సినీ ఇండస్ట్రీలో ఈమధ్య యంగ్ నటీనటులు కూడా ఆకస్మాత్తుగా చనిపోవడం చూస్తున్నాం. అది కూడా గుండెపోటు మరణాలు ఎక్కువయ్యాయి. ఈమధ్యే డైరెక్టర్ సూర్య కిరణ్ మృతి చెందారు. ఆయన కూడా చిన్న వయసులో మరణించారు. ఇప్పుడు మరో టాలెంటెడ్ నటుడు మరణ వార్త తెలుగు, తమిళ్ ఇండస్ట్రీలో విషాదం నింపింది. తమిళ్ లో తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకొని తెలుగులో కూడా పలు సినిమాల్లో నటించిన డానియెల్ బాలాజీ నేడు మృతి చెందారు. బాలాజీ 48 ఏళ్ల వయసులోనే గుండెపోటుతో మృతి చెందారు. గత రాత్రి ఆయనకు ఛాతిలో నొప్పి రావడంతో ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్టు తెలుస్తుంది. దీంతో డానియెల్ బాలాజీ ఆకస్మిక మరణంతో తమిళ సినీరంగం విచారం వ్యక్తం చేస్తుంది. పలువురు సినీ సెలబ్రిటీలు ఆయన మృతి పట్ల స్పందిస్తూ సంతాపం తెలియచేస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
టీవి సీరియల్ ద్వారా కెరీర్ ను ప్రారంభించారు డానియెల్ బాలాజీ. చిట్టీ అనే సీరియల్ ద్వారా మంచి గుర్తింపు రావడంతో ఆ తరువాత సినిమా అవకాాశాలు తలుపుతట్టాయి. 2002 లో ఏప్రిల్ మడతిల్ అనే సినిమాతో సినీ కెరీర్ ను ప్రారంభించాడు. బాలాజీ తన కెరీర్‌లో తమిళం, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో దాదాపు 50కి పైగా సినిమాలు చేసి అలరించాడు.తెలుగులో వెంకటేష్ నటించిన ఘర్షణ, రామ్ చరణ్ నటించిన చిరుత, నాగచైతన్య నటించిన సాహసం శ్వాసగా సాగిపో, నాని నటించిన టక్ జగదీష్ వంటి సినిమాల్లో నటించి మెప్పించాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: