60 ఏళ్లు పూర్తి చేసుకున్న సురేష్ ప్రొడక్షన్స్‌

Suresh Productions Completed 60 Glorious Years in TFI

పద్మ భూషణ్, మూవీ మొఘల్, దివంగత లెజెండరీ ప్రొడ్యూసర్ డాక్టర్ దగ్గుబాటి రామానాయుడు గారు స్థాపించిన ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్. తాజాగా 60 ఏళ్ల అద్భుత సినీ ప్రయాణాన్ని పూర్తి చేసుకుని వైభవోత్సవాలు జరుపుకుంటోంది. భారతీయ చిత్ర పరిశ్రమలో అగ్రశ్రేణి నిర్మాణ సంస్థగా ప్రేక్షకుల మన్ననలని పొందిన సురేష్ ప్రొడక్షన్స్ 60 సంవత్సరాల సుదీర్ఘ సినీ ప్రస్థానంలో శతాధిక చిత్రాలను ప్రేక్షకులకందించి చరిత్ర సృష్టించింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ఎన్నో అద్భుతమైన చిత్రాలని నిర్మించి ప్రేక్షకులని విశేషంగా అలరిస్తున్న సురేష్ ప్రొడక్షన్స్ అన్ని భారతీయ భాషల్లో సినిమాలు నిర్మించి సంస్థగా అరుదైన ఘనత సాధించింది. 1964లో రామానాయుడు గారి పెద్ద కుమారుడు సురేష్ బాబు పేరుతో ఈ సంస్థ ప్రారంభమైంది. నాటినుంచి నేటివరకూ ఎన్నో కల్ట్ క్లాసిక్ హిట్స్, మోడరన్ మాస్టర్ పీస్ చిత్రాలతో గత ఆరు దశాబ్దాలుగా ప్రేక్షకులకు అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ పంచుతోంది.

ఇక సురేష్ ప్రొడక్షన్స్ 60ఏళ్ళు పూర్తి చేసుకుని వైభవోత్సవాలు జరుపుకుంటున్న సందర్భంగా.. ఈ అద్భుతమైన సినీ ప్రయాణంలో భాగమైన నటీనటులకు, సాంకేతిక నిపుణులకు, ప్రేక్షకులకు, అభిమానులకు, మీడియాకు, ప్రతి ఒక్కరికీ నిర్మాణ సంస్థ కృతజ్ఞతలు తెలియజేసింది. రామానాయడు గారి వారసత్వాన్ని ఆయన కుటుంబ సభ్యులు దిగ్విజయంగా కొనసాగిస్తున్నారు. సురేష్ బాబు నిర్మాతగా కొనసాగుతుండగా.. ఆయన తమ్ముడు వెంకటేష్ అగ్ర హీరోగా వెలుగొందుతున్నారు. అలాగే సురేష్ బాబు తనయులు రానా దగ్గుబాటి పాన్ ఇండియా హీరోగా గుర్తింపు పొందగా.. అభిరామ్ హీరోగా సినిమాలు చేస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.