టాలీవుడ్ యంగ్ హీరో ఆశిష్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘లవ్ మీ’. ‘ఇఫ్ యు డేర్’ అనేది ఉప శీర్షిక. ‘బేబీ’ ఫేమ్ వైష్ణవి చైతన్య హీరోయిన్‌గా నటిస్తోంది. శిరీష్ సమర్పణలో దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ మీద హర్షిత్ రెడ్డి, హన్షిత, నాగ మల్లిడి ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. హారర్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి అరుణ్ భీమవరపు దర్శకత్వం వహించారు. మే 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ నేపథ్యంలో ‘లవ్ మీ’ మూవీ నుంచి ఒక సాలిడ్ అప్‌డేట్ వచ్చింది. తాజాగా ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకుంది. సెన్సార్ బోర్డు ఈ సినిమాకు యూ/ఏ సర్టిఫికేట్ జారీ చేసింది. ఈ మేరకు చిత్ర నిర్మాణ సంస్థ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ఈ రోజు ‘ఏమవుతుంది’ అనే పాటను రిలీజ్ చేశారు. సూపర్ స్టార్ మహేష్ బాబు చేతులమీదుగా ఈ పాటను విడుదల చేయడం గమనార్హం. ప్రస్తుతం ఈ సాంగ్ మూవీ లవర్స్‌ను ఆకట్టుకుంటోంది.
ఇక ఆశిష్, వైష్ణవి చైతన్య జంటగా నటించిన ఈ చిత్రానికి టాప్ టెక్నీషియన్స్ పనిచేశారు. లెజెండరీ సినిమాటోగ్రాఫర్ పి.సి.శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అందించడం విశేషం. ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎం.ఎం.కీరవాణి సంగీతాన్ని సమకూర్చగా.. అవినాష్ కొల్ల ఆర్ట్ బాధ్యతలు నిర్వర్తించారు. కాగా ఈ వేసవిలో వెన్నులో వణుకు పుట్టించేలా ఓ ఆత్మ ప్రేమకథతో ఈ సినిమా రాబోతోందని మేకర్స్ ప్రకటించిన నేపథ్యంలో ఈ చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: