బాలీవుడ్ డైరెక్టర్ ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో మంచు విష్ణు హీరోగా వస్తున్న ప్రతిష్టాత్మక సినిమా కన్నప్ప. మంచు విష్ణు కేరీర్ లోనే వస్తున్న భారీ బడ్జెట్ సినిమా ఇది. శివుని భక్తుడు కన్నప్ప జీవిత చరిత్ర ఆధారంగా ఈసినిమా వస్తుండటం.. దానికి తోడు ప్రభాస్ తో పాటు ఈసినిమాలో భారీ కాస్టింగ్ కూడా ఉండటంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ దశలో ఉంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా టీజర్ ను రీసెంట్ గా కేన్స్ లో రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే కదా. అక్కడ ఇంటర్నేషనల్ ఆడియన్స్ టీజర్ బాగా నచ్చిందని.. పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందని కూడా మంచు విష్ణు తన ఇన్ట్సా ద్వారా పోస్ట్ చేస్తూ ఆనందాన్ని కూడా వ్యక్తం చేశాడు. ఇప్పుడు మరోసారి తన సోషల్ మీడియా ద్వారా వారి పాజిటివ్ రెస్పాన్స్ కు సంబంధించిన వీడియోను పోస్ట్ చేశాడు. ఇక వీడియోలో టీజర్ ను చూసిన వారు మంచి ప్రశంసలు కురిపించారు. విజువల్స్ బాగున్నాయని, సినిమాటోగ్రఫి ఇంకా ఫెంటాస్టిక్ మేకింగ్ అంటూ పొగడ్తలు కురిపించడం చూస్తున్నాం.. ఇక ఈసినిమా తెలుగు టీజర్ ను మే30వ తేదీన ఇంకా జూన్ 13వ తేదీన ఇతర భాషల్లో రిలీజ్ చేయనున్నట్టు తెలిపారు.
View this post on Instagram
కాగా ఈసినిమాలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పాటు కాజల్, మోహన్ లాల్, కన్నడ స్టార్ హీరో శివ రాజ్ కుమార్, ప్రీతి ముకుందన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈసినిమాను అవా ఎంటర్టైన్మెంట్ ఇంకా 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్స్ పై మంచు విష్ణు తండ్రి, సీనియర్ నటుడు మంచు మోహన్ బాబు నిర్మిస్తున్నారు. మణిశర్మ, స్టీఫెన్ దేవాసి సంయుక్తంగా ఈసినిమాకు సంగీతం అందిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























