రవితేజ కెరీర్ లో ప్రత్యేకంగా నిలిచిపోయే 75వ సినిమాకు హీరోయిన్ దొరికేసింది.సామజవరగమన రైటర్ భాను బోగవరపు ఈసినిమా ను తెరకెక్కించనున్నాడని తెలిసిందే.ఈసినిమా కోసం హీరోయిన్ ను కూడా ఫైనల్ చేశారు.యంగ్ సెన్సేషన్ శ్రీలీల ఇందులో హీరోయిన్ గా నటించనుంది.త్వరలోనే ఈ విషయాన్ని అఫీషియల్ గా ప్రకటించనున్నారు.ఇక శ్రీలీల,రవితేజ తో జత కొట్టడం ఇది రెండో సారి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇంతకుముందు వీరిద్దరు కలిసి ధమాకా లో నటించారు.ఈసినిమా 100కోట్ల వసూళ్లను రాబట్టి రవితేజ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.ఇక ఇప్పుడు వీరిద్దరు కలిసి మరోసారి ఎంటర్టైన్ చేయనున్నారు.జూన్ నుండి ఈసినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది.భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తుండగా సాయి సౌజన్య, నాగవంశీ నిర్మిస్తున్నారు.వచ్చే సంక్రాంతికి విడుదలకానుంది.
ఇక రవితేజ ప్రస్తుతం మిస్టర్ బచ్చన్ పూర్తి చేసే పనిలో వున్నాడు.హరీష్ శంకర్ డైరెక్ట్ చేస్తుండగా భాగ్య శ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తుంది.మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తుంది.ఆగస్టు లేదా సెప్టెంబర్ లో రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు .
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:


































