టాలీవుడ్‌లోని క్రియేటివ్ డైరెక్టర్స్‌లో ప్రముఖంగా వినిపించే పేరు సీనియర్ దర్శకుడు గుణశేఖర్. ఆయన చిత్రాలకు ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉందంటే అతిశయోక్తి కాదు. ఒక్కో సినిమాకు ఎక్కువ గ్యాప్ తీసుకునే ఆయన గతేడాది ‘శాకుంతలం’తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. స్టార్ హీరోయిన్ సమంత టైటిల్ రోల్ పోషించగా.. మోహన్ బాబు, దేవ్ మోహన్, అదితి బాలన్ ప్రధాన పాత్రల్లో నటించారు. భారీ అంచనాల నడుమ థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ ఆశించిన ఫలితం అందుకోలేకపోయింది. ఇక దీనికి ముందు ‘రుద్రమదేవి’ చిత్రాన్ని స్టార్ నటి అనుష్కతో తీసి విజయం సాధించిన విషయం గుర్తుండే ఉంటుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ నేపథ్యంలో తాజాగా గుణశేఖర్ కొత్త సినిమాను అనౌన్స్ చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా విషయాన్ని అధికారికంగా వెల్లడించిన ఆయన ఈ సినిమా టైటిల్ ‘యుఫోరియా’గా ప్రకటించారు. ఇక ఈ మూవీ చిత్రీకరణ త్వరలోనే ప్రారంభం అవుతుందని తెలియజేశారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతుండగా.. ఇందులో పనిచేయనున్న నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు. కాగా గుణ హ్యాండ్‌మేడ్ ఫిలిమ్స్ బ్యానర్‌పై నీలిమ గుణ నిర్మిస్తున్న ఈ సినిమాకు గుణశేఖర్ దర్శకత్వం వహించనున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























