
ట్యాగ్ · 19105 కథనాలు · పేజీ 178


దేశరాజధానిలో థగ్ లైఫ్ కొత్త షెడ్యూల్

విశ్వంభర ఒక్క యాక్షన్ సీక్వెన్స్-26 రోజులు

ప్రభాస్ గొప్ప మనసు.. టీఎఫ్‌డీఏకు భారీ విరాళం

తలైవా 171 టైటిల్ రిలీజ్

అల్లరి నరేష్ ఆ ఒక్కటీ అడక్కు ట్రైలర్ రిలీజ్

కాజల్ అగర్వాల్ సత్యభామ రిలీజ్ డేట్ ఫిక్స్

100 రోజులు పూర్తి చేసుకున్న హనుమాన్

మళ్లీ షూటింగ్ షురూ చేసిన మనోజ్

కల్కి2898AD- ఈ సినిమాకోసం వెయిట్ చేయలేను

తెలుగు వాళ్ళు హాస్యం అద్భుతంగా చేయగలరు

ప్రియదర్శి నా మొదటి హీరో - ప్రశాంత్ వర్మ

100 కోట్ల దిశగా ఆవేశం

సుధీర్ బాబు హరోంహర షూటింగ్ పూర్తి

హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలిపిన మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్
దేశవ్యాప్తంగా మంగళవారం (ఏప్రిల్ 23, 2024) హనుమంతుడి జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. అంజనీ పుత్రుడి ఆశీస్సులు అందుకునేందుకు భక్త జనం ఆలయాలకు బారులుతీరుతున్నారు. ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకుని ఈ సందర్భంగా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ప్రజలకు, భక్తులకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

దేశరాజధానిలో థగ్ లైఫ్ కొత్త షెడ్యూల్
లెజెండ్ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో విలక్షణ నటుడు కమల్ హాసన్ హీరోగా ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. అప్పట్లో వీరిద్దరి కాంబినేషన్ వచ్చిన నాయకుడు సినిమా ఎన్ని సంచలనాలు సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఆ తరువాత మళ్లీ ఇన్నేళ్లకు ఈ కాంబినేషన్ రిపీట్ అవుతుండటంతో సినిమాపై ఇప్పటినుండే అంచనాలు పెరిగిపోయాయి. థగ్ లైఫ్ అనే టైటిల్ తో ఈసినిమా వస్తుంది.

విశ్వంభర ఒక్క యాక్షన్ సీక్వెన్స్-26 రోజులు
మెగాస్టార్ చిరంజీవి కూడా ఒక సినిమా తరువాత మరొక సినిమాను చేసుకుంటూ వెళుతున్నారు. గత ఏడాది వాల్తేరు వీరయ్య, భోళా శంకర్ సినిమాలు రిలీజ్ చేయగా అందులో భోళా శంకర్ బ్లాక్ బస్టర్ ను అందించగా.. భోళా శంకర్ పరాజయాన్ని అందుకుంది. ఇక ఇప్పుడు మరో సినిమాతో బిజీ అయిపోయారు. బింబిసార సినిమాతో మంచి క్రేజ్ ను సొంతం చేసుకున్న మల్లిడి వశిష్ట దర్శకత్వంలో చిరు హీరోగా విశ్వంభర సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇక ఈసినిమా టైటిల్ ను, కాన్సెప్ట్ వీడియోను సంక్రాంతి పండుగకు రిలీజ్ చేయగా ఆవీడియోకు ఎంత రెస్పాన్స్ వచ్చిందో చూశాం.

ప్రభాస్ గొప్ప మనసు.. టీఎఫ్‌డీఏకు భారీ విరాళం
పాన్ ఇండియా రెబెల్ స్టార్ ప్రభాస్ రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లోనూ హీరోనే అని ఎన్నోసార్లు ప్రూవ్ చేసుకున్నారు. తెలుగు రాష్ట్రాలలో ఏదయినా ఆపత్కాలంలో బాధితులకు సాయమందించేందుకు ఆయన ఎల్లప్పుడూ ముందుంటారన్న విషయం తెలిసిందే. తాజాగా మరోసారి ప్రభాస్ తన గొప్ప మనసు చాటుకున్నారు. ఈ మేరకు ఆయన తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్ (టీఎఫ్‌డీఏ)కు భారీ విరాళం అందించారు.

ప్రసన్నవదనం.. మైత్రీ చేతికి తెలంగాణ, తమిళనాడు రిలీజ్ రైట్స్
టాలీవుడ్‌లో ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా వచ్చి తన ప్రతిభతో క్యారక్టర్ ఆర్టిస్ట్ స్థాయి నుంచి హీరో స్టార్‌డమ్ సొంతం చేసుకున్నవారు అతి తక్కువమంది ఉంటారు. అలాంటివారిలో సుహాస్ ఒకడు. కెరీర్ ప్రారంభంలో చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ సినిమాల్లో అవకాశం దక్కించుకున్నాడు. ఈ క్రమంలో ఒకవైపు కమెడియన్‌గా, విలన్‌గా నటిస్తూనే.. తొలిసారిగా 'కలర్ ఫోటో' అనే సినిమా ద్వారా హీరోగా పరిచయమయ్యాడు. ఆ తరువాత వరుసగా.. 'రైటర్ పద్మభూషణ్', 'అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్' చిత్రాలతో హ్యాట్రిక్ హిట్స్ అందుకుకున్నాడు.

తలైవా 171 టైటిల్ రిలీజ్
తలైవా రజనీకాంత్ ఈ వయసులో కూడా ఎక్కడా తగ్గకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ప్రస్తుతం రజనీకాంత్ జ్ఞానవేల్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. వెట్టైయాన్ అనే టైటిల్ తో ఈసినిమా వస్తుంది. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను పూర్తిచేసుకుంటుంది. కాగా మంజు వారియర్, రితికా సింగ్ కూడా ఈసినిమాలో నటిస్తున్నారు. అమితాబ్ ఇంకా రానా కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తుండగా.. అనిరుథ్ ఈసినిమాకు సంగీతం అందిస్తున్నాడు.

అల్లరి నరేష్ ఆ ఒక్కటీ అడక్కు ట్రైలర్ రిలీజ్
కామెడీ సినిమాలతో ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు అల్లరి నరేష్. ఇక ఈమధ్య కాస్త రూట్ మార్చి సీరియస్ సినిమాలు తీసినా ఇప్పుడు మళ్లీ తనకు అచ్చొచ్చిన కామెడీ జానర్ లోకి వచ్చేశాడు. మల్లి అంకం దర్శకత్వంలో అల్లరి నరేష్ హీరోగా వస్తున్న సినిమా ఆ ఒక్కటీ అడక్కు. కామెడీ ఎంటర్ టైనర్ గా ఈసినిమా రూపొందుతుంది. ఈసినిమా మే 3వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో చిత్రయూనిట్ ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది.

ఆడు జీవితం- 25 రోజుల్లో 150 కోట్లు
మలయాళం సినిమాలు కూడా ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా తమ సత్తాను చాటుతున్నాయి. దానికి కారణం డిఫరెంట్ కాన్సెప్ట్ లతో సినిమాలు రావడమే అందుకు కారణం. ఇక రీసెంట్ గా మరో సినిమా బాక్సాఫీస్ వద్ద సాలిడ్ కలెక్షన్స్ ను రాబట్టుకుంటూ దూసుకుపోతుంది. ఆ సినిమా మరేదో కాదు మలయాళం స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ హీరోగా వచ్చిన ఆడు జీవితం సినిమా. బ్లెస్సీ దర్శకత్వంలో యధార్థ సంఘటనల ఆధారంగా ఈసినిమా వచ్చింది. 1990లో జీవనోపాధి కోసం కేరళను వదిలి విదేశాలకు వలస వెళ్లిన నజీబ్ అనే యువకుడు అక్కడ ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడు అనేది సినిమా స్టోరీ.

కాజల్ అగర్వాల్ సత్యభామ రిలీజ్ డేట్ ఫిక్స్
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ చాలాకాలం గ్యాప్ తర్వాత గతేడాది 'భగవంత్ కేసరి' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా కోసం ఆమె తొలిసారిగా గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణతో జోడీకట్టింది. దసరా పండుగ సందర్భంగా థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ అనిపించుకుంది. ఆ సినిమా ఇచ్చిన సక్సెస్‌తో ఫుల్ జోష్‌లో ఉన్న ఆమె ప్రస్తుతం 'సత్యభామ' అనే ఒక లేడీ ఓరియెంటెడ్ మూవీలో నటిస్తోంది.

సప్త సాగరాలు దాటి సైడ్-బి.. ఓటీటీలోకి వచ్చేసిన హిందీ వెర్షన్
ఈమధ్య కన్నడ సినిమాలు కూడా మంచి ఆదరణను సొంతం చేసుకుంటున్నాయి. అందుకే ఈమధ్య కన్నడ సినిమాలను కూడా తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. ఇక ఈనేపథ్యంలో గత ఏడాది రిలీజ్ అయి ప్రేక్షకులను ఎంతగానే ఆకట్టుకున్న సినిమా సప్త సాగరాలు దాటి పార్ట్ 1 అండ్ పార్ట్2. కన్నడలో సూపర్ హిట్ అవ్వడంతో ఈ సినిమాలను ఇక్కడ కూడా రిలీజ్ చేయగా ఇక్కడా కూడా సూపర్ హిట్ అయ్యాయి.

