంత సన్నిహితుడు కేవీపీ రామచంద్ర రావుగా రావు రమేష్ నటించారు. అలాగే సీనియర్ నాయకురాలు గౌరు చరిత క్యారెక్టర్‌లో నటి…

కోట బొమ్మాళి పీఎస్ టీజర్ రిలీజ్
తేజ మార్ని దర్శకత్వంలో శ్రీకాంత్, వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా కోట బొమ్మాళి పీఎస్. ఈసినిమా మలయాళంలో సూపర్ హిట్ అయిన నాయట్టు సినిమాకు రీమేక్ గా వస్తుంది. ఇక ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. మరోవైపు ఈసినిమా ప్రమోషన్స్ ను కూడా మొదలుపెట్టింది చిత్రయూనిట్.

ఓటీటీలో కూడా హవా చూపిస్తున్న మ్యాడ్
ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా వచ్చి సూపర్ హిట్ టాక్ ను తెచ్చుకుంది మ్యాడ్ సినిమా. కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో నార్నె, సంగీత్ శోభన్,రామ్ నితిన్ ప్రధాన పాత్రల్లో కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఈసినిమా వచ్చింది. కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా వచ్చిన మ్యాడ్ యూత్ ను విపరీతంగా ఆకట్టుకుంది.

కమల్ థగ్ లైఫ్ నుండి కీలక పాత్రల పోస్టర్లు రిలీజ్
లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో లోక నాయకుడు కమల్ హాసన్ హీరోగా 1987 లో వచ్చిన నాయకుడు సినిమా ఎంత హిట్ అయిందో తెలిసిందే కదా. ఇక ఈసినిమా తరువాత వీరిద్దరి కాంబినేషన్ లో మరో సినిమా రాలేదు. అయితే ఇప్పుడు దాదాపు 36ఏళ్ల తరువా మళ్లీ ఈ కాంబినేషన్ రిపీట్ కానుంది. క్లాసిక్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కాబట్టి ఇప్పటినుండే అంచనాలు పెరిగిపోయాయి. ఈమధ్యనే సినిమా షూటింగ్ ను మొదలుపెట్టారు.

క్రైమ్ థ్రిల్లర్ అథర్వ రిలీజ్ డేట్ ఫిక్స్
మహేష్ రెడ్డి దర్శకత్వంలో కార్తీక్ రాజు హీరోగా వస్తున్న సినిమా అథర్వ. క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో ఈసినిమా తెరకెక్కుతుంది. ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకొని రిలీజ్ కు సిద్దమవుతుంది. మరోవైపు ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలను చిన్నగా మొదలుపెట్టారు మేకర్స్. దీనిలో భాగంగానే ఈసినిమా పోస్టర్లను, టీజర్ ను రిలీజ్ చేయగా వాటికి మంచి రెస్పాన్సే వచ్చింది.

సలార్- కేరళ లో రిలీజ్ చేయనున్న స్టార్ హీరో ప్రొడక్షన్ హౌస్
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా వస్తున్న సినిమా సలార్. ఈసినిమా కోసం ప్రేక్షకులు ఎంత ఈగర్ గా వెయిట్ చేస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. కె.జి.ఎఫ్ డైరెక్టర్ కాబట్టి ఆమాత్రం అంచనాలు ఉండటం కామన్. అందుకే అంతలా వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతం అయితే ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది.

కమల్-మణిరత్నం మూవీ టైటిల్ గ్లింప్స్ రిలీజ్
కమల్ ఫ్యాన్స్ తో పాటు సినీ లవర్స్ అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తుంది మణిరత్నం దర్శకత్వంలో రాబోతున్న సినిమా గురించి. అప్పట్లో వీరిద్దరి కాంబినేషన్ వచ్చిన నాయకుడు సినిమా ఎన్ని సంచలనాలు సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఆ తరువాత మళ్లీ ఇన్నేళ్లకు ఈ కాంబినేషన్ రిపీట్ అవుతుండటంతో సినిమాపై ఇప్పటినుండే అంచనాలు పెరిగిపోయాయి. రీసెంట్ గానే ఈసినిమా ను పూజా కార్యక్రమాలతో మొదలుపెట్టారు చిత్రయూనిట్. KH 234అనే వర్కింగ్ టైటిల్ తో ఈసినిమా రానుంది.

కీడా కోలా యూఎస్ లో బ్లాస్టింగ్ కలెక్షన్స్
మొత్తానికి లేట్ గా వచ్చినా లేటెస్ట్ గా వచ్చాడు తరుణ్ భాస్కర్. పెళ్లి చూపులు, ఈ నగరానికి ఏమైంది సినిమాల తరువాత చాలా గ్యాప్ తీసుకొని లేటెస్ట్ గా కీడా కోలా సినిమాతో వచ్చాడు. ఈసినిమా నవంబర్ 3వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నిజానికి రిలీజ్ కు ముందే ఈసినిమాపై మంచి క్యూరియాసిటీని పెంచాడు తరుణ్ భాస్కర్. అసలు కథను ఎక్కడా రివీల్ చేయకుండా మంచి బజ్ క్రియేట్. ఇక సినిమా రిలీజ్ అయి సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. కామెడీ థ్రిల్లర్ కావడంతో అందరికీ నచ్చుతుంది. ముఖ్యంగా తరుణ్ భాస్కర్ కామెడీని హ్యాండిల్ చేసిన విధానం సినిమాకి బాగా ప్లస్ అయ్యింది.

దిల్ రాజు సొంత ఓటీటీ రూమర్లపై టీమ్ క్లారిటీ
టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్స్ లో దిల్ రాజు పేరు ముందు వరుసలో ఉంటుంది. డిస్ట్రిబ్యూటర్ గా కెరీర్ ను మొదలుపెట్టి ఇప్పుడు టాప్ ప్రొడ్యూసర్ అయ్యారు. ఆయన నిర్మించిన సినిమాల్లో కొద్ది సినిమాలు తప్పా చాలా సినిమాలు విజయాలే అందుకున్నారు. అందుకే దిల్ రాజు సినిమా అంటే మినిమం గ్యారెంటీ సినిమాగా పేరు పడిపోయింది. ఇక రీసెంట్ గా దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ పెట్టి చిన్న సినిమాలను సైతం నిర్మిస్తున్నాడు.