కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా, హీరో, వార్త వెతకండి…అప్‌డేట్స్
వెనక్కి

Tollywood Movie Updates

ట్యాగ్ · 19105 కథనాలు · పేజీ 254

Director Harish Shankar Says Trollers are His Stress Busters
సినిమా వార్తలు

ట్రోలర్స్ నా స్ట్రెస్ బస్టర్స్ - డైరెక్టర్ హరీష్ శంకర్

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే దర్శకుల్లో ముందువరుసలో ఉంటారు ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ హరీష్ శంకర్. తాను తీసే సినిమాలకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అందిస్తూ అభిమానులను ఖుషీ చేస్తుంటారు. అలాగే వారు అడిగే కొన్ని ప్రశ్నలకు తనదైన శైలిలో బదులిస్తూ తరచుగా వార్తల్లో నిలుస్తుంటారు. ఈ క్రమంలోనే తాజాగా ఎక్స్ (ట్విట్టర్)లో వివిధ అంశాలకు సంబంధించి నెటిజెన్ల ప్రశ్నలకు హరీష్ శంకర్ సోషల్ పలు ఆసక్తికర సమాధానాలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఒక నెటిజెన్ ఇచ్చిన సలహాకు స్పందిస్తూ.. ట్రోలర్స్ నా స్ట్రెస్ బస్టర్స్ అని పేర్కొన్నారు.

Srikanth Mవాట్సాప్
iconic telugu cinema legends in a single frame
సినిమా వార్తలు

అలనాటి వెండితెర వెలుగులు ఒకే ఫ్రేమ్ లో

మన తెలుగు సినీ పరిశ్రమ ఇప్పుడు ఇంత స్థాయిలో ఉందంటే దాని వెనుక అలనాటి నటీనటుల కృషి ఎంతో ఉందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఎన్టీఆర్, ఏఎన్నార్ ను అయితే మన సినీ పరిశ్రమకు రెండు కళ్లు అని అనేవారంటేనే అర్థం చేసుకోవచ్చు భారతీయ చలన చిత్ర చరిత్రలో వారు లిఖించిన, చేసిన సేవలు. అప్పట్లో అంటే అలనాటి నటుల గురించి.. పలు విషయాలు గురించి పెద్దగా తెలిసేవి కాదు కానీ.. ఇప్పుడు సోషల్ మీడియా పుణ్యమా అంటూ ఆ నాటి విషయాల గురించి తెలుస్తున్నాయి. దీనిలో భాగంగానే ఈమధ్య కాలంలో అప్పుడప్పుడు పాతతరం ఫొటోలు చూసే అవకాశం దొరుకుతుంది. ఈనేపథ్యంలోనే ఇప్పుడు తాజాగా ఒక అరుదైన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అలనాటి నటీ నటులతో…

TFN Adminవాట్సాప్
Mega Star Chiranjeevi Launches Izzat Song From Bubble Gum Movie
సాంగ్

ఈ పాటకు రోషన్‌తో కలిసి స్టెప్స్ వేయాలనిపించింది - మెగాస్టార్ చిరంజీవి

సీనియర్ నటుడు రాజీవ్ కనకాల, ప్రముఖ యాంకర్ సుమ దంపతుల కుమారుడు రోషన్ కనకాల హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘బబుల్‌గమ్‌’. 'క్షణం', 'కృష్ణ అండ్ లీల' చిత్రాలకు మంచి గుర్తింపు తెచ్చుకున్న రవికాంత్‌ పేరేపు దర్శకత్వం వహిస్తున్నారు. మానస చౌదరి కథానాయికగా నటించగా.. హర్ష, కిరణ్‌ మచ్చ, అనన్య ఆకుల, అను హాసన్‌ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు. మహేశ్వరి మూవీస్‌, పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా డిసెంబరు 29న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

Srikanth Mవాట్సాప్
Hero Nani Reveals Interesting Facts About Hi Nanna Movie
సినిమా వార్తలు

సినిమా నా ఊపిరి, ఆ ఊపిరి మీద ఒట్టేసి చెబుతున్నా.. హీరో నాని

సినిమా నా ఊపిరి, ఆ ఊపిరి మీద ఒట్టేసి చెబుతున్నా.. డిసెంబర్ 7న ప్రేక్షకులందరూ నాన్న ప్రేమలో పడిపోవడం ఖాయం అని పేర్కొన్నారు నేచురల్ స్టార్ నాని. ఈ మేరకు ఆయన శుక్రవారం (నవంబర్ 24, 2023) తాను కథానాయకుడిగా నటించిన 'హాయ్ నాన్న' సినిమా థియేట్రికల్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో పాల్గొన్న సందర్భంగా వ్యాఖ్యానించారు. వైరా ఎంటర్‌టైన్‌మెంట్ మొదటి ప్రొడక్షన్ వెంచర్‌ గా రూపొందిన ఈ చిత్రం ద్వారా శౌర్యువ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 7న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది.

Srikanth Mవాట్సాప్
kantara movie prequel first look release date time fixed
ఫస్ట్ లుక్

కాంతార ప్రీక్వెల్ ఫస్ట్ లుక్ రిలీజ్ డేట్ ఫిక్స్

రిషబ్ శెట్టి దర్శకత్వంలో వచ్చిన కాంతార సినిమా ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కర్ణాటక, కేరళలో ఉన్న ఆచారాలను ఆధారంగా చేసుకొని ఈసినిమాను తెరకెక్కించారు. కన్నడలో చిన్నగా ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈసినిమా అక్కడ సంచలన విజయం సాధించింది. దీంతో గీతా ఆర్ట్స్ వారు ఈసినిమా తెలుగు హక్కులను సొంతం చేసుకొని ఇక్కడ రిలీజ్ చేయగా ఇక్కడ కూడా సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకొని భారీ కలెక్షన్స్ ను అందించింది. అంతేకాదు అంతర్జాతీయ వేదికలపై సైతం ప్రశంసలను దక్కించుకుంది.

TFN Adminవాట్సాప్
this is lady rosy song promo out from devil movie
సాంగ్

డెవిల్- దిస్ ఈజ్ లేడీ రోజ్ సాంగ్ ప్రోమో రిలీజ్

కళ్యాణ్ రామ్ కూడా ఇప్పుడు డిఫరెంట్ సినిమాలను ఎంచుకోవడానికే చూస్తున్నాడు. అందుకే డిఫరెంట్ సినిమాలు చేసుకుంటూ విజయాలను అందుకుంటూ వెళుతున్నాడు. ప్రస్తుతం తన నుండి వస్తున్న సినిమా డెవిల్. నవీన్ మేడారం దర్శకత్వంలో ఈసినిమా వస్తుంది. 1940 బ్యాక్ డ్రాప్ లో రాబోతున్న ఈసినిమాలో కళ్యాణ్ రామ్ బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్ పాత్రలో నటిస్తుండటంతో ఈసినిమాపై మొదటినుండీ అంచనాలు భారీగానే పెరిగాయి.

TFN Adminవాట్సాప్
hi nanna movie trailer out now
ట్రైలర్ & టీజర్

హాయ్ నాన్న ట్రైలర్ రిలీజ్-లవ్ ప్లస్ ఎమోషనల్

న్యాచురల్ స్టార్ నాని గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏ జోనర్ అయినా సరే న్యాచురల్ గా నటిస్తాడు కాబట్టే న్యాచురల్ స్టార్ అన్న పేరును సొంతంచేసుకున్నాడు. ఇక ఈ ఏడాది ప్రథమార్థంలో దసరా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు నాని. ఈసినిమా బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకుంది. ఈసినిమాలో ఊర మాస్ లుక్ లో అలరించాడు. ఇక ఇప్పుడు మరో సినిమాతో వచ్చేస్తున్నాడు. శౌర్యువ్ దర్శకత్వంలో నాని హీరోగా వస్తున్న సినిమా హాయ్ నాన్న. ఈసారి ఎమోషనల్ కమ్ లవ్ స్టోరీ తో వచ్చేస్తున్నాడు. మరి ఎమోషనల్ కంటెంట్ అంటే నాని ఎలా జీవిస్తాడో చెప్పనక్కర్లేదు.

TFN Adminవాట్సాప్
Ravi Teja’s Eagle Movie 50 Days Countdown Poster Released
ఫస్ట్ లుక్

మరో 50 రోజుల్లో థియేటర్లలోకి ‘ఈగల్’.. కౌంట్‌డౌన్ పోస్టర్‌ రిలీజ్

మాస్ మహారాజా రవితేజ మోస్ట్ ఎవైటెడ్ ఇంటెన్స్ అండ్ యూనిక్ యాక్షన్ థ్రిల్లర్ ‘ఈగల్’ థియేట్రికల్ రాకకు కౌంట్ డౌన్ ప్రారంభమైంది. ట్యాలెంటెడ్ డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వ ప్రసాద్ నిర్మిస్తుండగా, వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదలకు సిద్ధమవుతోంది. మూవీ రిలీజ్ కు కౌంట్‌డౌన్ ప్రారంభం కావడంతో మేకర్స్ మరింత దూకుడు పెంచారు.

