తెలుగు వాళ్ళు హాస్యం అద్భుతంగా చేయగలరు

Darling Title Launch Event: Director Mohana Krishna Indraganti Praises Priyadarshi

పాన్ ఇండియా సెన్సేషనల్ బ్లాక్‌బస్టర్ హను-మాన్‌ని అందించిన ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌ నిర్మాత నిరంజన్ రెడ్డి, శ్రీమతి చైతన్య సమర్పణలో తన తదుపరి సినిమాని అనౌన్స్ చేశారు. ‘బలగం’, ‘ఓం భీమ్ బుష్’, ‘సేవ్ ది టైగర్స్’ సిరీస్‌ల విజయాలతో దూసుకుపోతున్న ప్రియదర్శి ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. ‘ఇస్మార్ట్ శంకర్’ ఫేమ్ నభా నటేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. రొమ్-కామ్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రానికి అశ్విన్ రామ్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి ‘డార్లింగ్’ అనే టైటిల్‌ను మేకర్స్ అనౌన్స్ చేశారు. ‘వై దిస్ కొలవెరి’ అనే ఆసక్తికరమైన ట్యాగ్‌లైన్‌ పెట్టారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

పలువురు ప్రముఖ నటీనటులు నటిస్తున్న ఈ సినిమాలో అనన్య నాగళ్ల కీలక పాత్ర పోషిస్తోంది. ప్రతిభావంతులైన సాంకేతిక నిపుణులఈ చిత్రానికి పని చేస్తున్నారు. నరేష్ డీవోపీ కాగా, వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నారు. అలాగే హేమంత్ డైలాగ్స్ రాయగా, లవ్ టుడే ప్రదీప్ రాఘవ్ ఈ చిత్రానికి ఎడిటర్‌గా, గాంధీ ప్రొడక్షన్ డిజైనర్‌గా పనిచేస్తున్నారు. ఇక ఈ సినిమా టైటిల్ లాంచ్ ఈవెంట్ లో ‘హనుమాన్’ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ మరియు క్రియేటివ్ డైరెక్టర్ ఇంద్రగంటి మోహన్ కృష్ణ ముఖ్య అతిథులుగా విచ్చేసారు.

ఈ సందర్భంగా దర్శకుడు ఇంద్రగంటి మోహన్ కృష్ణ మాట్లాడుతూ.. డార్లింగ్ గ్లింప్స్ చాలా ఆహ్లాదకరంగా వుంది. ఈ మధ్య హాస్యంతో వస్తున్న సినిమాలు బాగా నడుస్తున్నాయి. నిజానికి హాస్యంతో కూడిన సినిమాలు చేయడం చాలా కష్టం. తెలుగు వాళ్ళు హాస్యంను అద్భుతంగా చేయగలరు. ఇప్పుడు మళ్ళీ హాస్యంతో కూడుకున్న సినిమాల ట్రెండ్ మళ్ళీ మొదలైయిందని అనుకుంటున్నాను. దర్శితో చేయబోతున్న సినిమా కూడా హాస్య ప్రధానమైనదే. దర్శకుడు అశ్విన్ కి టీం అందరికీ ఆల్ ది బెస్ట్. టీజర్ చాలా ప్రామెసింగ్ గా వుంది. ఇలాంటి సినిమాలు ఇంకా రావాలి. ఇది అందరికీ కనెక్ట్ అవుతుందని నమ్ముతున్నాను” అని అన్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.