టాలీవుడ్ స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన తాజా చిత్రం ‘టిల్లు స్క్వేర్’. గతంలో ఆయన హీరోగా నటించిన ‘డీజే టిల్లు’కి సీక్వెల్‍గా రూపొందిన ఈ మూవీకి సిద్ధు జొన్నలగడ్డ కథనం, సంభాషణలు అందించగా.. మల్లిక్ రామ్ దర్శకత్వం వహించారు. అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటించగా.. మురళీధర్, ఆంథోనీ, సుజాత తదితరులు కీలక పాత్రలు పోషించారు. మార్చి 29న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ముందు నుంచీ ఊహించినట్టుగానే ఈ సినిమాకు తొలిరోజే బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. దీంతో విడుదలైన అన్ని ఏరియాల్లో ఈ మూవీ దూసుకుపోతోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ నేపథ్యంలో.. టిల్ స్క్వేర్ మూవీని మెగాస్టార్ చిరంజీవి వీక్షించారు. స్పెషల్ స్క్రీనింగ్ అనంతరం చిరంజీవి టిల్ స్క్వేర్ టీమ్‌ని అభినందించారు. సినిమా తనకు బాగా నచ్చిందని, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకూ హిలేరియస్‌గా ఉందని చిత్రబృందాన్ని మెచ్చుకున్నారు చిరంజీవి. ఈ సందర్భంగా హీరో సిద్దు జొన్నలగడ్డ, డైరెక్టర్ మల్లిక్ రామ్ మరియు ప్రొడ్యూసర్ నాగవంశీలకు చిరు పుష్పగుచ్చాలు అందించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇప్పటికే సినిమాకు సూపర్ హిట్ టాక్ రావడం, దీనికితోడు పోటీగా మరే ఇతర సినిమాలు లేకపోవడంతో విడుదలైన మూడు రోజుల్లో ‘టిల్లు స్క్వేర్’ బ్రేక్ ఈవెన్ సాధించడం విశేషం. మొత్తంగా మూడు రోజుల్లోనే రూ.34 కోట్ల షేర్ కలెక్షన్లతో లాభాల బాట పట్టడం గమనార్హం. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్‌లో సైతం అదిరిపోయే కలెక్షన్లతో దుమ్మురేపుతోంది. ఈ క్రమంలో తొలి మూడురోజుల్లో 1.9 మిలియన్ డాలర్లు వసూలు చేసి 2 మిలియన్ క్లబ్ దిశగా పరుగులు పెడుతోంది. కాగా టిల్ స్క్వేర్ చిత్రాన్ని శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్,ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: