సీక్వెల్‍‍కి ముందు రీ-రిలీజ్‌కి సిద్దమైన భారతీయుడు

Kamal Haasan’s Bharateeyudu to Re-release on June 7

లోకనాయకుడు కమల్ హాసన్ హీరోగా తెరకెక్కుతోన్న తాజా చిత్రం ‘ఇండియన్ 2’. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎస్. శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. కాగా వీరి కాంబినేషన్ లో 1996లో వచ్చిన ‘భారతీయుడు’ (ఇండియన్)కి సీక్వెల్‍‍గా ఇది తెరకెక్కుతుండటం విశేషం. ఈ సినిమాలో కమల్ హాసన్ సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. బ్రహ్మానందం, సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, ఎస్‍జే సూర్య, బాబీ సింహా తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ సంగీతం సమకూరుస్తుండగా, రవివర్మన్‌ ఛాయాగ్రాహకుడుగా వ్యవహరిస్తున్నాడు. లైకా ప్రొడక్షన్స్, రెడ్ జెయింట్స్ మూవీస్ పతాకాలపై సుభాస్కర్, ఉదయనిధి స్టాలిన్ ఈ మూవీ జులై 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అవుతోంది. ఈ నేపథ్యంలో ‘భారతీయుడు’ చిత్రం మళ్ళీ ప్రేక్షకుల ముందుకు రానుంది. సీక్వెల్‍‍కి ముందు మరోసారి థియేటర్లలో అభిమానులను అలరించనుంది.

ఈ మేరకు తాజాగా ‘భారతీయుడు’ సినిమాను నిర్మించిన స్టార్ ప్రొడ్యూసర్ ఏఎం రత్నం సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించారు. దీనిప్రకారం భారతీయుడు సినిమా జూన్ 7వ తేదీన థియేటర్లలో రీ-రిలీజ్ కానుంది. తమిళంతోపాటు తెలుగులోనూ ఈ సినిమాను రీ-రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా ట్రైలర్ కూడా రిలీజ్ చేసింది చిత్రబృందం. 28 ఏళ్ల తర్వాత మళ్ళీ ఇప్పుడు భారతీయుడు రీ-రిలీజ్ అవుతుండటం విశేషం.

కాగా కమల్ హాసన్ డ్యుయల్ రోల్‍లో నటించిన ‘ఇండియన్’ సినిమా నాడు బ్లాక్‍ బాస్టర్ హిట్ అయింది. శ్రీసూర్య మూవీస్ పతాకంపై ఏఎం రత్నం నిర్మించిన ఈ చిత్రం తెలుగులో ‘భారతీయుడు’ పేరుతో రిలీజై ఇక్కడా సంచలన విజయం నమోదు చేసుకుంది. భారత స్వాతంత్య్ర సమరయోధుడు ‘సేనాపతి’ మరియు అతడి కుమారుడు, అవినీతి అధికారి అయిన చంద్రు పాత్రలను కమల్ పోషించారు.

కమల్ ఈ రెండు పాత్రల్లోనూ జీవించేశారు. ముఖ్యంగా తండ్రి పాత్రలో ఆయన నటన నభూతో.. న భవిష్యత్. ఇక ఇప్పుడు రాబోతున్న సీక్వెల్‍‍లో కూడా సేనాపతి పాత్ర ప్రధానంగా ఉండనుంది. మనీషా కొయిరాలా, ఊర్మిళా మటోండ్కర్ హీరోయిన్లుగా నటించారు. అలాగే సుకన్య, మనోరమ, సెంథిల్, కస్తూరి తదితరులు కీలకపాత్రలు పోషించారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.