
ట్యాగ్ · 19105 కథనాలు · పేజీ 16


టాక్సిక్ రిలీజ్ డేట్ ఫిక్స్

కింగ్ డమ్ షూట్ అప్డేట్

రేపు రిలీజ్ కానున్న సికిందర్ ట్రైలర్

అఫీషియల్.. SSMB29లో పృథ్వీరాజ్ సుకుమారన్

ఐపీఎల్లో కామెంటరీ చెప్పనున్న రాబిన్‌హుడ్ టీమ్

నాయక్ రీ రిలీజ్ కానుంది

నితిన్ అప్ కమింగ్ మూవీస్ ఇవే

జాట్ ట్రైలర్ పోస్ట్‌పోన్

ఓదెల 2 రిలీజ్ డేట్ ఫిక్స్

రాబిన్‌హుడ్ ట్రైలర్ వచ్చేది అప్పుడే

రిలీజ్‌కి రెడీగా తాగితే తందానా

రూమర్స్‌పై క్లారిటీ ఇచ్చిన విజయ్ దేవరకొండ టీమ్

హరిహర వీరమల్లు డబ్బింగ్ స్టార్ట్

మ్యాడ్ స్క్వేర్ సాలిడ్ స్టార్ట్

సీఎం రేవంత్ రెడ్డి, దిల్ రాజుకు TFPC కృతజ్ఞతలు

ఎన్టీఆర్ కటౌట్‌కి పుష్పాభిషేకం చేసిన జపాన్ లేడీ ఫ్యాన్స్
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటించిన 'దేవర పార్ట్ 1' చిత్రం త్వరలో జపాన్‌లో విడుదలవుతోంది. మార్చి 28న ఈ మూవీ జపనీస్ భాషలో జపాన్ వ్యాప్తంగా భారీగా రిలీజ్ కానుంది. అయితే జపాన్‌లో జూనియర్‌కి విశేష ఆదరణ ఉన్న సంగతి తెలిసిందే. ఆయనకు అక్కడ లక్షల సంఖ్యలో అభిమానులున్నారు. ఈ క్రమంలో దేవర మూవీ అక్కడ కూడా బ్లాక్ బస్టర్ అవుతుందని తారక్ అభిమానులు ధీమాగా ఉన్నారు.

టాక్సిక్ రిలీజ్ డేట్ ఫిక్స్
'కేజీఎఫ్' సిరీస్ సినిమాలతో దేశవ్యాప్తంగా పాపులారిటీ తెచ్చుకున్న కన్నడ స్టార్ హీరో యష్ ప్రస్తుతం హీరోగా 'టాక్సిక్' అనే చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. గతంలో తన జన్మదినం సందర్భంగా ఈ మూవీ నుంచి 'బర్త్ డే పీక్' పేరుతో ఒక స్పెషల్ వీడియోను రిలీజ్ చేసి తన అభిమానులకు సర్ప్రైజ్ గిఫ్ట్ అందించాడు యష్.

ఎల్2: ఎంపురాన్ కి రెమ్యూనరేషన్ తీసుకోలేదు- పృథ్వీరాజ్
మాలీవుడ్ ను షేక్ చేస్తుంది ఎల్2: ఎంపురాన్.బ్లాక్ బస్టర్ లూసిఫర్ కు సీక్వెల్ కు వస్తున్న ఈసినిమాకు అక్కడ హైప్ నెక్స్ట్ లెవెల్లో వుంది.ఇక అడ్వాన్స్ బుకింగ్ లో అయితే సెన్సేషన్ క్రీయేట్ చేస్తుంది.ఇప్పటివరకు బుక్ మై షో లో 6 లక్షలకు పైగా టికెట్స్ బుక్ అయ్యాయి.దాంతో రికార్డు బ్రేకింగ్ ఓపెనింగ్స్ ను రాబట్టుకోనుంది.విడుదలకు ఇంకా 5 రోజులు వున్నా టికెట్లకు ఫుల్ డిమాండ్ నెలకొంది.మొదటి రోజు 50 కోట్ల కుపైగా ఓపెనింగ్స్ ను రాబట్టుకోవడం ఖాయంగా కనిపిస్తుంది.

కింగ్ డమ్ షూట్ అప్డేట్
యంగ్ హీరో విజయ్ దేవరకొండ నుండి నెక్స్ట్ వస్తున్న సినిమా కింగ్ డమ్.జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి డైరెక్ట్ చేస్తున్నాడు.రీసెంట్ గా టీజర్ రిలీజ్ చేయగా హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. ఫస్ట్ టైం విజయ్ ఫుల్ లెంగ్త్ యాక్షన్ రోల్ లో సరికొత్త లుక్ లో కనిపించనున్నాడు.ఇక ఈసినిమా పూర్తికావొచ్చింది.కొన్ని రోజుల క్రితం ఓ కీలక షెడ్యూల్ కంప్లీట్ కాగా శ్రీలంక లో 5 రోజుల సాంగ్ షూట్ బ్యాలెన్స్ వుంది.ఈనెలలోనే ఈ షూట్ ఫినిష్ కానుంది.ఇందులో మిస్టర్ బచ్చన్ ఫేమ్ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తుంది.

కోర్ట్.. 8 డేస్ కలెక్షన్స్ ఎంతంటే..?
నేచురల్ స్టార్ నాని నిర్మాణంలో తెరకెక్కిన తాజా చిత్రం 'కోర్ట్ : ది స్టేట్ వర్సెస్ ఎ నోబడీ'. ప్రమోషనల్ కంటెంట్‌తో మంచి బజ్ ఏర్పరచుకున్న ఈ సినిమా మార్చి 14న థియేటర్లలోకి వచ్చింది. ముందురోజే స్పెషల్ ప్రీమియర్స్‌తో పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీ విడుదలయ్యాక యూనానిమస్ పాజిటివ్ రివ్యూస్‌తో పాటు సూపర్ మౌత్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో మొదటి రోజు సెన్సేషనల్ ఓపెనింగ్స్‌ను రాబట్టుకుంది.

రేపు రిలీజ్ కానున్న సికిందర్ ట్రైలర్
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్, సౌత్ డైరెక్టర్ ఏఆర్ మురగదాస్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా సికిందర్.మరో 8రోజుల్లో థియేటర్లలోకి రానుంది.మాములుగా సల్మాన్ ఖాన్ సినిమాలు అనగానే హిందీ లో అంచనాలు ఓ రేంజ్ లో ఉంటాయి కానీ సికిందర్ కు ఆ పరిస్థితి కనిపించడంలేదు. షూటింగ్ దగ్గరి నుండి ఇప్పటివరకు అంత సైలెంట్ గా వుంది.రీసెంట్ గా వచ్చిన టీజర్ కూడా బజ్ క్రీయేట్ చేయలేకపోయింది.

అఫీషియల్.. SSMB29లో పృథ్వీరాజ్ సుకుమారన్
'ఆర్ఆర్ఆర్' తర్వాత దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ఓ చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. '#SSMB29' అనే వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతోన్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై ప్రొడ్యూసర్ కె.ఎల్. నారాయణ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. రాజమౌళి, మహేష్ కాంబోలో వస్తోన్న ఫస్ట్ మూవీ కావడంతో దీనిపై అంతటా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కాగా ఈ సినిమాలో హాలీవుడ్ స్టార్ నటి ప్రియాంక చోప్రా కీలక పాత్ర పోషిస్తోంది.

ఐపీఎల్లో కామెంటరీ చెప్పనున్న రాబిన్‌హుడ్ టీమ్
టాలీవుడ్ యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరో నితిన్ కథానాయకుడిగా నటించిన లేటెస్ట్ మూవీ 'రాబిన్‌హుడ్'. వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో లేటెస్ట్ సెన్సేషన్ శ్రీలీల హీరోయిన్గా నటించింది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ గ్రాండ్‌గా నిర్మించిన రాబిన్‌హుడ్ మార్చి 28న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది.

నాయక్ రీ రిలీజ్ కానుంది
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ,డైరెక్టర్ వి వి వినాయక్ కాంబినేషన్ లో వచ్చిన చిత్రం నాయక్.2013 లో విడుదలైన ఈసినిమా కమర్షియల్ గా సూపర్ హిట్ అనిపించుకుంది.ఇందులో చరణ్ డ్యూయెల్ రోల్ లో కనిపించగా కాజల్ ,అమలా పాల్ హీరోయిన్లుగా నటించారు. చరణ్ నటన, డ్యాన్స్ కు తోడు , బ్రహ్మానందం , పోసాని కృష్ణ మురళి ల కామెడీ ,సాంగ్స్ సినిమాలో హైలైట్ అయ్యాయి.

నితిన్ అప్ కమింగ్ మూవీస్ ఇవే
హీరో నితిన్ నుండి ఇక మీదట వచ్చే సినిమాలు మినిమం గ్యారెంటీ అనేలా వున్నాయి.భీష్మ తరువాత నితిన్ కు అలాంటి సాలిడ్ హిట్ పడలేదు.ఈనెల 28 తను రాబిన్ హుడ్ తో రానున్నాడు.ఈసినిమా షూర్ షాట్ హిట్ అయ్యేలానే కనిపిస్తుంది.ప్రమోషన్స్ కూడా గట్టిగానే చేస్తున్నారు. నితిన్ కూడా ఇంతకుముందు ఎప్పుడు లేనివిధంగా ప్రమోట్ చేస్తూ ఫుల్ కాన్ఫిడెంట్ గా కనిపిస్తున్నాడు.

జాట్ ట్రైలర్ పోస్ట్‌పోన్
టాలీవుడ్ ట్యాలెంటెడ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ హీరో సన్నీ డియోల్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'జాట్'. సన్నీ సరసన సయామీ ఖేర్, రెజీనా కసాండ్రా కథానాయికలుగా నటిస్తుండగా.. బీటౌన్ స్టార్ యాక్టర్ రణ్‌దీప్ హుడా విలన్‌గా నటిస్తున్నాడు. అలాగే మరో ప్రముఖ హిందీ నటుడు వినీత్ కుమార్ సింగ్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడు.

ఓదెల 2 రిలీజ్ డేట్ ఫిక్స్
మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా ప్రధానపాత్రలో నటిస్తోన్న హైలీ యాంటిసిపేటెడ్ మూవీ ‘ఓదెల 2’. 2021లో హిట్ అయిన ‘ఓదెల రైల్వే స్టేషన్’కి సీక్వెల్‌గా తెరకెక్కుతోంది. అశోక్ తేజ దర్శకత్వంలో మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్‌వర్క్స్ బ్యానర్స్ పై నిర్మాత డి మధు నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రమోషనల్ కంటెంట్‌తో ఇప్పటికే హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది.

రాబిన్‌హుడ్ ట్రైలర్ వచ్చేది అప్పుడే
నితిన్ హీరోగా నటించిన హైలీ యాంటిసిపేటెడ్ హీస్ట్ కామెడీ 'రాబిన్‌హుడ్'. వెంకీ కుడుముల దర్శకత్వం వహించగా.. శ్రీలీల హీరోయిన్గా నటించింది. జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం నుంచి రిలీజ్ చేసిన పాటలు ఇప్పటికే చార్ట్ బస్టర్ హిట్ అయ్యాయి. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ రాబిన్‌హుడ్ ట్రైలర్ రిలీజ్ చేయాల్సివుండగా. తాజాగా దీనిని వాయిదా వేసింది.

జాట్‌లో నిధి అగర్వాల్ స్పెషల్ సాంగ్?
అత్యంత ప్రతిభావంతులైన నటి నిధి అగర్వాల్ ప్రస్తుతం రెండు ప్రధాన ప్రాజెక్టులను ఒకేసారి చేస్తోంది. ఆమె రెబల్ స్టార్ ప్రభాస్ సరసన ది రాజా సాబ్ లో మరియు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన హరి హర వీర మల్లు లో నటిస్తోంది. ఈ రెండు చిత్రాలకు నటి అవిశ్రాంతంగా కృషి చేస్తోంది.

రిలీజ్‌కి రెడీగా తాగితే తందానా
టాలీవుడ్ యంగ్ అండ్ ట్యాలెంటెడ్ నటులు త్రిగుణ్, సప్తగిరి కీలక పాత్రల్లో నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'తాగితే తందానా'. ఈ చిత్రాన్ని బీరం సుధాకర రెడ్డి నిర్మిస్తున్నారు. శ్రీనాథ్ బాదినేని దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో సిమ్రాన్ గుప్తా హీరోయిన్గా నటిస్తుండగా.. రియా అనే అమ్మాయి ఇంకో ముఖ్య పాత్ర పోషిస్తుంది.

L2: ఎంపురాన్ కు రాంపేజ్ బుకింగ్స్
మలయాళ సినిమా L 2: ఎంపురాన్ అడ్వాన్స్ బుకింగ్ లో అదరగొడుతుంది.సినిమా రిలీజ్ కు ఇంకా ఆరు రోజుల సమయం వున్నా ట్రెడ్ వర్గాలు సైతం ఆశ్ఛర్యపోయేలా బుకింగ్స్ జరుగుతున్నాయి. గంటకు 93.05 K టికెట్లకు పైగా బుకింగ్స్ తో బుక్ మై షో లో ట్రెండ్ అవుతుంది.ఇంతకుముందు ఏ ఇండియన్ సినిమాకు గంటలో ఇన్ని బుక్ అవ్వలేదు.దాంతో L2: ఎంపురాన్ ఆల్ టైం రికార్డ్ నెలకొలిపింది.ఇంతకుముందు 89k పైగా టికెట్స్ తో పుష్ప 2 మొదటి స్థానంలో ఉండేది.

