టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న కాజల్ పెళ్లి తరువాత కూడా పలు సినిమాలతో అదే జోరు కొనసాగిస్తుంది. ఈ ఏడాది ఇప్పటికే భగవంత్ కేసరితో మంచి హిట్ ను అందుకుంది. ఇప్పుడు మరో సినిమాతో వచ్చేస్తుంది. అయితే ఈసారి లేడీ ఒరియెంటెడ్ తో రాబోతుంది. సత్యభామ అనే టైటిల్ తో వస్తుంది ఈసినిమా. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ డేరింగ్ అండ్ డాషింగ్ పోలీస్ ఆఫీసర్ సత్యభామగా కనిపించనుంది. ఈ సినిమా రిలీజ్ ఇప్పటికే లేట్ అయింది అని చెప్పొచ్చు. ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈసినిమా ఇంతవరకూ రిలీజ్ కాలేకపోయింది. అయితే మే 17న రిలీజ్ చేద్దామనుకున్నారు కానీ ఆ తరువాత మే 31వ తేదీకి వాయిదా వేశారు. ప్రస్తుతం ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలత బిజీగా ఉంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పటికే ఈసినిమా నుండి టీజర్, పాటలు రిలీజ్ అయి మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయి. ఈసినిమా ట్రైలర్ రిలీజ్ డేట్ ను ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందేకదా. మే 24వ తేదీన ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు. ఐటీసీ కోహినూర్, హైదరాబాద్ లో సాయంత్రం 6:30 గంటల నుండి ఈ ట్రైలర్ ఈవెంట్ జరగనుంది. అంతేకాదు ఈ ఈవెంట్ కు నటసింహం బాలకృష్ణ ముఖ్య అతిధిగా రానున్నట్టు చిత్రయూనిట్ పోస్టర్ రిలీజ్ చేస్తూ తెలిపింది. కాగా బాలకృష్ణ, కాజల్ కలిసి భగవంత్ కేసరి సినిమా చేసిన సంగతి విదితమే.
‘𝐆𝐨𝐝 𝐨𝐟 𝐌𝐚𝐬𝐬𝐞𝐬’ 🦁 for ‘𝐐𝐮𝐞𝐞𝐧 𝐨𝐟 𝐌𝐚𝐬𝐬𝐞𝐬’ 👸❤️🔥
Get ready to witness the ROAR of #NandamuriBalaKrishna Garu as he is all set to grace the Grand Trailer Launch Event of #Satyabhama 🔥❤️🔥
Mark your calendars ✅
🗓️ 24th May
🕡 6:30… pic.twitter.com/aQULeSKvVT— Aurum Arts Official (@AurumArtsOffl) May 22, 2024
కాగా క్రైమ్ థ్రిల్లర్ కథాంశంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాకి సుమన్ చిక్కాల దర్శకత్వం వహిస్తుస్తున్నారు.నవీన్ చంద్ర, ప్రకాష్ రాజ్, నాగినీడు, హర్షవర్ధన్, రవివర్మ, అంకిత్ కొయ్య, సంపద ఎన్, ప్రజ్వల్ యద్మ తదితరులు కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ‘గూఢచారి’ ఫేమ్ శశికిరణ్ తిక్కా స్క్రీన్‌ప్లేతో పాటు నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్నాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