100 రోజులు పూర్తి చేసుకున్న హనుమాన్
టాలీవుడ్ యంగ్ అండ్ క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన విజువల్ వండర్ 'హనుమాన్'. యువ నటుడు తేజ సజ్జా హీరోగా నటించగా శ్రీమతి చైతన్య సమర్పణలో ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌పై కె నిరంజన్ రెడ్డి నిర్మించారు. సంక్రాంతి కానుకగా ఈ ఏడాది జనవరి 12న విడుదలై ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. పండుగ బరిలో పలు స్టార్ హీరోల చిత్రాల మధ్య చిన్న సినిమాగా విడుదలై అనూహ్యంగా సూపర్ సక్సెస్ అందుకుంది. మెగాస్టార్ చిరంజీవి సహా పలువురు సినీ ప్రముఖులు ఈ సినిమా చూసి ప్రశంసలు కురిపించారు.

మళ్లీ షూటింగ్ షురూ చేసిన మనోజ్
మంచు వారసత్వంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన హీరో మనోజ్. కెరీర్ మొదట్లో వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్లిన ఈమధ్య సినిమాలకు దూరమయ్యాడు. ఇప్పుడు చాలా గ్యాప్ తరువాత కొత్త సినిమాతో రావడానికి సిద్దమవుతున్నాడు. వరుణ్ కోరుకొండ దర్శకత్వంలో మనోజ్ హీరోగా వస్తున్న సినిమా వాట్ ద ఫిష్. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఈసినిమాను ఎప్పుడో స్టార్ట్ చేశారు. ఇప్పటికే పలు పోస్టర్లు అలానే గ్లింప్స్ ను కూడా రిలీజ్ చేశారు.

గీతాంజలి మళ్ళీ వచ్చింది.. 11 డేస్ కలెక్షన్స్
తెలుగు అమ్మాయి అంజలి టైటిల్ రోల్‌లో నటించిన లేటెస్ట్ మూవీ 'గీతాంజలి మళ్లీ వచ్చింది'. 2014లో వచ్చిన సూపర్ హిట్ చిత్రం ‘గీతాంజలి’ సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కింది. 'ప్రతీకార జ్వాలతో మళ్లీ వచ్చేస్తోంది గీతాంజలి' అంటూ వస్తోన్న ఈ మూవీ అంజలి నటించిన 50వ సినిమా కావడం విశేషం. 'నిన్ను కోరి', 'నిశ్శబ్దం' చిత్రాలకు కొరియోగ్రాఫర్‌గా పనిచేసిన శివ తుర్లపాటి ఈ చిత్రంతో డైరెక్టర్‌గా పరిచయం అయ్యారు.

కల్కి 2898 ఏడీ.. సర్‌ప్రైజింగ్ రోల్‌లో అమితాబ్ బచ్చన్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ 'కల్కి 2898 ఏడీ'. సైన్స్ ఫిక్షన్ డిస్టోపియన్ గా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి 'మహానటి' ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో ప్రభాస్ సరసన బాలీవుడ్ భామ దీపికా పదుకొణే కథానాయికగా నటిస్తోంది. ఇప్పటివరకు ఇండియన్ స్క్రీన్ పై రానటువంటి కథతో ఇది రూపొందుతోందని మేకర్స్ ఇదివరకే స్పష్టం చేశారు. దీంతో దేశవ్యాప్తంగా ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరోవైపు ఈ సినిమాకి సంబంధించిన సమాచారం కోసం డార్లింగ్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

కల్కి2898AD- ఈ సినిమాకోసం వెయిట్ చేయలేను
సలార్ తో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నాడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్. ఇప్పుడు తన నుండి వస్తున్న మోస్ట్ అవైటెడ్ సినిమా కల్కి 2898ఏడి. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో ఈసినిమా రాబోతుంది. ఈసినిమా పై అంచనాలన ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ పూర్తి చేసుకుంటూనే మరోపక్క పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా ముగించుకుంటుంది. ఇప్పటికే ఈసినిమా నుండి పలు వీడియోలు పోస్టర్లు రిలీజ్ చేయగా అన్నీ సినిమాపై అంచనాలను మరింత పెంచేశాయి.

తెలుగు వాళ్ళు హాస్యం అద్భుతంగా చేయగలరు
పాన్ ఇండియా సెన్సేషనల్ బ్లాక్‌బస్టర్ హను-మాన్‌ని అందించిన ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మాత నిరంజన్ రెడ్డి, శ్రీమతి చైతన్య సమర్పణలో తన తదుపరి సినిమాని అనౌన్స్ చేశారు. 'బలగం', 'ఓం భీమ్ బుష్', 'సేవ్ ది టైగర్స్' సిరీస్‌ల విజయాలతో దూసుకుపోతున్న ప్రియదర్శి ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. 'ఇస్మార్ట్ శంకర్' ఫేమ్ నభా నటేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. రొమ్-కామ్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రానికి అశ్విన్ రామ్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి 'డార్లింగ్' అనే టైటిల్‌ను మేకర్స్ అనౌన్స్ చేశారు. 'వై దిస్ కొలవెరి' అనే ఆసక్తికరమైన ట్యాగ్‌లైన్ పెట్టారు.

ప్రభాస్ గారిని ప్రేమతో పిలుచుకునే టైటిల్ పెట్టడానికి కారణం
పాన్ ఇండియా సెన్సేషనల్ బ్లాక్‌బస్టర్ హను-మాన్‌ని అందించిన ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మాత నిరంజన్ రెడ్డి, శ్రీమతి చైతన్య సమర్పణలో తన తదుపరి సినిమాని అనౌన్స్ చేశారు. 'బలగం', 'ఓం భీమ్ బుష్', 'సేవ్ ది టైగర్స్' సిరీస్‌ల విజయాలతో దూసుకుపోతున్న ప్రియదర్శి ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. 'ఇస్మార్ట్ శంకర్' ఫేమ్ నభా నటేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. రొమ్-కామ్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రానికి అశ్విన్ రామ్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి 'డార్లింగ్' అనే టైటిల్‌ను మేకర్స్ అనౌన్స్ చేశారు. 'వై దిస్ కొలవెరి' అనే ఆసక్తికరమైన ట్యాగ్‌లైన్ పెట్టారు.

ప్రియదర్శి నా మొదటి హీరో - ప్రశాంత్ వర్మ
పాన్ ఇండియా సెన్సేషనల్ బ్లాక్‌బస్టర్ హను-మాన్‌ని అందించిన ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మాత నిరంజన్ రెడ్డి, శ్రీమతి చైతన్య సమర్పణలో తన తదుపరి సినిమాని అనౌన్స్ చేశారు. 'బలగం', 'ఓం భీమ్ బుష్', 'సేవ్ ది టైగర్స్' సిరీస్‌ల విజయాలతో దూసుకుపోతున్న ప్రియదర్శి ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. 'ఇస్మార్ట్ శంకర్' ఫేమ్ నభా నటేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. రొమ్-కామ్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రానికి అశ్విన్ రామ్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి 'డార్లింగ్' అనే టైటిల్‌ను మేకర్స్ అనౌన్స్ చేశారు. 'వై దిస్ కొలవెరి' అనే ఆసక్తికరమైన ట్యాగ్‌లైన్ పెట్టారు.

100 కోట్ల దిశగా ఆవేశం
ఈఏడాది మళయాలం ఇండస్ట్రీ పీక్ సక్సెస్ ను చూస్తుంది.రీసెంట్ గా విడుదలవుతున్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తున్నాయి.ఫిబ్రవరి నుండి మొదలైన జైత్రయాత్ర వరుసగా మూడో నెల కూడా కొనసాగుతుంది.రెండు నెలల కిందట వచ్చిన మంజుమ్మల్ బాయ్స్ ,ప్రేమలు, భ్రమయుగం అద్భుతమైన వసూళ్లను రాబట్టుకున్నాయి. ఇందులో మంజుమ్మల్ బాయ్స్ అయితే 200కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ప్రేమలు అయితే 100కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి సెన్సేషన్ సృష్టించింది.

సుధీర్ బాబు హరోంహర షూటింగ్ పూర్తి
టాలీవుడ్ టాలెంటెడ్ హీరో సుధీర్ బాబు హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘హరోంహర’. ‘ది రివోల్ట్’ అనేది ఉపశీర్షిక. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీకి జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వం వహిస్తున్నారు. సుమంత్ జి.నాయుడు నిర్మిస్తున్న ఈ సినిమాలో సుధీర్ బాబు సరసన మాళవికా శర్మ కథానాయికగా నటిస్తుంది. అరవింద్ విశ్వనాథన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఇక ఇప్పటికే ఈసినిమా నుంచి విడుదలైన టీజర్ సహా పాటలు సినీ ప్రియులను అలరించాయి.