రూమర్స్‌పై క్లారిటీ ఇచ్చిన విజయ్ దేవరకొండ టీమ్
బెట్టింగ్ యాప్స్ కోసం హీరో విజయ్ దేవరకొండ ప్రచారం చేశాడనే రూమర్స్ స్ప్రెడ్ అవుతున్న నేపథ్యంలో ఆయన టీమ్ దీనిపై క్లారిటీ ఇచ్చింది. స్కిల్ బేస్డ్ గేమ్స్‌కు మాత్రమే విజయ్ దేవరకొండ ప్రచారం నిర్వహించాడని, ఆ కంపెనీలు చట్టప్రకారమే నిర్వహిస్తున్నాయని ఈ సందర్భంగా విజయ్ పీఆర్ టీమ్ తెలియజేసింది. ఆన్ లైన్ స్కిల్ బేస్డ్ గేమ్స్ అనుమతి ఉన్న ప్రాంతాలకు మాత్రమే విజయ్ దేవరకొండ ప్రచారకర్తగా పరిమితమయ్యారని పేర్కొంది.

హరిహర వీరమల్లు డబ్బింగ్ స్టార్ట్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతోన్న పలు ప్రాజెక్టులలో 'హరిహర వీరమల్లు పార్ట్-1: స్వార్డ్ వర్సెస్ స్పిరిట్' ఒకటి. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోన్న ఈ సినిమాకు యువ దర్శకుడు జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఎ. దయాకర్ రావు అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు.

మ్యాడ్ స్క్వేర్ సాలిడ్ స్టార్ట్
బ్లాక్ బస్టర్ మ్యాడ్ కు సీక్వెల్ గా వస్తున్న సినిమా మ్యాడ్ స్క్వేర్.నార్నె నితిన్,సంగీత్ శోభన్ ,రామ్ నితిన్ , విష్ణు ఓయ్ లీడ్ రోల్స్ లో నటించగా కళ్యాణ్ శంకర్ డైరెక్ట్ చేశాడు.ఈసినిమాపై మొదటి నుండి మంచి అంచనాలు ఉండగా రీసెంట్ గా విడుదలైన టీజర్ మరింత హైప్ తీసుకొచ్చింది.జాతిరత్నాలు తరహా లో ఫుల్ ఫన్ కంటెంట్ తో రానుంది.ఇక ఈసినిమా మరో వారంలో థియేటర్లలో రిలీజ్ కానుండగా ఓవర్సీస్ లో అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ అయ్యాయి.ఇప్పటివరకు ఈసినిమాకు యూఎస్ఏ లో 50K డాలర్ల ప్రీ సేల్స్ జరిగాయి.చిన్న సినిమాకు ఈరెంజ్ బుకింగ్స్ అంటే సాలిడ్ స్టార్ట్ అని చెప్పొచ్చు. అక్కడ ఈసినిమా ఎక్కువ థియేటర్లలో విడుదలకానుంది. దాంతో…

సీఎం రేవంత్ రెడ్డి, దిల్ రాజుకు TFPC కృతజ్ఞతలు
2024 సంవత్సరానికి గాను ఉత్తమ చలన చిత్రాలకు, ఉత్తమ కళాకారులు మరియు సాంకేతిక నిపుణులకు “గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్” (GTFA) ను ప్రదానం చేయనున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా తెలుగు చలనచిత్ర పరిశ్రమలోని ప్రముఖులు మరియు గొప్ప వ్యక్తుల పేర్ల మీద పలు అవార్డులు అందించనున్నారు. అవేంటంటే..? (1) NTR జాతీయ చలనచిత్ర అవార్డు (2) పైడి జైరాజ్ చలనచిత్ర అవార్డు (3) బి.ఎన్. రెడ్డి చలనచిత్ర అవార్డు (4) నాగి రెడ్డి మరియు చక్రపాణి చలనచిత్ర అవార్డు (5) కాంతారావు చలనచిత్ర అవార్డు (6) రఘుపతి వెంకయ్య చలనచిత్ర అవార్డులు వున్నాయి.