టిల్లు స్క్వేర్ హావా .. డే 1 రికార్డు కలెక్షన్స్ 

tillu square day 1 ww collections

చాలా రోజల తరువాత తెలుగు బాక్సాఫీస్ మోత మోగిపోతుంది.దానికి కారణం టిల్లు స్క్వేర్.నిన్న మంచి అంచనాలు మధ్య వచ్చిన సినిమా బ్లాక్ బాస్టర్ రివ్యూస్ తో మొదటి రోజు సెన్సేషనల్ వసూళ్లను సొంతం చేసుకుంది.నిర్మాతలు ప్రకటించిన పక్రారం నిన్న సినిమా ప్రపంచ వ్యాప్తంగా 23.70కోట్ల గ్రాస్ ను రాబట్టింది.ఇందులో షేర్ 13కోట్లపైనే.దాంతో మొదటి రోజే  40శాతం టార్గెట్ ను పూర్తి చేసింది. రేపటి తో  అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ముఖ్యంగా నైజాం,యూఎస్ లో టిల్లు స్క్వేర్ అదరగొడుతుంది.నైజాంలో మొదటి రోజు 4.35కోట్ల షేర్ ను రాబట్టి అదుర్స్ అనిపించింది.ఫుల్ రన్ లో ఈ ఏరియాలో భారీ లాభాలను తీసుకురానుంది.ఇక నార్త్ అమెరికాలో ఈసినిమా సంచలనం సృష్టిస్తుంది.ఇప్పటివరకు అక్కడ 1.2మిలియన్ వసూళ్లను రాబట్టుకుంది.రేపటి తో 2మిలియన్ మార్క్ ను చేరుకోనుంది.అతి తక్కువ రోజుల్లో ఈ ఫీట్ సాధించిన మీడియం బడ్జెట్ సినిమాగా టిల్లు స్క్వేర్ రికార్డు సృష్టించనుంది.

ఓవరాల్ గా ఈసినిమా మొదటి రోజు ఊహించినదానికంటే ఎక్కవ వసూళ్లను రాబట్టుకొని షాక్ ఇచ్చింది. ఇదే ఊపు కొనసాగిస్తే ఫుల్ రన్ లో 100కోట్ల క్లబ్ లో చేరడం ఖాయం.డీజే టిల్లు సీక్వెల్ గా వచ్చిన ఈసినిమా రెండు రోజుల్లోనే ఫస్ట్ పార్ట్  లైఫ్ టైం కలెక్షన్స్ ను బ్రేక్ చేయనుంది.ఫుల్ రన్ లో టిల్లు స్క్వేర్ మరిన్ని రికార్డులను ఖాతాలో వేసుకోనుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eleven + 20 =