డెవిల్- దిస్ ఈజ్ లేడీ రోజ్ సాంగ్ ప్రోమో రిలీజ్

this is lady rosy song promo out from devil movie

కళ్యాణ్ రామ్ కూడా ఇప్పుడు డిఫరెంట్ సినిమాలను ఎంచుకోవడానికే చూస్తున్నాడు. అందుకే డిఫరెంట్ సినిమాలు చేసుకుంటూ విజయాలను అందుకుంటూ వెళుతున్నాడు. ప్రస్తుతం తన నుండి వస్తున్న సినిమా డెవిల్. నవీన్ మేడారం దర్శకత్వంలో ఈసినిమా వస్తుంది. 1940 బ్యాక్ డ్రాప్ లో రాబోతున్న ఈసినిమాలో కళ్యాణ్ రామ్ బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్ పాత్రలో నటిస్తుండటంతో ఈసినిమాపై మొదటినుండీ అంచనాలు భారీగానే పెరిగాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్రస్తుతం అయితే ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. దీనిలో భాగంగానే ఈసినిమా మ్యూజికల్ ప్రమోషన్స్ ను ఇప్పటికే మొదలుపెట్టారు మేకర్స్. ఇప్పటికే మాయే చేసి అనే మొదటిపాటను రిలీజ్ చేయగా మెలోడియస్ గా ఉన్న ఈపాట బాగానే ఆకట్టుకుంటుంది. ఇప్పుడు సెకండ్ సాంగ్ ను రిలీజ్ చేయడానికి సిద్దమయ్యారు. ది ఈజ్ లేడీ రోజ్ అంటూ వచ్చే ఈ పాటను రిలీజ్ చేయనున్నారు. ఈనేపథ్యంలో తాజాగా ఈపాట ప్రోమోను రిలీజ్ చేయనున్నారు.

కాగా ఈసినిమాలో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తుంది. దేవాన్ష్ నామా సమర్పణలో అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ అభిషేక్ నామా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నాడు. పాన్ ఇండియా సినిమాగా తెలుగు హిందీ తమిళం మరియు కన్నడ భాషలలో భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.