
ట్యాగ్ · 19105 కథనాలు · పేజీ 166


లవ్ మీ- మా సినిమాకు ఆ సినిమాతో పోలిక లేదు

స్వాగ్ ఎగ్జైటింగ్ అప్ డేట్లు ఆన్ ది వే

సత్యభామ కోసం రానున్న భగవంత్ కేసరి

గూఢచారి2- అందుకే డైరెక్టర్ ను మార్చాం

తండేల్.. నాగచైతన్య న్యూ స్టిల్ వైరల్

పుష్ప 2.. సెకండ్ సింగిల్ అప్డేట్

లవ్ మీ సెన్సార్ పూర్తి, విడుదలకు సిద్ధం

60 ఏళ్లు పూర్తి చేసుకున్న సురేష్ ప్రొడక్షన్స్

కల్కి 2898ఏడీ-భైరవ, బుజ్జీ మీట్ కు వేదిక ఫిక్స్

విశ్వంభర షూటింగ్ అప్డేట్

భజే వాయు వేగం- త్వరలో ట్రైలర్ రిలీజ్ అనౌన్స్ మెంట్

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన కీరవాణి, అందెశ్రీ

రెండు నెలల్లో రెండు బ్లాక్ బాస్టర్ లు ఇచ్చిన స్టార్ హీరో
రెండు నెలల గ్యాప్ రెండు బ్లాక్ బాస్టర్లను ఇచ్చాడు మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్. తను హీరోగా నటించిన ఆడు జీవితం మార్చి చివర్లో వచ్చి దాదాపు 150కోట్లకు పైగా వసూళ్లను సాధించి సెకండ్ హైయెస్ట్ మాలీవుడ్ గ్రాసర్ గా రికార్డు సృష్టించింది. ఇక ఇప్పుడు తను కీలక పాత్రలో నటించిన గురువాయూర్ అంబలనాడయిల్ అనే సినిమా కూడా అదరగొడుతుంది. గత వారంలో ప్రేక్షకులముందుకు వచ్చిన ఈసినిమా నిన్నటి తో ప్రపంచ వ్యాప్తంగా 50కోట్ల గ్రాస్ మార్క్ ను క్రాస్ చేసి బ్లాక్ బాస్టర్ అనిపించుకుంది.

ఇండియన్ 2 ఫస్ట్ సింగిల్ పారా ఫుల్ సాంగ్ రిలీజ్
లోక నాయకుడు కమల్ హాసన్ హీరోగా లెజెండరీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఈసినిమా ఇండియన్2. ఈసినిమా కోసం ఎప్పటినుండో వెయిట్ చేస్తున్నారు కమల్ హాసన్ ఫ్యాన్స్ తో పాటు సినీ లవర్స్ అందరూ. ఎప్పుడో ఈసినిమా సెట్స్ పైకి వెళ్లినా మధ్యలో పలు సమస్యలు తలెత్తడంతో ఆలస్యమైంది. ఫైనల్ గా అయితే సినిమా రిలీజ్ కు సిద్దమవుతుంది. రీసెంట్ గానే ఫైనల్ గా ఈసినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించారు. ఫైనల్ గా జులై 12వ తేదీన ఈసినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

లవ్ మీ- మా సినిమాకు ఆ సినిమాతో పోలిక లేదు
అరుణ్ భీమవరపు దర్శకత్వంలో యంగ్ హీరో ఆశిష్, బేబి ఫేమ్ వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటిస్తున్న సినిమా లవ్ మీ. హార్రర్ లవ్ స్టోరీ గా వస్తున్న ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే రిలీజ్ చేసిన అప్ డేట్లు అన్నీ సినిమాపై ఆ అంచనాలను మరింత పెంచేశాయి. టీజర్, ట్రైలర్, పాటలు అన్నీ మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయి.

స్వాగ్ ఎగ్జైటింగ్ అప్ డేట్లు ఆన్ ది వే
డిఫరెంట్ సినిమాలు తీయడంలో శ్రీ విష్ణు ఎప్పుడూ ముందుంటాడు. గత ఏడాది సామజవరగమన సినిమాతో సూపర్ హిట్ అందుకున్న శ్రీవిష్ణు.. ఈ ఏడాది ఓం భీమ్ బుష్ సినిమాతో సెకండా హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక బ్యాక్ టు బ్యాక్ హిట్లను ను అందుకున్న శ్రీ విష్ణు ఇప్పుడు అదే జోష్ తో మరో సినిమాతో వచ్చేస్తున్నాడు. ఇప్పటికే ఈసినిమా నుండి రిలీజ్ అయిన గ్లింప్స్ కానీ పోస్టర్లు మంచి రెస్పాన్స్ ను తెచ్చుకున్నాయి. ప్రస్తుతం అయితే ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఇక ఇదిలా ఉండగా ఈసినిమా నుండి మరో అప్ డేట్ తో వచ్చారు మేకర్స్. మూవీ నుంచి ఎగ్జైటింగ్ అప్‌డేట్‌లు త్వరలోనే ఇవ్వబోతున్నట్లు తమ అధికారిక ట్విట్టర్…

సత్యభామ కోసం రానున్న భగవంత్ కేసరి
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న కాజల్ పెళ్లి తరువాత కూడా పలు సినిమాలతో అదే జోరు కొనసాగిస్తుంది. ఈ ఏడాది ఇప్పటికే భగవంత్ కేసరితో మంచి హిట్ ను అందుకుంది. ఇప్పుడు మరో సినిమాతో వచ్చేస్తుంది. అయితే ఈసారి లేడీ ఒరియెంటెడ్ తో రాబోతుంది. సత్యభామ అనే టైటిల్ తో వస్తుంది ఈసినిమా. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ డేరింగ్ అండ్ డాషింగ్ పోలీస్ ఆఫీసర్ సత్యభామగా కనిపించనుంది. ఈ సినిమా రిలీజ్ ఇప్పటికే లేట్ అయింది అని చెప్పొచ్చు. ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈసినిమా ఇంతవరకూ రిలీజ్ కాలేకపోయింది. అయితే మే 17న రిలీజ్ చేద్దామనుకున్నారు కానీ ఆ తరువాత మే 31వ తేదీకి వాయిదా వేశారు. ప్రస్తుతం ఈసినిమా ప్రమోషన్…

గూఢచారి2- అందుకే డైరెక్టర్ ను మార్చాం
శశి కిరణ్ తిక్కా దర్శకత్వంలో అడివి శేష్ హీరోగా వచ్చిన సినిమా గూఢచారి. స్పై యాక్షన్ థ్రిల్లర్ గా వచ్చిన ఈసినిమా బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది. ఇక ఇప్పుడు ఈసినిమా సీక్వెల్ వస్తున్న సంగతి తెలిసిందే కదా. అయితే ఈ సీక్వెల్ కు డైరెక్టర్ గా వినయ్ కుమార్ పనిచేయనున్నాడు. ఈనేపథ్యంలో దీనిపై క్లారిటీ ఇచ్చాడు శశి కిరణ్.

తండేల్.. నాగచైతన్య న్యూ స్టిల్ వైరల్
అక్కినేని నాగచైతన్య హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘తండేల్’. క్రియేటివ్ డైరెక్టర్ చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ సాయి పల్లవి కథానాయికగా నటిస్తున్నారు. గీతా ఆర్ట్స్ బ్యానర్‌ఫై బన్నీ వాస్ ఈ సినిమాను నిర్మిస్తుండగా.. అల్లు అరవింద్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తుండగా.. శ్యామ్ దత్ సినిమాటోగ్రఫి అందిస్తున్నాడు. ఈ సినిమాను క్రిస్మస్ పండుగ సందర్భంగా డిసెంబర్ 20వ తేదీన గ్రాండ్‍గా రిలీజ్ చేయనున్నారు.

పుష్ప 2.. సెకండ్ సింగిల్ అప్‌డేట్
టాలీవుడ్ లోనే కాకుండా దేశవ్యాప్తంగా మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం 'పుష్ప-2: ది రూల్'. ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ నట విశ్వరూపం ప్రదర్శించిన ఈ మూవీ 'పుష్ప-ది రైజ్'కి సీక్వెల్‌గా రూపొందుతోన్న విషయం తెలిసిందే. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా సంచలన విజయం నమోదు చేసింది. దేశంలోని అన్ని ప్రధాన భాషల్లో డబ్ అయి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ఇక ప్రస్తుతం 'పుష్ప 2: ది రూల్' షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజైన టీజర్, ఫస్ట్ సింగిల్ నెట్టింట రికార్డు వ్యూస్ సాధించి సెన్సేషన్ సృష్టించాయి.

లవ్ మీ సెన్సార్ పూర్తి, విడుదలకు సిద్ధం
టాలీవుడ్ యంగ్ హీరో ఆశిష్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'లవ్ మీ'. ‘ఇఫ్ యు డేర్’ అనేది ఉప శీర్షిక. 'బేబీ' ఫేమ్ వైష్ణవి చైతన్య హీరోయిన్‌గా నటిస్తోంది. శిరీష్ సమర్పణలో దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ మీద హర్షిత్ రెడ్డి, హన్షిత, నాగ మల్లిడి ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. హారర్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి అరుణ్ భీమవరపు దర్శకత్వం వహించారు. మే 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది.

