మాలీవుడ్ ను షేక్ చేస్తుంది ఎల్2: ఎంపురాన్.బ్లాక్ బస్టర్ లూసిఫర్ కు సీక్వెల్ కు వస్తున్న ఈసినిమాకు అక్కడ హైప్ నెక్స్ట్ లెవెల్లో వుంది.ఇక అడ్వాన్స్ బుకింగ్ లో అయితే సెన్సేషన్ క్రీయేట్ చేస్తుంది.ఇప్పటివరకు బుక్ మై షో లో 6 లక్షలకు పైగా టికెట్స్ బుక్ అయ్యాయి.దాంతో రికార్డు బ్రేకింగ్ ఓపెనింగ్స్ ను రాబట్టుకోనుంది.విడుదలకు ఇంకా 5 రోజులు వున్నా టికెట్లకు ఫుల్ డిమాండ్ నెలకొంది.మొదటి రోజు 50 కోట్ల కుపైగా ఓపెనింగ్స్ ను రాబట్టుకోవడం ఖాయంగా కనిపిస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
హైప్ చూస్తుంటే ఎల్2:ఎంపురాన్ ఇంతకుముందు వున్న రికార్డులు అన్ని తుడిచిపెట్టనుంది.పాన్ ఇండియా రిలీజ్ కానుండడం తో ఇతర భాషల్లోనూ సౌండ్ గట్టిగానే చేస్తుంది.తెలుగులో ఈసినిమాను ప్రముఖ నిర్మాత దిల్ రాజు రిలీజ్ చేస్తున్నారు.ఈ సందర్భంగా హైదరాబాద్ లో ప్రెస్ మీట్ నిర్వహించారు.దీనికి మోహన్ లాల్ తోపాటు పృథ్వీరాజ్ సుకుమారన్ హాజరయ్యారు.
ఇందులో పృథ్వీరాజ్ ఆసక్తిర విషయాలు వెల్లడించాడు .ఈసినిమా కు మోహన్ లాల్ సర్ ,నేను ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని ఆయన అన్నారు.అలాగే తెలుగు ప్రేక్షకులు ఈసినిమా ఆదరించాలని తప్పకుండా మీకు నచ్చుతుందని పృథ్వీరాజ్ చెప్పుకొచ్చాడు.ఇక ఈసినిమా బడ్జెట్ 150 కోట్లు.మోహన్ లాల్ , పృథ్వీరాజ్ లాభాల్లో వాటా తీసుకోనున్నారు.ప్రీ రిలీజ్ బిజినెస్100కోట్లు దాటింది.దాంతో హైయెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన మలయాళ సినిమాగా రికార్డు నెలకొల్పింది.
దాదాపు మూడు గంటల రన్ టైం తో ఈసినిమా థియేటర్లలోకి రానుంది.మోహన్ లాల్ ,పృథీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రల్లో నటించగా పృథ్వీరాజే డైరెక్ట్ చేశాడు. ఆశీర్వాద్ సినిమాస్,లైకా ప్రొడక్షన్స్ ,గోకులం మూవీస్ నిర్మించాయి.మరి రిలీజ్ కు ముందే రికార్డులు క్రియేట్ చేస్తున్న ఈసినిమా రిలీజైయ్యాక ఇంకెంత రచ్చ చేస్తుందో చూడాలి.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: