ఎన్టీఆర్ జయంతి.. బాలకృష్ణ, జూ.ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ నివాళులు

NTR Jayanthi Nandamuri Balakrishna, Jr NTR and Kalyan Ram Pays Tribute

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత నటుడు నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) 101వ జయంతి నేడు. దీనిని పురస్కరించుకుని ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు మరియు పలువురు టీడీపీ నేతలు ఆయనకు నివాళులు అర్పించారు. ఈ మేరకు మంగళవారం ఉదయం వారంతా హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద తమ ప్రియతమ నాయకుడికి ఘనంగా నివాళులు అర్పించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ఎన్టీఆర్ తనయుడు, హిందూపురం శాసన సభ్యుడు, టాలీవుడ్ అగ్ర హీరో నందమూరి బాలకృష్ణ, ఆయన సోదరుడు రామకృష్ణ మరియు ఇతర కుటుంబ సభ్యులు ఎన్టీఆర్ ఘాట్ వద్ద పుష్ప గుచ్చాలు ఉంచి అంజలి ఘటించారు. వీరితోపాటు టీడీపీ సీనియర్ నేత బక్కని నరసింహులు సహా మరికొందరు కార్యకర్తలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక అంతకుముందు వేకువఝామునే ఎన్టీఆర్ మనవళ్లు, టాలీవుడ్ స్టార్ హీరోలు అయిన జూనియర్, ఎన్టీఆర్ మరియు కళ్యాణ్ రామ్ ఘాట్ వద్దకు చేరుకొని తాతకు ఘనంగా నివాళులు అర్పించారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.