గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ట్రైలర్ కు సూపర్  రెస్పాన్స్

Gangs Of Godavari trailer gets good response

యంగ్ హీరో విశ్వక్ సేన్, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరితో మరో నాలుగు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. సాంగ్స్ చార్ట్ బాస్టర్ కావడం అలాగే టీజర్ కూడా సూపర్ రెస్పాన్స్ తెచ్చుకోవడంతో ట్రైలర్ పై అంచనాలు పెరిగిపోయాయి.ఇక రెండు రోజుల క్రితం ఈసినిమా ట్రైలర్ ను కూడా విడుదలచేశారు.ఈ ట్రైలర్ ను ఊర మాస్ గా కట్ చేసి అంచనాలను పెంచడం లో టీం సక్సెస్ అయ్యింది.ఇందులో విశ్వక్ డైలాగ్స్, ఆటిట్యూడ్ హైలైట్ అయ్యాయి.ఇప్పటివరకు యూట్యూబ్ లో ట్రైలర్ వ్యూస్  2 మిలియన్లు దాటింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

గోదావరి బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈసినిమాలో అంజలి,నేహా శెట్టి హీరోయిన్లు గా నటించారు.ప్రస్తుతం టీం ప్రమోషన్స్ తో బిజీగా వుంది. ఈసినిమా విశ్వక్ కు కెరీర్  బెస్ట్ ఓపెనింగ్స్ ను అందించనుంది.కంటెంట్ కూడా క్లిక్ అయితే బిగ్గెస్ట్ హిట్ ను ఖాతాలో పడడం ఖాయం అయితే  31న మరో రెండు హైప్ వున్న సినిమాలు కూడా  కూడా వస్తున్నాయి. దాంతో బాక్సాఫీస్ వద్ద పోటీ తప్పకపోవచ్చు.మరి ఈ పోటీని తట్టుకొని విశ్వక్ ఈ ఏడాది వరుసగా రెండో విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిని కృష్ణ చైతన్య డైరెక్జ్ చేయగా యువన్ శంకర్ రాజా సంగీతం అందించాడు. సితార ఎంటర్టైన్మెంట్స్, శ్రీ కర స్టూడియోస్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ నిర్మించాయి.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.