Srikanth Mవాట్సాప్
Animal Movie Advance Bookings Open From Today
సినిమా వార్తలు

యానిమల్ అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్

బాలీవుడ్ సూపర్ స్టార్ హీరో రణ్‌బీర్‌ కపూర్‌ ప్రధానపాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ 'యానిమల్‌'. దేశవ్యాప్తంగా మూవీ లవర్స్ ఈ సినిమాను థియేటర్లలో చూడటానికి తెగ ఎదురుచూస్తున్నారు. 'అర్జున్‌ రెడ్డి' ఫేమ్ సందీప్‌ రెడ్డి వంగా దర్శకత్వం వహించారు. నేషనల్‌ క్రష్‌, కన్నడ భామ రష్మిక మందన్న ఫీ మేల్‌ లీడ్ రోల్‌ల్‌ నటిస్తుండగా.. బాలీవుడ్ సీనియర్ నటులు అనిల్ కపూర్ మరియు బాబీ డియోల్ కీలక పాత్రల్లో పోషిస్తున్నారు. రణ్‌బీర్‌ కపూర్‌ పూర్తి మాస్ క్యారెక్టర్లో నటిస్తుండటం.. అలాగే 'కబీర్‌ సింగ్' వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత సందీప్ రెడ్డి రూపొందిస్తున్న చిత్రం కావడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.

Srikanth Mవాట్సాప్
extra ordinary man movie trailer release date fixed
ట్రైలర్ & టీజర్

ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్

జయాపజయాలతో పనిలేకుండా నితిన్ వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ప్రస్తుతం అయితే నితిన్ నుండి రాబోతున్నసినిమా ఎక్స్ ట్రా ఆర్డినరీ. స్టార్ రైటర్ వక్కంతం వంశీ దర్శకత్వంలో యంగ్ హీరో నితిన్ ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా ఎక్స్‌ట్రా ఆర్డిన‌రీ మ్యాన్. ఈసినిమా డిసెంబర్ 8వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈసినిమా చిత్రయూనిట్ ప్రస్తుతం ఓ మాస్ సాంగ్ చిత్రీకరణలో బిజీగా ఉంది. మరోవైపు పోస్ట్ ప్రోడక్షన్ పనులు కూడా పూర్తిచేస్తూ రిలీజ్ సిద్దమవుతుంది. అంతేకాదు ప్రమోషన్ కార్యక్రమాల్లో కూడా జోరు పెంచారు. ఇప్పటకే పలు పాటలు, టీజర్ ను రిలీజ్ చేయగా ఇప్పుడు ట్రైలర్ ను రిలీజ్ చేయడానికి సిద్దమయ్యారు. తాజాగా ఈ…

TFN Adminవాట్సాప్
adivi sesh interesting comments on Goodachari 2 movie
సినిమా వార్తలు

గూఢచారి 2 పెద్ద స్పై ఫిలిం

టాలీవుడ్ టాలెంటెడ్ హీరో అడివిశేష్ హీరోగా రాబోతున్న నెక్ట్స్ ప్రాజెక్ట్ గూఢచారి 2. ఈసినిమా గూఢచారి సినిమాకు సీక్వెల్ అన్న సంగతి తెలిసిందే కదా. 2018 లో వచ్చిన గూఢచారి బ్లాక్ బస్టర్ అయింది. ఈ నేపథ్యంలో ఈసినిమాకు సీక్వెల్ తీస్తున్నారు. ఈసినిమాను ఇప్పటికే ప్రకటించారు కానీ ఇంతవరకూ సెట్స్ పైకి వెళ్లలేదు.

TFN Adminవాట్సాప్
thalapathy vijay leo movie streaming now on netflix
ఓటీటీ

ఫైనల్లీ ఓటీటీలోకి వచ్చేసిన లియో

దళపతి విజయ్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వచ్చిన సినిమా లియో. యాక్షన్ థ్రిల్లర్ గా వచ్చిన ఈసినిమా అక్టోబర్ 19న థియేటర్లలో విడుదలైన సంగతి తెలిసిందే. ఇక ఈసినిమా తమిళ్ లో అయితే సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకోగా.. తెలుగులో కాస్త మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకుంది. అంతేకాదు కలెక్షన్స్ పరంగా కూడా ఈసినిమా సాలిడ్ కలెక్షన్స్ న సొంతం చేసుకుంది. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.600కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లను రాబట్టింది.