మహేష్ బాబు చేతులమీదుగా.. 'లవ్ మీ' నుంచి సాంగ్ రిలీజ్
టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో ఆశిష్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'లవ్ మీ'. ‘ఇఫ్ యు డేర్’ అనేది ఉప శీర్షికగా ఉంది. 'బేబీ' ఫేమ్ వైష్ణవి చైతన్య హీరోయిన్‌గా నటిస్తోంది. హారర్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి అరుణ్ భీమవరపు దర్శకత్వం వహించారు. శిరీష్ సమర్పణలో దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ మీద హర్షిత్ రెడ్డి, హన్షిత, నాగ మల్లిడి ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. మే 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది.

60 ఏళ్లు పూర్తి చేసుకున్న సురేష్ ప్రొడక్షన్స్
పద్మ భూషణ్, మూవీ మొఘల్, దివంగత లెజెండరీ ప్రొడ్యూసర్ డాక్టర్ దగ్గుబాటి రామానాయుడు గారు స్థాపించిన ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్. తాజాగా 60 ఏళ్ల అద్భుత సినీ ప్రయాణాన్ని పూర్తి చేసుకుని వైభవోత్సవాలు జరుపుకుంటోంది. భారతీయ చిత్ర పరిశ్రమలో అగ్రశ్రేణి నిర్మాణ సంస్థగా ప్రేక్షకుల మన్ననలని పొందిన సురేష్ ప్రొడక్షన్స్ 60 సంవత్సరాల సుదీర్ఘ సినీ ప్రస్థానంలో శతాధిక చిత్రాలను ప్రేక్షకులకందించి చరిత్ర సృష్టించింది.

రత్నం ఓటీటీ రిలీజ్ అప్ డేట్
యాక్షన్ డైరెక్టర్ హరి దర్శకత్వంలో విశాల్ హీరోగా వచ్చిన సినిమా రత్నం. మాస్ యాక్షన్ డ్రామా గా తెరకెక్కిన ఈసినిమా ఏప్రిల్ 26వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఈసినిమా ఆ అంచనాలను అయితే అందుకోలేకపోయింది. థియేటర్ల లో ఓ మోస్తరుగా ఆడినా మంచి కలెక్షన్లనే సాధించింది.

కల్కి 2898ఏడీ-భైరవ, బుజ్జీ మీట్ కు వేదిక ఫిక్స్
ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు సినీ లవర్స్ అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న మోస్ట్ అవైటెడ్ సినిమా కల్కి 2898ఏడీ. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో ఈసినిమా వస్తుంది. ఇప్పటికే ఈసినిమా నుండి రిలీజ్ చేసిన గ్లింప్స్, స్పెషల్ వీడియోస్ అన్నీ సినిమాపై అంచనాలను మరింత పెంచేశాయి. మరోవైపు మే నెలలో ఈసినిమాను రిలీజ్ చేద్దామనుకున్నారు. కానీ అనుకోని కారణాల వల్ల ఈసినిమాను వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. జూన్ 27వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

విశ్వంభర షూటింగ్ అప్డేట్
మెగాస్టార్ చిరంజీవి,బింబిసార ఫేమ్ వశిష్ఠ కాంబినేషన్ లో వస్తున్న సినిమా విశ్వంభర.భారీ బడ్జెట్ తో సోషియో ఫాంటసీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతుంది.రీసెంట్ గా భారీ ఇంటర్వల్ బ్లాక్ షూట్ పూర్తి కాగా ఆ తరువాత షూటింగ్ కి బ్రేక్ ఇచ్చారు. ఇక ఇప్పుడు కొత్త షెడ్యూల్ స్టార్ట్ కానుంది.రేపటి నుండి హైదరాబాద్ లో ఈషెడ్యూల్ ప్రారంభం కానుంది.ఇది కూడా నాన్ స్టాప్ గా జరుగనుంది.దాంతో 70శాతం షూటింగ్ పూర్తి కానుంది.జూలై లోపు షూటింగ్ మొత్తం కంప్లీట్ చేసి ఆ తరువాత విఎఫ్ఎక్స్ కు ఎక్కువ సమయం తీసుకోనున్నారు.

భజే వాయు వేగం- త్వరలో ట్రైలర్ రిలీజ్ అనౌన్స్ మెంట్
యంగ్ హీరో కార్తికేయ సినిమా జయాపజయాలతో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ప్రస్తుతం తన నుండి వస్తున్న సినిమా భజే వాయు వేగం. ప్రశాంత్ రెడ్డి దర్శకత్వంలో ఈసినిమా వస్తుంది. ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈసినిమా కూడా పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది. ఫైనల్ గా మే 31వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఇప్పటికే రిలీజ్ చేసిన టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ ల నుండి టీజర్ , పాటలు సినిమాపై క్యూరియాసిటీ పెంచాయి. ఇప్పుడు ట్రైలర్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈనేపథ్యంలో ట్రైలర్ అనౌన్స్ మెంట్ ను త్వరలో ఇస్తామని తెలిపారు చిత్రబృందం.

ఇండియన్ 2 ఫస్ట్ సింగిల్ ప్రోమో రిలీజ్
లెజెండరీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో లోకనాయకుడు కమల్ హాసన్ ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా ఇండియన్ 2. ఈసినిమా శంకర్, కమల్ హాసన్ కాంబినేషన్ లో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్ అని అందరికీ తెలిసిందే. దాంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ప్రస్తుతం అయితే ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. ఈసినిమా రిలీజ్ డేట్ ను తాజాగా ప్రకటించారు మేకర్స్. జులై 12వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

కల్కి ఓటిటి పార్ట్నర్స్ ఇవే
ఈఏడాది బిగ్గెస్ట్ మూవీస్ లో ఒకటి గా వస్తుంది కల్కి 2898ఏడి.సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో రెబల్ స్టార్ ప్రభాస్ తో మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ ఈసినిమాను తెరకెక్కిస్తున్నాడు.ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేశారు.రేపు రామోజీ ఫిలిం సిటీ లో ఓ భారీ ఈవెంట్ ను ప్లాన్ చేశారు.ఇక ఈసినిమాకు ఓటిటి డీల్ కూడా క్లోజ్ అయ్యింది.

దేవర ఫియర్ సాంగ్ రెస్పాన్స్ అదిరింది
దేవర నుండి వచ్చిన ఫస్ట్ సాంగ్ ఫియర్ సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంటుంది. 24గంటల్లో ఈ సాంగ్ అన్ని భాషల్లో కలిపి 28 మిలియన్లకు పైగా వ్యూస్ ను రాబట్టింది. దాంతో రీసెంట్ విడుదలైన పుష్ప 2 సాంగ్ ను క్రాస్ చేసింది.పుష్ప సాంగ్ 26మిలియన్లకు పైగా వ్యూస్ ను సొంతం చేసుకుంది. ముఖ్యంగా దేవర తెలుగు తోపాటు హిందీ లో అదరగొడుతుంది. తెలుగు వెర్షన్ ఇప్పటివరకు 18మిలియన్ల వ్యూస్ ను తెచ్చుకోగా హిందీ 12మిలియన్ల వ్యూస్ ను రాబట్టుకుంది.ఓవరాల్ గా ఫియర్ సాంగ్ అంచనాలను అందుకొని సినిమాకు వున్న హైప్ పెంచేసింది.

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన కీరవాణి, అందెశ్రీ
ఆస్కార్ అవార్డ్ విన్నర్ మరియు జాతీయ అవార్డు గ్రహీత అయిన ప్రముఖ టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి, ప్రజాకవి, గేయ రచయిత డాక్టర్ అందెశ్రీ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. ఈ మేరకు వారు మంగళవారం సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు. కాగా తెలంగాణ రాష్ట్రీయ గీతం అయిన ‘జయ జయహే తెలంగాణ’ పాటకు స్వరాలు చేకూర్చే బాధ్యతలను సంగీత దర్శకుడు కీరవాణికి అప్పగించింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ నేపథ్యంలోనే ఆ పాటను రాసిన గేయ రచయిత అందెశ్రీతో కలిసి కీరవాణి నేడు సీఎం రేవంత్ రెడ్డితో సమావేశం అయ్యారు.

మోహన్ లాల్ బర్త్ డే.. ఎంపురాన్ నుండి ఫస్ట్ లుక్ రివీల్
మలయాళం సూపర్ స్టార్ మోహన్‌లాల్‌కు టాలీవుడ్ లోనూ మంచి పాపులారిటీ ఉంది. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన 'జనతా గ్యారేజ్' సినిమాలో మోహన్ లాల్ నటించిన విషయం తెలుగు ప్రేక్షకులకు తెలిసిందే. ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా నాలుగు సార్లు జాతీయ అవార్డు గెలుచుకున్న అద్భుత నటుడు. మంగళవారం ఆయన జన్మదినం జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన అభిమానులకు అదిరిపోయే అప్‌డేట్ వచ్చింది.