హాయ్ నాన్న ట్రైలర్ రిలీజ్-లవ్ ప్లస్ ఎమోషనల్

hi nanna movie trailer out now

న్యాచురల్ స్టార్ నాని గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏ జోనర్ అయినా సరే న్యాచురల్ గా నటిస్తాడు కాబట్టే న్యాచురల్ స్టార్ అన్న పేరును సొంతంచేసుకున్నాడు. ఇక ఈ ఏడాది ప్రథమార్థంలో దసరా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు నాని. ఈసినిమా బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకుంది. ఈసినిమాలో ఊర మాస్ లుక్ లో అలరించాడు. ఇక ఇప్పుడు మరో సినిమాతో వచ్చేస్తున్నాడు. శౌర్యువ్ దర్శకత్వంలో నాని హీరోగా వస్తున్న సినిమా హాయ్ నాన్న. ఈసారి ఎమోషనల్ కమ్ లవ్ స్టోరీ తో వచ్చేస్తున్నాడు. మరి ఎమోషనల్ కంటెంట్ అంటే నాని ఎలా జీవిస్తాడో చెప్పనక్కర్లేదు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమా డిసెంబర్ 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది. దీనిలో భాగంగానే తాజాగా ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ట్రైలర్ అయితే కలర్ ఫుల్ గా ఆకట్టుకుంటుంది. అటు ఎమోషనల్ తో పాటు మృణాల్-నాని మధ్య కెమిస్ట్రీ కూడా హెలెట్ గా ఉండేలా కనిపిస్తుంది. విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకుంటున్నాయి.

ఇక ఈసినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తుంది. నాని కూతురిగా బేబి కైరా ఖన్నా నటిస్తోంది. సాను జాన్ వర్గీస్ సినిమాటోగ్రాఫర్ గా..హృదయం ఫేమ్‌కు చెందిన ప్రముఖ మలయాళ కంపోజర్ హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈసినిమాను వైరా ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యాన‌ర్‌పై సి.వి.మోహ‌న్‌, డాక్ట‌ర్ విజేందర్ రెడ్డి తీగ‌ల‌, మూర్తి కె.ఎస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు..

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen − 11 =