ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు సినీ లవర్స్ అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న మోస్ట్ అవైటెడ్ సినిమా కల్కి 2898ఏడీ. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో ఈసినిమా వస్తుంది. ఇప్పటికే ఈసినిమా నుండి రిలీజ్ చేసిన గ్లింప్స్, స్పెషల్ వీడియోస్ అన్నీ సినిమాపై అంచనాలను మరింత పెంచేశాయి. మరోవైపు మే నెలలో ఈసినిమాను రిలీజ్ చేద్దామనుకున్నారు. కానీ అనుకోని కారణాల వల్ల ఈసినిమాను వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. జూన్ 27వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈసినిమా నుండి ఇప్పటికే బుజ్జీ ని పరిచయం చేసిన సంగతి తెలిసిందే కదా. ముందుగా ప్రభాస్ వాహనానికి చెందిన ‘బ్రైన్’ను పరిచయం చేశారు. ఇక బుజ్జీ కోసం స్పెషల్ ఈవెంట్ నే నిర్వహిస్తున్నారు. దానికి సంబంధించిన అప్ డేట్ కూడా ఇచ్చారు మేకర్స్. మే 22 తేదీన ఈ ఈవెంట్ ను జరపనున్నారు. ఈనేపథ్యంలో తాజాగా ఈవెంట్ వేదికను ఫిక్స్ చేస్తూ ప్రకటించారు. మే 22 సాయంత్రం 5 గంటల నుంచి హైదరాబాద్లోని రామోజీ ఫిల్మ్ సిటీలో ఈవెంట్ జరగనుంది. బుజ్జీ, భైరవను కలవండి అంటూ ఈ ఈవెంట్ వివరాలను టీమ్ ప్రకటించింది. ఈవెంట్ కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ సెట్ సిద్ధం చేస్తున్నారట.
Meet our Bujji & Bhairava!
🗓️ May 22nd, 5 PM Onwards
📍Ramoji Film City, Hyderabad#Kalki2898AD #Prabhas @SrBachchan @ikamalhaasan @deepikapadukone @nagashwin7 @DishPatani @Music_Santhosh @VyjayanthiFilms @Kalki2898AD @BelikeBujji @saregamaglobal @saregamasouth… pic.twitter.com/O1lBhTKYSG— Vyjayanthi Movies (@VyjayanthiFilms) May 21, 2024
కాగా ఈసినిమాలో దీపికా పదుకొనె హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే ఈ సినిమాలో మరొక హీరోయిన్ బాలీవుడ్ యంగ్ బ్యూటీ దిశా పటానీ కూడా నటిస్తుంది. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, రాజేంద్రప్రసాద్, పశుపతి పలు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. వైజయంతి మూవీస్ పతాకంపై అశ్వనీదత్ దాదాపు రూ.500 కోట్ల బడ్జెట్ తో ఈసినిమాను నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి తోట రమణి ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























