బాలీవుడ్ సూపర్ స్టార్ హీరో రణ్బీర్ కపూర్ ప్రధానపాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ‘యానిమల్’. దేశవ్యాప్తంగా మూవీ లవర్స్ ఈ సినిమాను థియేటర్లలో చూడటానికి తెగ ఎదురుచూస్తున్నారు. ‘అర్జున్ రెడ్డి’ ఫేమ్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించారు. నేషనల్ క్రష్, కన్నడ భామ రష్మిక మందన్న ఫీ మేల్ లీడ్ రోల్ల్ నటిస్తుండగా.. బాలీవుడ్ సీనియర్ నటులు అనిల్ కపూర్ మరియు బాబీ డియోల్ కీలక పాత్రల్లో పోషిస్తున్నారు. రణ్బీర్ కపూర్ పూర్తి మాస్ క్యారెక్టర్లో నటిస్తుండటం.. అలాగే ‘కబీర్ సింగ్’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత సందీప్ రెడ్డి రూపొందిస్తున్న చిత్రం కావడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
‘యానిమల్’ మూవీ హిందీ సహా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో డిసెంబర్ 1న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం తెలుగులోనూ ప్రమోషన్స్ గట్టిగా చేస్తోంది. దీనిలో భాగంగా రణ్బీర్ కపూర్, రష్మిక మందన్నా, సందీప్ రెడ్డిలతో కలిసి టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తోన్న ‘అన్స్టాపబుల్ విత్ ఎన్బీకే షో’లో సందడి చేశారు. గురువారం అర్ధరాత్రి నుంచి ‘ఆహా’ వేదికగా ఈ ప్రోగ్రాం ప్రసారమవుతోంది. ఇక తాజాగా ఈ సినిమా నుంచి విడుదలై ట్రైలర్ యూ ట్యూబ్ లో సెన్సేషన్ సృష్టిస్తోంది.
ఈ క్రమంలో మూవీ టీమ్ సినీప్రియులకు మరో క్రేజీ అప్డేట్ ఇచ్చింది. ‘యానిమల్’ చిత్రం అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. ఈ మేరకు చిత్రబృందం సోషల్ మీడియాలో వెల్లడించింది. ఇక ఈ సినిమా చూసేందుకు మూవీ లవర్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న నేపథ్యంలో అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలోనే భారీ కలెక్షన్స్ వస్తాయని చిత్రబృందం ఆశాభావం వ్యక్తం చేస్తోంది. వీటితో పాటు మరోవైపు తొలిరోజు కలెక్షన్ల ద్వారా రూ.50 కోట్లు వసూళ్లు వస్తాయని ట్రేడ్ అనలిస్టులు అంచనా వేస్తున్నారు. కాగా ‘యానిమల్’ సినిమాకి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్సీ) ‘ఏ’ రేటింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: