సందీప్ కిషన్ వైబ్ ఫస్ట్ లుక్ రిలీజ్

sundeep kishan vibe movie first look out now

యంగ్ హీరో సందీప్ కిషన్ కూడా ఒక సినిమా తరువాత మరొక సినిమా చేసుకుంటూ వెళుతున్నాడు సందీప్ కిషన్. రీసెంట్ గానే ఊరు పేరు భైరవకోన అనే సినిమాతో మంచి హిట్ ను అందుకున్నాడు సందీప్ కిషన్. ఆసినిమాతో ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న హిట్ దక్కడంతో సందీప్ కిషన్ కూడా ఫామ్ లోకి వచ్చాడు. ఇప్పుడు అదే జోష్ తో మరో సినిమాను లైన్ లో పెట్టాడు. రీసెంట్ గానే సందీప్ కిషన్ హీరోగా త్రినాథ రావు నక్కిన దర్శకత్వంలో వస్తున్న సినిమాను ప్రకటించారు. ఇది సందీప్ కిషన్ 30వ సినిమా. రాజేష్ దండా ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, బాలాజీ గుత్తా సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈసినిమాతో పాటు ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ, మిషన్ ఇంపాసిబుల్ లాంటి సూప‌ర్ హిట్ సినిమాలు తీసిన స్వరుప్ ఆర్ఎస్‌జే ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేయ‌బోతున్నాడు.ఇక తాజాగా ఈసినిమా నుండి ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు మేకర్స్. అంతేకాదు మనం చాలా మందిని కలుస్తాము, కొంతమందిని ,మర్చిపోతాం, కొంతమందిని గుర్తుంచుకుంటాం, కొంతమంది కోసం మాత్రమే పోరాడతాం. కొంతమంది స్నేహితులు మాత్రం నీ కోసం ఫైట్ చేయడానికి రెడీగా ఉంటారు అంటూ పోస్ట్ లో పేర్కొన్నారు. దీంతో ఈసినిమా ఫ్రెండ్షిప్ నేపథ్యంలో వస్తున్నట్టు అర్థమవుతుంది.

కాగా ఈసినిమాను స్వధర్మ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై రాహుల్ యాద‌వ్ న‌క్కా నిర్మిస్తున్నారు. అంతేకాదు త్వరలోనే షూటింగ్ ను మొదలుపెట్టి వచ్చే ఏడాది రిలీజ్ చేయనున్నట్టు తెలిపారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 + 18 =