
ట్యాగ్ · 19105 కథనాలు · పేజీ 164


ఇండియన్ 2 సెకండ్ సింగిల్ రిలీజ్ డేట్ ఫిక్స్

మైత్రీ చేతికి మనమే నైజాం రైట్స్

ఓజీ.. టైటిల్ అర్ధం ఇదే - డైరెక్టర్ సుజీత్

కార్తీ 26 టైటిల్ రిలీజ్

ఆయ్ రంగనాయకి రిలీజ్

భజే వాయు వేగం ట్రైలర్ రిలీజ్

టైసన్ నాయుడు.. షెడ్యూల్ అప్‌డేట్

అమరన్ షూటింగ్ కంప్లీట్

మనమే రిలీజ్ డేట్ ఫిక్స్

సూపర్‌స్టార్ రజినీకాంత్‌కు అరుదైన గౌరవం

విశ్వంభరలోకి మరో హీరోయిన్ ఎంట్రీ

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న విశ్వక్ సేన్
టాలీవుడ్ దమ్ కా దాస్ విశ్వక్ సేన్ తిరుమలను సందర్శించారు. ఆయన హీరోగా నటించిన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' సినిమా త్వరలో విడుదలకానుంది. ఈ నేపథ్యంలో శ్రీవారి ఆశీస్సులు తీసుకునేందుకు ఆయన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' మూవీ టీమ్‌తో కలిసి తిరుమలకు విచ్చేసారు. సోమవారం ఉదయం తిరుమల చేరుకున్న విశ్వక్ సేన్, యూనిట్ సభ్యులకు ఆలయ అధికారులు వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.

గౌతమ్ కాన్వకేషన్.. తండ్రిగా గర్విస్తున్నా - మహేష్ బాబు
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పుత్రోత్సాహంలో ఉన్నారు. ఆయన తనయుడు గౌతమ్ ఘట్టమనేని తాజాగా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్నాడు. ఈ సందర్భంగా జరిగిన కాన్వకేషన్‍లో గౌతమ్ గ్రాడ్యుయేషన్ పట్టా అందుకున్నాడు. ఈ కార్యక్రమానికి మహేశ్ బాబు సతీమణి నమ్రత, కూతురు సితారలతో కలిసి హాజరయ్యారు. ఇక ఇందుకు సంబంధించిన ఫొటోలను మహేశ్, నమ్రత సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కాగా ఇన్‌స్టాగ్రామ్ వేదికగా మహేష్ బాబు, నమ్రత చేసిన పోస్ట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

ఇండియన్ 2 సెకండ్ సింగిల్ రిలీజ్ డేట్ ఫిక్స్
లెజెండరీ డైరెక్టర్ శంకర్ రెండు సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే కదా. అందులో ఇండియన్2 సినిమా ఒకటి. ఈసినిమా శంకర్, కమల్ హాసన్ కాంబినేషన్ లో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్ అని అందరికీ తెలుసు. దాంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే షూటింగ్ పూర్తి కాగా.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటోంది. జూన్ 12వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

మైత్రీ చేతికి మనమే నైజాం రైట్స్
హీరో శర్వానంద్ కు సాలిడ్ హిట్ దక్కి చాలా కాలమే అయిపోయింది. ఆ మధ్య వచ్చిన ఒకే ఒక జీవితం ఒక మోస్తరు విజయాన్ని అందించినా మంచి కమ్ బ్యాక్ ను అయితే ఇవ్వలేకపోయింది. కమర్షియల్ గా ఈసినిమా బాక్సాఫీస్ వద్ద వర్కవుట్ కాలేదు. ఇక ఆ సినిమా తరువాత చాలా గ్యాప్ తీసుకొని ఇప్పుడు మరో సినిమాతో రాబోతున్నాడు. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా వస్తున్న సినిమా మనమే. ఈసినిమా ప్రస్తుతం రిలీజ్ కు సిద్దమవుతుంది.

ఓజీ.. టైటిల్ అర్ధం ఇదే - డైరెక్టర్ సుజీత్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గత కొన్ని నెలలుగా రాజకీయాలతో బిజీగా ఉంటూ వస్తున్నారు. అయితే ఇటీవలే ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు ముగిసినందున ఇకపై ఆయన కొంతకాలం సినిమాలపై దృష్టి పెట్టనున్నారు. కాగా పవన్ కళ్యాణ్ హీరోగా 'ఉస్తాద్ భగత్ సింగ్', 'హరి హరవీరమల్లు', 'ఓజీ' సినిమాలు రూపొందుతోన్న విషయం తెలిసిందే. ఇవన్నీ భారీ అంచనాలున్న మూవీస్ కావడం గమనార్హం. దీంతో పవర్ స్టార్ ఫ్యాన్స్ ఆయన సినిమాలకు సంబంధించిన అప్‌డేట్స్ కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

కార్తీ 26 టైటిల్ రిలీజ్
తమిళ్ స్టార్ హీరో కార్తీ మాత్రం సినిమా జయాపజయాలతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. పొన్నియిన్ సెల్వన్, సర్దార్, సినిమాలతో వరుస హిట్లు తన ఖాతాలో వేసుకున్న కార్తీకి జపాన్ తో బ్రేక్ పడింది. డిఫరెంట్ మేకోవర్ తో వచ్చినా జపాన్ సినిమా పెద్దగా వర్కవుట్ కాలేదు. ఇక ఇప్పుడు మరో సినిమాతో వస్తున్నాడు కార్తీ.

మనమే- మెలోడియస్ ఓ మనమే ఫుల్ సాంగ్ రిలీజ్
కొంచం గ్యాప్ తరువాత ప్రామిసింగ్ హీరో శర్వానంద్ నుండి వస్తున్న సినిమా మనమే. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో న్యూ ఏజ్ లవ్ స్టోరీ గా ఈసినిమా రాబోతుంది. కొంత కాలంగా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ సినిమాలతో అలరిస్తున్న శర్వా ఈసినిమాలో ప్లే బాయ్ తరహా ఎనర్జిటిక్ రోల్ లో కనిపిస్తున్నట్టు అర్థమవుతుంది. ప్రస్తుతం అయితే ఈసినిమా రిలీజ్ కు సిద్దమవుతుంది. మరోవైపు ఈ సినిమా ఫస్ట్ లుక్, గ్లింప్స్, ఫస్ట్ సింగిల్, అలానే రీసెంట్ గా రిలీజ్ చేసిన టీజర్ కు అద్భుతమైన స్పందన వచ్చింది. దీంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.

ఆయ్ రంగనాయకి రిలీజ్
మ్యాడ్ తరువాత ఎన్టీఆర్ బావమరిది నార్నె నితిన్ నుండి వస్తున్న సినిమా ఆయ్. గోదావారి బ్యాక్ డ్రాప్ లో లవ్ అండ్ ఫ్రెండిష్ నేపథ్యంలో తెరకెక్కుతుంది.షూటింగ్ కూడా పూర్తి చేసుకున్న ఈసినిమా ఈ మేలోనే విడుదలకావాల్సి ఉండగా వాయిదా వేశారు.ఇక ఈసినిమా నుండి రీసెంట్ గా మొదటి పాట సుఫియానా రిలీజ్ అవ్వగా సూపర్ రెస్పాన్స్ వచ్చింది.

బుజ్జిపై నాగచైతన్య రైడింగ్.. కల్కి టీమ్‌కి హ్యాట్సాఫ్
టాలీవుడ్‌లో ఇప్పుడు ఎక్కడ చూసినా 'బుజ్జి' గురించే చర్చ నడుస్తోంది. ఇంతకీ ఈ బుజ్జి ఎవరంటే..? పాన్ ఇండియా స్టార్ పభాస్ హీరోగా నటిస్తోన్న 'కల్కి 2898 AD’ చిత్రంలో కనిపించనున్న కారు. అయితే ఈ కారు సినిమాలో చాలా కీలక పాత్ర పోషించనుందని దర్శకుడు నాగ్ అశ్విన్ ఇప్పటికే తెలియజేశారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఆ కారును డిజైన్ చేయించడం విశేషం. ఎఫ్ 1 రేసింగ్‌లో పాల్గొనే కార్ల వంటి మోడల్‌లో ఉన్న బుజ్జిని చూసిన ప్రతి ఒక్కరూ మెచ్చుకుంటున్నారు. 'బుజ్జి’ని ప్రేక్షకులకు పరిచయం చేయడం కోసం ఇటీవలే మేకర్స్ స్పెషల్ ఈవెంట్ నిర్వహించిన విషయం తెలిసిందే.

భజే వాయు వేగం ట్రైలర్ రిలీజ్
బెదురులంక తరువాత యంగ్ హీరో కార్తికేయ గుమ్మకొండ నుండి వస్తున్న సినిమా భజే వాయు వేగం.ఈసినిమా ట్రైలర్ ను ఈరోజు రిలీజ్ చేశారు.ఇక ఈ ట్రైలర్ ప్రామిసింగ్ గా వుంది.స్నేహం,క్రికెట్,డబ్బు చుట్టూ తిరిగే కథ తో వస్తుంది ఈసినిమా.ట్రైలర్ చూస్తే సినిమాలో యాక్షన్ బాగానే ఉన్నట్లు వుంది.ఎమోషనల్ సీన్ తో ట్రైలర్ ను ఎండ్ చేశారు.బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది.ఓవరాల్ గా ట్రైలర్ అయితే ఆకట్టుకుంది.

పుష్ప 2 నుండి రావు రమేష్ క్యారెక్టర్ పోస్టర్ రిలీజ్
క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన సినిమా పుష్ప. ఈసినిమా సంచలనాలు క్రియేట్ చేసింది. ఇప్పుడు పుష్ప2 సినిమాతో బిజీగా ఉన్నాడు బన్నీ. మరోవైపు ఈసినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈసినిమా పస్తుతం షూటింగ్ ను పూర్తిచేసుకుంటుంది. మరోవైపు ఈసినిమా నుండి రిలీజ్ చేసిన అప్ డేట్లు అన్నీ సోషల్ మీడియాలో ఎలాంటి రికార్డులు క్రియేట్ చేశాయో చూాశాం. రీసెంట్ గా రిలీజ్ చేసిన పుష్ప పుష్ప సాంగ్ కూడా ఎలాంటి వ్యూస్ సొంతం చేసుకున్నాయే తెలిసిందే.

రేపు ఓటీటీలోకి ఆడు జీవితం.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
'సలార్' ఫేమ్, మాలీవుడ్ సూపర్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'ఆడు జీవితం'. ఈ సినిమా ఇంగ్లీష్‌లో 'గోట్ లైఫ్' అనే పేరుతో విడుదలయింది. ఈ సినిమాలో అమలాపాల్ ప్రధాన పాత్రలో నటించగా.. అస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ బ్లెస్సీ దర్శకత్వం వహించగా.. మార్చి 28న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ 'ఆడు జీవితం' చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేసింది. థ్రిల్లింగ్ సర్వైవల్ అడ్వెంచర్‌గా రూపొందిన ఈ చిత్రం, మూవీ లవర్స్‌ని విశేషంగా ఆకట్టుకుంది.

లవ్ మీ మూవీ తెలుగు రివ్యూ
ఓవరాల్ గా చెప్పాలంటే హార్రర్ జోనర్ సినిమాలు ఇష్టపడే వారికి ఈసినిమా ఖచ్చితంగా నచ్చుతుంది. అంతేకాదు మిగిలిన వర్గాల వారు కూడా ఒకసారి చూసి ఎంజాయ్ చేసే సినిమా అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

ధనుష్ రాయన్ నుండి సెకండ్ సింగిల్ రిలీజ్
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘రాయన్’. కాగా ధనుష్ కెరీర్‌లో ఇది 50వ సినిమా కావడం విశేషం. అయితే మరో విశేషమేంటంటే..? ఈ చిత్రానికి ఆయనే స్వయంగా దర్శకత్వం వహిస్తున్నాడు. కాగా దర్శకుడిగా ఆయనకు ఇది రెండో సినిమా. అంతకుముందు 2017లో వచ్చిన ‘పా పాండి’ అనే సినిమాతో ధనుష్ తొలిసారి దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ఆయనకు ఉత్తమ దర్శకుడిగా మొదటి ఫిల్మ్‌ఫేర్ అవార్డును సంపాదించిపెట్టింది.

టైసన్ నాయుడు.. షెడ్యూల్ అప్‌డేట్
ప్రామెసింగ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కథానాయకుడిగా రూపొందుతున్న యూనిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'టైసన్ నాయుడు'. 'భీమ్లానాయక్' ఫేమ్ సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్నాడు. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో రామ్ ఆచంట, గోపి ఆచంట ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కాగా ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉంది. ఈ సబ్జెక్ట్‌పై టీమ్ సూపర్ కాన్ఫిడెంట్‌గా ఉండటంతో రాజీపడకుండా సినిమాను రూపొందిస్తున్నారు.

