నందమూరి కళ్యాణ్ రామ్ కొత్త సినిమా అప్‌డేట్

Nandamuri Kalyan Ram's #NKR21 Shoot in Progress

టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో నందమూరి కళ్యాణ్ రామ్ జయాపజయాలతో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళ్తుంటారు. అందులోనూ రెగ్యులర్ టైపు కాకుండా ప్రయోగాత్మక చిత్రాలు చేయడానికి ఆసక్తి చూపుతుంటారు. రెండేళ్ల క్రితం ‘బింబిసార’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ఆయన మళ్ళీ ఆ స్థాయి హిట్ అందుకోలేకపోయారు. దాని తర్వాత కళ్యాణ్ రామ్ చేసిన ‘అమిగోస్’, ‘డెవిల్’ ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయాయి. అయితే వీటిలో ‘డెవిల్’ మేకింగ్ పరంగా హై స్టాండర్డ్స్ మెయింటైన్ చేసినప్పటికీ కథనంలో ఎక్కడో తేడా కొట్టడంతో విజువల్ పరంగా బాగుందని టాక్ వచ్చినా సక్సెస్ కొట్టలేకపోయింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ నేపథ్యంలో కళ్యాణ్ రామ్ కొంత గ్యాప్ తీసుకుంటాడనే టాక్ వచ్చింది. దీనికి తగ్గట్లుగా ఆయన నుంచి ఎలాంటి అప్‌డేట్స్ లేకపోవడం, అలాగే తన తమ్ముడు, స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న ‘దేవర’ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తుండటంతో ఇప్పుడప్పుడే కొత్త సినిమాలు చేయకపోవచ్చు అని నందమూరి అభిమానులు కూడా భావించారు. అయితే అందరినీ ఆశ్చర్యపరుస్తూ తాజాగా కొత్త సినిమాకి సంబంధించి కీలక అప్‌డేట్ అందించారు కళ్యాణ్ రామ్. నేడు తన తాత, దివంగత నటుడు సీనియర్ ఎన్టీఆర్ జయంతి సందర్భంగా కొత్త సినిమా (#NKR21) షూటింగ్ ప్రోగ్రెస్‌లో ఉందని వెల్లడించారు.

ఈ మేరకు ఎక్స్ వేదికగా ‘ది ఫిస్ట్ ఆఫ్ ఫ్లేమ్’ పేరుతో 33 సెకన్ల నిడివిగల ఒక స్పెషల్ వీడియోను రిలీజ్ చేశారు. అందులో బ్యాక్‌గ్రౌండ్‌లో మంటలు కనిపిస్తుండగా.. చేతి వేళ్ళు విరుచుకుంటూ, పిడికిలి బిగించి పట్టుకుని కనిపించారు కళ్యాణ్ రామ్. కాగా ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతూ మూవీ లవర్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

ఇక ఈ చిత్రంలో సయీ మంజ్రేకర్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. సీనియర్ నటి విజయశాంతి కీలక పాత్రలో కనిపించనున్నారు. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహిస్తున్న #NKR21 సినిమాను నందమూరి తారక రామారావు ఆర్ట్స్ మరియు అశోకా క్రియేషన్స్ బ్యానర్లపై సునీల్ బలుసు, అశోక్ ముప్పాలతో కలిసి కళ్యాణ్ రామ్ సంయుక్తంగా నిర్మించనున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.