లవ్ మీ ఫస్ట్ సింగిల్ రావాలి రా సాంగ్ ప్రోమో రిలీజ్

ashish love me movie first single raavaali raa song promo out

అరుణ్ భీమవరపు దర్శకత్వంలో ఆశిష్ రెడ్డి హీరోగా వస్తున్న సినిమా లవ్ మీ. రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ గా ఈసినిమా రాబోతుందని ఇప్పటికే వచ్చిన అప్ డేట్లను బట్టి అర్థమవుతుంది. ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటూనే మరోపక్క ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టారు. ఇప్పటికే టీజర్ ను కూడా రిలీజ్ చేయగా టీజర్ కు మంచి రెస్పాన్స్ దక్కి సినిమాపై అంచనాలను మరింత పెంచేసింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమా నుండి ఫస్ట్ సింగిల్ రావాలి రా అనే పాటను రిలీజ్ చేయనున్నట్టు ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. ఈనేపథ్యంలోనే తాజాగా ఈ పాట ప్రోమోను రిలీజ్ చేశారు మేకర్స్. ప్రోమో అయితే ఆకట్టుకుంటుంది. ఇక ఈపాటకు చంద్రబోస్ లిరిక్స్ అందించగా.. అమల చేబోలు, గోమతి అయ్యర్, అదితి భవరాజు, అజ్మల్ ఫాతిమా ప్రవీణ్, సాయి శ్రేయ పాటను ఆలపించారు. ఫుల్ సాంగ్ ను నేడు రిలీజ్ చేయనున్నారు.

కాగా బేబి ఫేమ్ వైష్ణవి చైతన్య ఈసినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఈసినిమాను దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ పై హన్షిత రెడ్డి నిర్మిస్తున్నారు. ఎం. ఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా లెజెండరీ కెమెరామెన్ పీసీ శ్రీరాం సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు. అలాగే కొల్లా అవినాష్ ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

thirteen − five =