TFN Adminవాట్సాప్
aadi keshava movie telugu review
రివ్యూ

రివ్యూ : ఆదికేశవ

ఓవరాల్ గా రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్ లో వచ్చిన ఈ ఆదికేశవ టైం పాస్ చేయిస్తాడు.హీరో హీరోయిన్ల యాక్టింగ్, డ్యాన్స్ ,సంగీతం,క్లైమ్యాక్స్ హైలైట్ అయ్యాయి.పెద్దగా అంచనాలు లేకుండా వెళితే రెండు గంటలు ఆదికేశవ ఎంటర్ టైన్ చేస్తాడు.

Mahender Reddyవాట్సాప్
Anand Devarakonda Responds Over Pilot's Special Note Regarding His Acting in Baby Movie
సినిమా వార్తలు

పైలట్‌ స్పెషల్ నోట్.. ఆనంద్‌ దేవరకొండ స్పందన ఇదే

టాలీవుడ్ యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరో ఆనంద్ దేవరకొండ విచిత్ర అనుభవాన్ని ఎదుర్కొన్నారు. తాను ప్రయాణం చేస్తున్న విమాన పైలట్ ప్రత్యేకంగా లేఖ రాయడంపై ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. అసలేమైందంటే..? ఇటీవల ఆనంద్ దేవరకొండ ఇండిగో విమానంలో ప్రయాణించారు. ఈ సందర్భంగా సదరు విమాన పైలట్‌ సుభాష్‌.. ఆనంద్‌ నటనను మెచ్చుకుంటూ స్పెషల్‌గా ఒక లేఖ రాసి అందించారు. ఆ లేఖలో.. ‘బేబి’ చిత్రం చూసి తాను కన్నీళ్లు పెట్టుకున్నానని, ఆ సినిమాలో అద్భుతంగా నటించి ఆనంద్‌ తన మనసు గెలుచుకున్నాడని పేర్కొన్నారు. ఆయన భవిష్యత్తులోనూ ఇలాంటి మంచి చిత్రాల్లో నటించాలని ఆకాంక్షించారు. అలాగే, తన బ్రదర్ టాలీవుడ్ స్టార్ హీరో విజయ్‌ దేవరకొండకు…

Srikanth Mవాట్సాప్
Puri Jagannadh Welcomes Music Maestro Mani Sharma For Double iSmart Movie
సినిమా వార్తలు

డబుల్ ఇస్మార్ట్ సాలిడ్ అప్‌డేట్.. మ్యూజిక్ డైరెక్టర్ అనౌన్స్‌మెంట్

టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో ఉస్తాద్ రామ్ పోతినేని, డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కలయికలో వస్తోన్న తాజా చిత్రం 'డబుల్ ఇస్మార్ట్‌'. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన 'ఇస్మార్ట్ శంకర్' సినిమాకు సీక్వెల్‌గా ఇది రూపొందుతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ముంబైలో జరుగుతోంది. బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్‌ ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. కొన్నిరోజుల క్రితం విడుదలైన సంజయ్ దత్ ఫస్ట్ లుక్ కి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రానికి సంబంధించిన ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో వెల్లడించనున్నారు మేకర్స్.

Srikanth Mవాట్సాప్
Ranbir Kapoor Expresses His Interest to Work in Prabhas' Spirit Movie
సినిమా వార్తలు

ప్రభాస్ స్పిరిట్‌ లో నటించడంపై.. రణ్‌బీర్‌ కపూర్‌ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

బాలీవుడ్ సూపర్ స్టార్ హీరో రణ్‌బీర్‌ కపూర్‌ ప్రధానపాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ 'యానిమల్‌'. దేశవ్యాప్తంగా మూవీ లవర్స్ ఈ సినిమాను థియేటర్లలో చూడటానికి తెగ ఎదురుచూస్తున్నారు. 'అర్జున్‌ రెడ్డి' ఫేమ్ సందీప్‌ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన ఈ సినిమా నుంచి తాజాగా విడుదలై ట్రైలర్ యూ ట్యూబ్ లో సెన్సేషన్ సృష్టిస్తోంది. నేషనల్‌ క్రష్‌, కన్నడ భామ రష్మిక మందన్న ఫీ మేల్‌ లీడ్ రోల్‌ పోషిస్తుండగా.. బాలీవుడ్ సీనియర్ నటులు అనిల్ కపూర్ మరియు బాబీ డియోల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రణ్‌బీర్‌ కపూర్‌ పూర్తి మాస్ క్యారెక్టర్లో నటిస్తుండటం.. అలాగే 'కబీర్‌ సింగ్' వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత సందీప్ రెడ్డి…

Srikanth Mవాట్సాప్
hanuman movie sound mixing work begun
సినిమా వార్తలు

హనుమాన్ సౌండ్ మిక్సింగ్ పనులు ప్రారంభం

ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజా సజ్జా హీరోగా వస్తున్న సినిమా హనుమాన్. సూపర్ హీరోస్ నేపథ్యంలో ఫాంటసీ సినిమాగా ఈసినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ప్రశాంత్ వర్మ, తేజా సజ్జా కాంబినేషన్ లో ఇప్పటికే జాంబిరెడ్డి సినిమా వచ్చి హిట్ అవ్వడంతో ఈసినిమాపై మొదటి నుండీ మంచి ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. దానికితోడు ఈ సినిమా నుంచి విడుదలవుతున్న పోస్టర్లు, టీజర్ సహా పలు అప్ డేట్స్ అంచనాలను భారీగా పెంచేశాయి.

TFN Adminవాట్సాప్
vikrams dhruva nakshathram movie postponed again
సినిమా వార్తలు

ధ్రువ నక్షత్రం- మరోసారి రిలీజ్ వాయిదా

గౌతమ్ మీనన్ దర్శకత్వంలో విక్రమ్ హీరోగా వస్తున్న సినిమా ధ్రువ నక్షత్రం. తమిళ్ లో ధృవ నచ్చత్తిరం అంటూ రిలీజ్ అవుతుండగా.. తెలుగులో ధ్రువ నక్షత్రం టైటిల్ తో రిలీజ్ అవుతుంది. స్పై యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న ఈసినిమాలో.. జాన్ అనే స్పై క్యారెక్టర్‌ లో నటిస్తున్నాడు విక్రమ్.

TFN Adminవాట్సాప్
bhagavanth kesari movie streaming on amazon prime video
ఓటీటీ

ఓటీటీలోకి వచ్చేసిన భగవంత్ కేసరి

అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా వచ్చిన సినిమా భగవంత్ కేసరి. ఈ సినిమా అక్టోబర్‌ 19న విడుదలై మంచి విజ‌యం సాధించింది. ఈసినిమాతో అనిల్ రావిపూడి లిస్ట్ ల ఖాతాలో మరో సినిమా చేరిపోవడమే కాకుండా బాలకృష్ణకు హ్యాట్రిక్ ఇచ్చింది. ఎమోషనల్ ప్లస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈసినిమా అన్ని వర్గాల వారిని ఆకట్టుకొని ఫస్ట్‌ డే నుంచే పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకొని బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అందుకే దాదాపు 140 కోట్ల కలెక్షన్స్ ను అందించింది. అనిల్ కథ, బాలకృష్ణ-శ్రీలీల మధ్య ఎమోషనల్ సీన్స్, థమన్ బ్యాక్ గ్రౌండ్ స్క్రీన్ అన్నీ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.

TFN Adminవాట్సాప్
prabhas praises on animal movie trailer
ట్రైలర్ & టీజర్

యానిమల్ ట్రైలర్ పై ప్రభాస్ రియాక్షన్

అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ వంగ దర్శకత్వంలో రణబీర్ కపూర్ హీరోగా వస్తున్న సినిమా యానిమల్. క్రేజీ కాంబినేషన్ కాబట్టి ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ప్రస్తుతం అయితే చిత్రయూనిట్ పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. ఎన్నో వాయిదాల అనంతరం ఈసినిమా డిసెంబర్ 1వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోవైపు చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టింది. ఇక ఈసినిమా ట్రైలర్ ను కొద్ది సేపటి క్రితమే రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే కదా. ట్రైలర్ కు అయితే సూపర్ రెస్పాన్స్ వస్తుంది. యాక్షన్ థ్రిల్లర్ గా ఫాదర్ అండ్ సన్ మధ్య ఎమోషనల్ కంటెంట్ తో వచ్చిన ఈ ట్రైలర్ తో సినిమాపై అంచనాలను మరింత పెంచేశాడు…

TFN Adminవాట్సాప్

షేర్