ఖుషి తరువాత విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ తో వస్తున్నాడు.ప్రస్తుతం టీం ప్రమోషన్స్ లో బిజీ గా వుంది.విజయ్- పరుశురాం కాంబినేషన్ లో ఇంతకుముందు వచ్చిన గీత గోవిందం బ్లాక్ బస్టర్ కావడంతో ఫ్యామిలీ స్టార్ పై మంచి అంచనాలు వున్నాయి.రీసెంట్ గా రిలీజైన ట్రైలర్ కూడా ఇంప్రెస్ చేసింది.ఇక ఈసినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది.ఫైట్స్ ఎక్కువగా ఉండడంతో యు/ఏ సర్టిఫికెట్ జారీ చేశారు. అయితే సినిమా బాగుందని రివ్యూ ఇచ్చారు సెన్సార్ వాళ్ళు.160నిమిషాల రన్ టైంతో ఈసినిమా థియేటర్లలో రానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
తెలుగు తోపాటు తమిళం ఏప్రిల్ 5న విడుదలవుతుంది.రెండు వారాల గ్యాప్ తరువాత హిందీ,మలయాళంలో విడుదలకానుంది.విజయ్ లాస్ట్ మూవీ ఖుషి తమిళంలో హిట్ అనిపించుకుంది దాంతో ఫ్యామిలీ స్టార్ ను అక్కడ 250థియేటర్లో రిలీజ్ చేస్తున్నారు.
ఈసినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించగా గోపీ సుందర్ సంగీతం అందించాడు.దిల్ రాజు నిర్మించారు.ఇక విజయ్ చాలా రోజుల నుండి బ్లాక్ బాస్టర్ హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు.మరి ఫ్యామిలీ స్టార్ ఆ విజయాన్ని ఇస్తుందో చూడాలి.పండగ సెలవులు కూడా సినిమాకు కలిసి రానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























