అడివి శేష్‌ G2.. హీరోయిన్ బనితా సంధు ఎంట్రీ

Adivi Sesh G2 Movie Actress Banita Sandhu Joins Shoot at Gujarat

టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో అడివి శేష్ ప్రధానపాత్రలో నటిస్తోన్న తాజా చిత్రం ‘G2’. వినయ్ కుమార్ సిరిగినీడి దర్శకత్వం వహిస్తున్నారు. అద్భుతమైన యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ సినిమాలో బనితా సంధు హీరోయిన్‌గా నటించనున్న విషయం తెలిసిందే. కాగా ఇది బనితాకు మొదటి పాన్ ఇండియా చిత్రం కానుంది. ఇంతకుముందు ఆమె అక్టోబర్, సర్దార్ ఉదం, తమిళ చిత్రం ఆదిత్య వర్మ వంటి చిత్రాలలో నటించింది. ఈ నేపథ్యంలో గుజరాత్‌లోని భుజ్‌లో జరుగుతున్న ‘G2’ షూటింగ్‌లో బనితా సంధు తాజాగా జాయిన్ అయ్యింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ షెడ్యూల్‌లో అడివి శేష్, బనిత పై కీలకమైన సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. అడివి శేష్‌, బనితా సంధు తెరపై గొప్ప కెమిస్ట్రీని పంచుకోబోతున్నారు. ప్రేక్షకులకు మరపురాని అనుభూతిని అందించాలనే లక్ష్యంగా పని చేస్తున్నారు. ఇంతకుముందు ఈ చిత్రం గురించి బనిత మాట్లాడుతూ.. G2లో భాగం కావడం తనకు క్రియేటివ్‍గా గొప్ప ఆనందాన్ని కలిగించిందని చెప్పారు. ఇకఈ సినిమాలో ఆమె పాత్ర ఇంతకు ముందు చేయని విధంగా చాలా కొత్తగా కనిపిస్తుందని చిత్ర యూనిట్ తెలిపింది.

కాగా జి2లో బాలీవుడ్ స్టార్ యాక్టర్ ఇమ్రాన్ హష్మీ కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. స్టైలిష్ విలన్‌గా ఆయన కనిపించనున్నారు. 2018లో వచ్చిన గూఢచారి చిత్రానికి హై-ఆక్టేన్ యాక్షన్ సీక్వెల్‌గా ఆరేళ్ల తర్వాత మళ్లీ సెల్యులాయిడ్‌లోకి వస్తోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై టిజి విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ కలిసి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five + six =