అమరన్ షూటింగ్ కంప్లీట్
తమిళ హీరో శివ కార్తికేయన్ అమరన్ షూటింగ్ నేటితో కంప్లీట్ అయ్యింది.ఇందులో శివ కార్తికేయన్ ఆర్మీ ఆఫీసర్ గా కనిపించనున్నాడు.రాజ్ కుమార్ పెరియస్వామి ఈసినిమాను డైరెక్ట్ చేస్తుండగా మేజర్ ముకుంద్ వరదరాజన్ బయోపిక్ గా వస్తుంది.సాయి పల్లవి హీరోయిన్ గా నటించగా జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు.కమల్ హాసన్ సొంతం బ్యానర్ రాజ్ కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ ఫిలిమ్స్ ఈసినిమాను నిర్మిస్తుంది.సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో విడుదలచేసేలా ప్లాన్ చేస్తున్నారు.త్వరలోనే రిలీజ్ డేట్ ను ప్రకటించనున్నారు.

నెట్ ఫ్లిక్స్ లోకి క్రూ
బాలీవుడ్ లేటెస్ట్ మూవీ క్రూ ఓటిటిలోకి వచ్చేసింది.మార్చి చివర్లో థియేటర్లలో విడుదలైన ఈసినిమా ప్రపంచ వ్యాప్తంగా 150కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి సూపర్ హిట్ అనిపించుకుంది. ఇందులో టబు ,కరీనా కపూర్,కృతి సనన్ లీడ్ రోల్స్ లో నటించగా దిల్జీజ్ దోసాంజ్ ,కపిల్ శర్మ కీలక పాత్రలు పోషించారు.ఇక ఈసినిమా నుండి ఈరోజు నుండి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ లోకి వచ్చింది.అయితే కేవలం ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో హిందీ లో మాత్రమే అందుబాటులోకి వచ్చింది.దక్షిణాది భాషల్లో ఎప్పుడు రిలీజ్ చేస్తారో అనేదానిపై క్లారిటీ లేదు.

మనమే రిలీజ్ డేట్ ఫిక్స్
ఒకే ఒక జీవితంతో హిట్ కొట్టి ట్రాక్ లోకి వచ్చిన యంగ్ హీరో శర్వానంద్ మనమే తో పలకరించనున్నాడు.ఈరోజు ఈసినిమా రిలీజ్ డేట్ ను మేకర్స్ ప్రకటించారు.వచ్చే నెల 7న మనమే థియేటర్లోకి రానుంది.ఇక అదే రోజు కాజల్ నటించిన సత్యభామ కూడా విడుదలకానుంది.దాంతో బాక్సాఫీస్ వద్ద పోటీ నెలకొననుంది. మనమేను శ్రీరామ్ ఆదిత్య తెరకెక్కిస్తుండగా కృతి శెట్టి హీరోయిన్ గా నటించింది.ఇందులో శ్రీరత్ కపూర్ కీలక పాత్రలో కనిపించనుండగా హేషమ్ అబ్దుల్ వాహబ్ సంగీతం అందిస్తున్నాడు.పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తుంది.రీసెంట్ గా టీజర్ ను రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది.

సూపర్‌స్టార్ రజినీకాంత్‌కు అరుదైన గౌరవం
కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్‌కు దేశవ్యాప్తంగానే కాకుండా విదేశాల్లో సైతం మంచి పాపులారిటీ ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా ఆయనకు ఒక అరుదైన గౌరవం దక్కింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) దేశం వివిధ రంగాల్లోని ప్రముఖులకు అందించే గోల్డెన్ వీసా రజినీకాంత్‌కు అందించింది. ఈ మేరకు విషయాన్ని సూపర్ స్టార్ స్వయంగా సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. గోల్డెన్ వీసా పొందడం పట్ల సంతోషం వ్యక్తం చేసిన రజినీకాంత్ ఇది ఒక గౌరవంగా భావిస్తున్నానని, యూఏఈ ప్రభుత్వానికి కృతజ్ఞతలు అని తెలిపారు.

విశ్వంభరలోకి మరో హీరోయిన్ ఎంట్రీ
మెగాస్టార్ చిరంజీవి మోస్ట్ ఎవైటెడ్ మాగ్నమ్ ఓపస్ 'విశ్వంభర'. 'బింబిసార' ఫేమ్ వశిష్ట మల్లిడి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో త్రిష కృష్ణన్ కథానాయికగా నటిస్తోండగా.. ఇషా చావ్లా చిరు చెల్లెలుగా కనిపించనుంది. వీరితో పాటు మరికొందరు స్టార్ హీరోయిన్స్ కూడా కీలక పాత్రల్లో కనిపించనున్నారని సమాచారం. ఆస్కార్ అవార్డు విన్నింగ్ మ్యూజిక్ కంపోజర్ ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా.. ఛోటా కే నాయుడు సినిమాటోగ్రఫీ నిర్వహిస్తున్నారు.