రాబిన్ హుడ్ నుండి నితిన్ న్యూ పోస్టర్ రిలీజ్

nithiin interesting poster released from robinhood movie

యంగ్ హీరో నితిన్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్ లో పెడుతున్నాడు. నితిన్ కు కూడా హిట్ దక్కి చాలా రోజులైపోయింది. అందుకే ఒక సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. ప్రస్తుతం నితిన్ రాబిన్ హుడ్ అనే సినిమాతో బిజీగా ఉన్నాడు. భీష్మ తరువాత హీరో నితిన్, డైరెక్టర్ వెంకీ కుడుముల దర్శకత్వంలో వస్తున్న సినిమా రాబిన్ హుడ్. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను పూర్తిచేసుకుంటుంది. ఇప్పటికే ఈసినిమా నుండి గ్లింప్స్ ను రిలీజ్ చేయగా గ్లింప్స్ కు మంచి రెస్పాన్స్ దక్కింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక నేడు నితిన్ పుట్టిన రోజు సందర్భంగా తన సినిమాల నుండి అప్ డేట్లు ఇస్తున్నారు మేకర్స్. దీనిలో భాగంగానే తాజాగా ఈసినిమా నుండి కొత్త పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఏజెంట్ గెటప్ లో ఉన్న నితిన్ లుక్ అయితే ఆకట్టుకుంటుంది.

కాగా నట కిరీటి రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్ ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈసినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మిస్తున్నారు. జీవీ ప్రకాష్ సంగీతం అందిస్తున్నాడు. సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీని అందిస్తుండగా, ప్రవీణ్ పూడి ఎడిటర్ గా, రామ్ కుమార్ ఆర్ట్ డైరెక్టర్ గా పని చేస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

11 + thirteen =