
ట్యాగ్ · 19105 కథనాలు · పేజీ 187


టిల్లు స్క్వేర్ మూడు రోజుల్లో బ్రేక్ ఈవెన్

తంగలాన్- విక్రమ్ బర్త్ డే కి రిలీజ్ అనౌన్స్ మెంట్

50 కోట్ల క్లబ్ లో ఆడు జీవితం

యాక్షన్ సీక్వెన్స్ లో విశ్వంభర

గీతాంజలి మళ్లీ వచ్చింది.. ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్

టిల్లు స్క్వేర్ సూపర్ ఫన్ రైడ్

దసరా కాంబో బ్యాక్- బ్లాస్టింగ్ అనౌన్స్ మెంట్

ది గోట్ లైఫ్ కేరళలో అదరగొడుతుంది

ఫ్యామిలీ స్టార్ సెన్సార్ రిపోర్ట్

టాలెంటెడ్ నటుడు డానియెల్ బాలాజీ మృతి

తొలిరోజు ఓవర్సీస్‌లో దుమ్మురేపిన టిల్లు స్క్వేర్

అడివి శేష్ G2.. హీరోయిన్ బనితా సంధు ఎంట్రీ

టిల్ స్క్వేర్‌పై మెగాస్టార్ స్పెషల్ రివ్యూ
టాలీవుడ్ స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన తాజా చిత్రం ‘టిల్లు స్క్వేర్’. గతంలో ఆయన హీరోగా నటించిన ‘డీజే టిల్లు’కి సీక్వెల్‍గా రూపొందిన ఈ మూవీకి సిద్ధు జొన్నలగడ్డ కథనం, సంభాషణలు అందించగా.. మల్లిక్ రామ్ దర్శకత్వం వహించారు. అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటించగా.. మురళీధర్, ఆంథోనీ, సుజాత తదితరులు కీలక పాత్రలు పోషించారు. మార్చి 29న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ముందు నుంచీ ఊహించినట్టుగానే ఈ సినిమాకు తొలిరోజే బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. దీంతో విడుదలైన అన్ని ఏరియాల్లో ఈ మూవీ దూసుకుపోతోంది.

టిల్లు స్క్వేర్ మూడు రోజుల్లో బ్రేక్ ఈవెన్
టిల్లు స్క్వేర్ వీకెండ్ లో బాక్సాఫీస్ వద్ద దుమ్ము రేపింది.కేవలం మూడు రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా 68.1 కోట్ల గ్రాస్ వసూళ్లను సొంతం చేసుకొని సెన్సేషన్ సృష్టించింది ఇందులో షేర్ 35కోట్లు.టార్గెట్ 30కోట్లు కావడంతో ఆల్రెడీ బ్రేక్ ఈవెన్ ను క్రాస్ చేసి లాభాల్లోకి ఎంట్రీ ఇచ్చింది.ఫుల్ రన్ లో బయ్యర్లకు భారీ లాభాలను తీసుకురానుంది.అటు నైజాంలో అయితే ఎక్స్ట్రాడినరీ రన్ ను కనబరుస్తుంది.వరుసగా మూడో రోజు కూడా 4కోట్ల షేర్ ను రాబట్టింది దాంతో మూడు రోజుల్లో 12కోట్ల షేర్ ను ఖాతాలో వేసుకుంది.ఫుల్ రన్ లో 20కోట్ల మార్క్ ను చేరిన ఆశ్చర్యపోనక్కర్లేదు.

తంగలాన్- విక్రమ్ బర్త్ డే కి రిలీజ్ అనౌన్స్ మెంట్
తెలుగు, తమిళ చిత్రాల్లో ఎన్నో వైవిధ్యమైన పాత్రలు చేసి తిరుగులేని స్థానాన్ని దక్కించుకున్న విలక్షణ నటుడు చియాన్ విక్రమ్. తన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యత ఉండేలా చూసుకుంటాడు. ఇక రీసెంట్ గానే పొన్నియన్ 2 సెల్వన్ సినిమాతో బ్లాక్ బస్టర్ ను సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు మరో ప్రాజెక్ట్ తో వచ్చేస్తున్నాడు చియాన్ విక్రమ్. పా రంజిత్ దర్శకత్వంలో విక్రమ్ హీరోగా వస్తున్న సినిమా తంగలాన్.

50 కోట్ల క్లబ్ లో ఆడు జీవితం
మలయాళం స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ నుండి వచ్చిన సినిమా ఆడు జీవితం. బ్లెస్సీ దర్శకత్వంలో యధార్థ సంఘటనల ఆధారంగా ఈసినిమాను తెరకెక్కించారు మేకర్స్. 1990లో జీవనోపాధి కోసం కేరళను వదిలి విదేశాలకు వలస వెళ్లిన నజీబ్ అనే యువకుడు అక్కడ ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడు అనేది సినిమా స్టోరీ.

యాక్షన్ సీక్వెన్స్ లో విశ్వంభర
మల్లిడి వశిష్ట దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా విశ్వంభర సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇక ఈసినిమా టైటిల్ ను, కాన్సెప్ట్ వీడియోను సంక్రాంతి పండుగకు రిలీజ్ చేయగా ఆవీడియోకు ఎంత రెస్పాన్స్ వచ్చిందో చూశాం. ఈసినిమా షూటింగ్ ను ఇప్పటికే మొదలుపెట్టిన సంగతి కూడా విదితమే. కొంతవరకూ షూటింగ్ ను పూర్తి చేసుకుంది కూడా.

గీతాంజలి మళ్లీ వచ్చింది.. ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్
తెలుగు అమ్మాయి అంజలి టైటిల్ రోల్‌లో నటిస్తున్న తాజా చిత్రం 'గీతాంజలి మళ్లీ వచ్చింది'. 2014లో వచ్చిన సూపర్ హిట్ చిత్రం ‘గీతాంజలి’ సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కుతోంది. 'నిన్ను కోరి', 'నిశ్శబ్దం' చిత్రాలకు కొరియోగ్రఫీ చేసిన అట్లాంటా (యూఎస్)కు చెందిన కొరియోగ్రాఫర్ శివ తుర్లపాటి ఈ చిత్రంతో డైరెక్టర్‌గా పరిచయం అవుతున్నారు. ప్రముఖ రైటర్, ప్రొడ్యూసర్ కోన వెంకట్ సమర్పణలో ఈ సీక్వెల్‌ను ఎంవీవీ సినిమా, కోన ఫిల్మ్ కార్పొరేషన్ సంస్థలపై నిర్మాతలు ఎంవీవీ సత్యనారాయణ, జీవీ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

టిల్లు స్క్వేర్ సూపర్ ఫన్ రైడ్
సిద్దు జొన్నలగడ్డ హీరోగా, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా వచ్చిన లేటెస్ట్ సినిమా టిల్లు స్క్వేర్. ఈసినిమా బ్లాక్ బస్టర్ డీజే టిల్లు సినిమాకు సీక్వెల్ అన్న సంగతి తెలిసిందే కదా. ఎన్నో అంచనాల మధ్య మార్చి 29వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక అంచనాలకు తగ్గట్టే ఈసినిమా ఫస్ట్ షో నుండే సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకొని బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. ఈ సినిమాలోని కామెడీ, డైలాగ్స్, యాక్షన్ యూత్‌ను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. అంతేకాదు కలెక్షన్స్ పరంగా ఈసినిమా దుమ్మురేపుతుంది. మొదటిరోజే ఈసినిమా 23 కోట్లకు పైగా కలెక్ట్ చేసి అందరికీ షాకిచ్చింది. రెండు రోజుల్లో ఈసినిమా 45 కోట్లు కలెక్ట్ చేసిన…

దసరా కాంబో బ్యాక్- బ్లాస్టింగ్ అనౌన్స్ మెంట్
న్యాచురల్ స్టార్ నాని మాత్రం ఎలాంటి గ్యాప్ లేకుండా ఒక సినిమా తరువాత మరొక సినిమా చేసుకుంటూ వెళుతూనే ఉన్నాడు. గత ఏడాది దసరా, హాయ్ నాన్న సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇప్పుడు మరో సినిమాను రిలీజ్ కు సిద్దం చేస్తున్నాడు. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నాని హీరోగా రాబోతున్న సినిమా సరిపోదా శనివారం. ఈసినిమాతో ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్ తో రాబోతున్నాడు నాని. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది. ఇంకా సుజీత్ దర్శకత్వంలో, కూడా ఒక సినిమా చేస్తున్నాడు.

మంజుమ్మల్ బాయ్స్.. తెలుగు ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుంది
బాక్సాఫీస్ దగ్గర రూ. 200 కోట్లు కలెక్ట్ చేసిన మొట్టమొదటి మలయాళ సినిమాగా 'మంజుమ్మల్ బాయ్స్' చరిత్ర సృష్టించింది. ఇది యదార్థంగా గుణ కేవ్స్‌లో జరిగిన సంఘటన స్ఫూర్తితో, కొచ్చికి చెందిన కొంత మంది స్నేహితుల కథను అద్భుతంగా చూపించిన మలయాళ సర్వైవల్ థ్రిల్లర్. ఈ చిత్రానికి చిదంబరం ఎస్ పొదువల్ దర్శకత్వం వహించారు. సౌబిన్ షాహిర్, గణపతి, ఖలీద్ రెహమాన్, శ్రీనాథ్ భాసి ప్రధాన పాత్రలు పోషించారు.

గీతాంజలి మళ్లీ వచ్చింది- శంభో శంభో సాంగ్ రిలీజ్
శివ తుర్లపాటి దర్శకత్వంలో అంజలి ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా గీతాంజలి మళ్లీ వచ్చింది. ఈసినిమా అంజలి సినిమాకు సీక్వెల్ గా వస్తున్న సినిమా అన్న సంగతి తెలిసిందే కదా. ఈసినిమాపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఏప్రిల్ 11వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం అయితే ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఇప్పటికే టీజర్ ను రిలీజ్ చేయగా టీజర్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది.

ది గోట్ లైఫ్ కేరళలో అదరగొడుతుంది
గత నెల నుండి కేరళ బాక్సాఫీస్ కలెక్షన్ల తో మోత మోగిపోతుంది.అన్ సీజన్ అయినా ఫిబ్రవరి లో విడుదలైన మూడు సినిమాలు అక్కడ దుమ్ము రేపాయి.అందులో ఒకటి ఇండస్ట్రీ హిట్ గా నిలించింది. అదే మంజుమ్మల్ బాయ్స్.ఈసినిమా వచ్చే నెల 6న తెలుగు లోకి వస్తుంది.ఇక ఇప్పుడు ది గోట్ లైఫ్ కూడా కలెక్షన్ల వర్షం కురిపిస్తూ అదే ట్రెండ్ ను కంటిన్యూ చేస్తుంది.

ఫ్యామిలీ స్టార్ సెన్సార్ రిపోర్ట్
ఖుషి తరువాత విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ తో వస్తున్నాడు.ప్రస్తుతం టీం ప్రమోషన్స్ లో బిజీ గా వుంది.విజయ్- పరుశురాం కాంబినేషన్ లో ఇంతకుముందు వచ్చిన గీత గోవిందం బ్లాక్ బస్టర్ కావడంతో ఫ్యామిలీ స్టార్ పై మంచి అంచనాలు వున్నాయి.రీసెంట్ గా రిలీజైన ట్రైలర్ కూడా ఇంప్రెస్ చేసింది.ఇక ఈసినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది.ఫైట్స్ ఎక్కువగా ఉండడంతో యు/ఏ సర్టిఫికెట్ జారీ చేశారు. అయితే సినిమా బాగుందని రివ్యూ ఇచ్చారు సెన్సార్ వాళ్ళు.160నిమిషాల రన్ టైంతో ఈసినిమా థియేటర్లలో రానుంది.

లవ్ మీ మూవీ ఫస్ట్ సింగిల్ రావాలి రా ఫుల్ సాంగ్ రిలీజ్
ఆశిష్ ప్రస్తుతం లవ్ మీ అనే సినిమాలో హీరో గా నటిస్తున్న విషయం తెలిసిందే కదా. ఈ మూవీ లో బేబీ సినిమాలో హీరోయిన్ గా నటించి సూపర్ క్రేజ్ ను సంపాదించుకున్న వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... అరుణ్ భీమవరపు ఈ మూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈసినిమా ఇప్పటికే షూటింగ్ ను పూర్తిచేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఇక ఈసినిమా ఏప్రిల్ 25వ తేదీన రిలీజ్ కానున్న నేపథ్యంలో చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టింది.

సందీప్ కిషన్ వైబ్ ఫస్ట్ లుక్ రిలీజ్
యంగ్ హీరో సందీప్ కిషన్ కూడా ఒక సినిమా తరువాత మరొక సినిమా చేసుకుంటూ వెళుతున్నాడు సందీప్ కిషన్. రీసెంట్ గానే ఊరు పేరు భైరవకోన అనే సినిమాతో మంచి హిట్ ను అందుకున్నాడు సందీప్ కిషన్. ఆసినిమాతో ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న హిట్ దక్కడంతో సందీప్ కిషన్ కూడా ఫామ్ లోకి వచ్చాడు. ఇప్పుడు అదే జోష్ తో మరో సినిమాను లైన్ లో పెట్టాడు. రీసెంట్ గానే సందీప్ కిషన్ హీరోగా త్రినాథ రావు నక్కిన దర్శకత్వంలో వస్తున్న సినిమాను ప్రకటించారు. ఇది సందీప్ కిషన్ 30వ సినిమా. రాజేష్ దండా ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, బాలాజీ గుత్తా సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

టాలెంటెడ్ నటుడు డానియెల్ బాలాజీ మృతి
సినీ ఇండస్ట్రీలో ఈమధ్య యంగ్ నటీనటులు కూడా ఆకస్మాత్తుగా చనిపోవడం చూస్తున్నాం. అది కూడా గుండెపోటు మరణాలు ఎక్కువయ్యాయి. ఈమధ్యే డైరెక్టర్ సూర్య కిరణ్ మృతి చెందారు. ఆయన కూడా చిన్న వయసులో మరణించారు. ఇప్పుడు మరో టాలెంటెడ్ నటుడు మరణ వార్త తెలుగు, తమిళ్ ఇండస్ట్రీలో విషాదం నింపింది. తమిళ్ లో తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకొని తెలుగులో కూడా పలు సినిమాల్లో నటించిన డానియెల్ బాలాజీ నేడు మృతి చెందారు. బాలాజీ 48 ఏళ్ల వయసులోనే గుండెపోటుతో మృతి చెందారు. గత రాత్రి ఆయనకు ఛాతిలో నొప్పి రావడంతో ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్టు తెలుస్తుంది. దీంతో డానియెల్ బాలాజీ ఆకస్మిక మరణంతో తమిళ సినీరంగం…

టిల్లు స్క్వేర్ హావా .. డే 1 రికార్డు కలెక్షన్స్
చాలా రోజల తరువాత తెలుగు బాక్సాఫీస్ మోత మోగిపోతుంది.దానికి కారణం టిల్లు స్క్వేర్.నిన్న మంచి అంచనాలు మధ్య వచ్చిన సినిమా బ్లాక్ బాస్టర్ రివ్యూస్ తో మొదటి రోజు సెన్సేషనల్ వసూళ్లను సొంతం చేసుకుంది.నిర్మాతలు ప్రకటించిన పక్రారం నిన్న సినిమా ప్రపంచ వ్యాప్తంగా 23.70కోట్ల గ్రాస్ ను రాబట్టింది.ఇందులో షేర్ 13కోట్లపైనే.దాంతో మొదటి రోజే 40శాతం టార్గెట్ ను పూర్తి చేసింది. రేపటి తో అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

తొలిరోజు ఓవర్సీస్‌లో దుమ్మురేపిన టిల్లు స్క్వేర్
టాలీవుడ్ స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన తాజా చిత్రం ‘టిల్లు స్క్వేర్’. గతంలో ఆయన హీరోగా నటించిన ‘డీజే టిల్లు’కి సీక్వెల్‍గా ఈ మూవీకి సిద్ధు జొన్నలగడ్డ కథనం, సంభాషణలు అందించగా.. మల్లిక్ రామ్ దర్శకత్వం వహించారు. అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటించగా.. మురళీధర్, ఆంథోనీ, సుజాత తదితరులు కీలక పాత్రలు పోషించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్,ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మించారు.

రాబిన్ హుడ్ నుండి నితిన్ న్యూ పోస్టర్ రిలీజ్
యంగ్ హీరో నితిన్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్ లో పెడుతున్నాడు. నితిన్ కు కూడా హిట్ దక్కి చాలా రోజులైపోయింది. అందుకే ఒక సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. ప్రస్తుతం నితిన్ రాబిన్ హుడ్ అనే సినిమాతో బిజీగా ఉన్నాడు. భీష్మ తరువాత హీరో నితిన్, డైరెక్టర్ వెంకీ కుడుముల దర్శకత్వంలో వస్తున్న సినిమా రాబిన్ హుడ్. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను పూర్తిచేసుకుంటుంది. ఇప్పటికే ఈసినిమా నుండి గ్లింప్స్ ను రిలీజ్ చేయగా గ్లింప్స్ కు మంచి రెస్పాన్స్ దక్కింది.

అడివి శేష్ G2.. హీరోయిన్ బనితా సంధు ఎంట్రీ
టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో అడివి శేష్ ప్రధానపాత్రలో నటిస్తోన్న తాజా చిత్రం 'G2'. వినయ్ కుమార్ సిరిగినీడి దర్శకత్వం వహిస్తున్నారు. అద్భుతమైన యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ సినిమాలో బనితా సంధు హీరోయిన్‌గా నటించనున్న విషయం తెలిసిందే. కాగా ఇది బనితాకు మొదటి పాన్ ఇండియా చిత్రం కానుంది. ఇంతకుముందు ఆమె అక్టోబర్, సర్దార్ ఉదం, తమిళ చిత్రం ఆదిత్య వర్మ వంటి చిత్రాలలో నటించింది. ఈ నేపథ్యంలో గుజరాత్‌లోని భుజ్‌లో జరుగుతున్న 'G2' షూటింగ్‌లో బనితా సంధు తాజాగా జాయిన్ అయ్యింది.

లవ్ మీ ఫస్ట్ సింగిల్ రావాలి రా సాంగ్ ప్రోమో రిలీజ్
అరుణ్ భీమవరపు దర్శకత్వంలో ఆశిష్ రెడ్డి హీరోగా వస్తున్న సినిమా లవ్ మీ. రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ గా ఈసినిమా రాబోతుందని ఇప్పటికే వచ్చిన అప్ డేట్లను బట్టి అర్థమవుతుంది. ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటూనే మరోపక్క ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టారు. ఇప్పటికే టీజర్ ను కూడా రిలీజ్ చేయగా టీజర్ కు మంచి రెస్పాన్స్ దక్కి సినిమాపై అంచనాలను మరింత పెంచేసింది.